- Telugu News Photo Gallery Cricket photos Rcb qualify ipl 2022 playoff bangalore players virat kohli glenn maxwell and faf du plessis celebrate
IPL 2022: ముంబై గెలుపుతో సంబురాలు చేసుకున్న ఆర్‌సీబీ ఆటగాళ్లు.. డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ..
RCB తమ చివరి మ్యాచ్‌లో గెలిచింది. అయినా, నిన్న జరిగిన ముంబై మ్యాచ్‌పైనే ఆశలను పెట్టుకుంది.
Updated on: May 22, 2022 | 2:33 PM

మొత్తానికి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శ్రమకు అదృష్టం తోడైంది. ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్‌గా ఉన్న బెంగళూరు IPL 2022 ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. ఇందుకు ముంబై ఇండియన్స్ సహాయం తీసుకుంది. శనివారం, ముంబై 5 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించింది. తద్వారా ఢిల్లీ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది. దీంతో బెంగళూరు ముందుకు సాగింది. విరాట్ కోహ్లీతో సహా బెంగళూరు ఆటగాళ్ళు సంబరాలు చేసుకున్నారు.

గురువారం జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, బెంగళూరుకు ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ముంబై విజయం సాధించడం అవసరం. బెంగళూరులోని ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, CEO అందరూ ఈ మ్యాచ్‌పై దృష్టి సారించడానికి కారణం కూడా ఇదే.

ముంబై ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో రమణదీప్ సింగ్ ఫోర్ కొట్టడంతో, తమ హోటల్‌లో మ్యాచ్ స్క్రీనింగ్ చూస్తున్న బెంగళూరు ఆటగాళ్లు తమ ప్లేఆఫ్ టికెట్ అందడంతో చిందులేశారు.

జట్టు చివరి మ్యాచ్‌లో 73 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ప్లేఆఫ్‌కు చేరుకునేలా చేసిన కోహ్లి.. ప్లేఆఫ్‌కు చేరిన ఆనందంలో డ్యాన్స్ వేశాడు.

కెప్టెన్ డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్‌తో సరదా మూడ్‌లో కనిపించిన విరాట్ కోహ్లీ.. ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. ఫైనల్‌కు చేరుకోవడానికి రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. మే 25న ఎలిమినేటర్‌లో బెంగళూరు టీం, లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది.




