Android Smartphone: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో ఈ 5 తప్పులు చేస్తున్నారా.. అయితే, జాగ్రత్తపడాల్సిందే..

Venkata Chari

Venkata Chari |

Updated on: May 22, 2022 | 7:25 PM

స్మార్ట్‌ఫోన్‌లలో తెలిసి లేదా తెలియక కొన్ని తప్పులు చేస్తుంటాం. వీటివల్ల ఫోన్ చాలా ప్రమాదంలో పడుతుంది. జీవితకాలం కూడా చాలా తగ్గిపోతుంది.

Android Smartphone: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో ఈ 5 తప్పులు చేస్తున్నారా.. అయితే, జాగ్రత్తపడాల్సిందే..
Smart Phones

స్మార్ట్‌ఫోన్‌(Smartphone)లు ప్రస్తుతం చాలా కీలకమైన వస్తువులుగా మారిపోయాయి. దీని ద్వారా అనేక పనులు ఇంటినుంచే చేసుకోవడంతో, ఎన్నో గంటల సమయం ఆదా అవుతోంది. ఉదయం నిద్ర లేపే అలారం నుంచి స్నేహితులతో చాటింగ్(Chatting) వరకు స్మార్ట్‌ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. కానీ, కొన్ని తప్పుల వల్ల మీ స్మార్ట్‌ఫోన్ జీవితకాలం(Lifetime) తగ్గిపోతుంది. మీ స్మార్ట్‌ఫోన్‌తో మీరు చేయకూడని కొన్ని తప్పులను ఇప్పుడు తెలుసుకుందాం.

వేరే ఛార్జర్‌ వాడడం..

చాలామంది ఏదైనా ఛార్జర్‌తో ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటారు. తమ ఫోన్‌కు కేబుల్ కనెక్టర్ ఫిట్ అయితే ఫర్వాలేదని భావిస్తున్నారు. అయితే, ఒరిజినల్ ఛార్జర్ లేదా సపోర్ట్ ఉన్న ఛార్జర్‌తోనే ఫోన్‌ను వీలైనంత వరకు ఛార్జ్ చేయడం మంచింది. చౌక ఛార్జర్‌ను ఎప్పుడూ ఉపయోగించవద్దు. విశ్వసనీయ బ్రాండ్‌ల ఛార్జర్‌లను మాత్రమే కొనుగోలు చేయండి. లేదంటే ఫోన్ బ్యాటరీ లైఫ్ చాలా తగ్గిపోతుంది.

ఇవి కూడా చదవండి

యాప్‌ల డౌన్‌లోడ్..

కొంతమంది వినియోగదారులు Google Play Storeలో యాప్ అందుబాటులో లేనప్పుడు.. అనధికార యాప్ స్టోర్ లేదా వెబ్‌సైట్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేస్తుంటారు. చాలా మంది ఇలానే డౌన్ లోడ్ చేస్తుంటారు. ఈ యాప్‌లు మాల్వేర్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. మీ ఫోన్‌తో పాటు మీకు ఆర్థికంగా కూడా హాని కలిగించే అవకాశం ఉంటుంది.

ఓఎస్ అప్డేట్స్..

పేరున్న మొబైల్ బ్రాండ్‌లు తమ వినియోగదారుల భద్రత కోసం సెక్యూరిటీ అప్‌డేట్‌లు, ఓఎస్‌ను నిరంతరం విడుదల చేస్తుంటాయి. ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అవి ఫోన్ భద్రతను మెరుగుపరుస్తాయి. అలాగే ఫోన్‌ను హానికరమైన దాడుల నుంచి కూడా రక్షిస్తుంది.

పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ని వాడడం..

పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌లు ఉచితంగా లేదా చౌకగా ఉంటాయి. కానీ, అవి భద్రతాపరంగా చూస్తే చాలా ప్రమాదంగా ఉంటాయి. దీంతో చాలా సార్లు హ్యాకర్లు మీ సమాచారాన్ని దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారు. పబ్లిక్ Wi-Fiని ఉపయోగించాలనుకుంటే, మీరు తప్పనిసరిగా VPNని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది.

యాప్‌లను అప్‌డేట్ చేయకపోవడం..

మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసిన యాప్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేస్తూ ఉండండి. మీరు Google Play Store నుంచి అప్‌డేట్స్ చేయవచ్చు. యాప్‌ను చాలా కాలంగా అప్‌డేట్ చేయకపోతే, ఆ యాప్‌లను ఫోన్ నుంచి తప్పక తొలగించాలి. ఇవి ఫోన్‌ను డేంజర్‌జోన్‌లో పడేసే ఛాన్స్ ఉంటుంది.

Also Read: Poco X4 GT: పోకో నుంచి అప్‌డేట్‌ వెర్షన్‌తో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ లీక్‌..!

Blades Design: బ్లేడ్‌ తయారీలో ఈ డిజైన్ అర్థం ఏమిటి..? దీనిని ఎప్పుడు.. ఎవరు తయారు చేశారు..?

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu