యాపిల్ నుంచి సరికొత్త హెడ్ సెట్.. కళ్ల ముందే సరికొత్త టెక్ ప్రపంచం, మరిన్ని ఫీచర్లు ఇవే…
ఆపిల్ సంస్థ ఇప్పటికే తన వినూత్నమైన గ్యాడ్జెట్స్ తో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. తాజాగా యాపిల్ సంస్థ ఓ హెడ్ సెట్ ను తయారు చేసింది.

ఆపిల్ సంస్థ ఇప్పటికే తన వినూత్నమైన గ్యాడ్జెట్స్ తో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. తాజాగా యాపిల్ సంస్థ ఓ హెడ్ సెట్ ను తయారు చేసింది. ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో నిలిచింది. ప్రస్తుతం వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఆగ్మంటెడ్ రియాలిటీ వంటి టెక్నాలజీలతో మెటావర్స్ అనే సరికొత్త ప్రపంచం సృష్టించేందుకు అన్ని టెక్నాలజీ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ ప్రయత్నాలకు ఓ అడుగు ముందుకు వేసేలా యాపిల్ సంస్థ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ తయారు చేసి మార్కెట్లో ప్రవేశించేందుకు సిద్ధంగా ఉంది.
WWDC 2023 సమ్మర్ ఈవెంట్‌లో Apple తన మొదటి మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌ను ప్రవేశపెట్టవచ్చని తెలుస్తోంది. ఈ వేరియంట్‌ను 2025 నాటికి మార్కెట్లోకి విడుదల చేయవచ్చు. ఒక నివేదిక ప్రకారం Apple అందించే ఈ సరసమైన మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ ప్రస్తుతం ప్రొటోటైప్ దశలో ఉంది. 2025లో ఇది నెక్స్ట్ జనరేషన్ పరికరంగా మార్కెట్లోకి ప్రవేశించవచ్చు.
కంపెనీ మొదటి మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్ తదుపరి తరం హెడ్‌సెట్‌లలోకి ప్రవేశిస్తుందని ఆపిల్ విశ్లేషకుడు మింగ్-చి కువో పేర్కొన్నారు. ఇందులో హై ఎండ్, లో కాస్ట్ మోడల్స్ కూడా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే ఐఫోన్ ఐప్యాడ్ లైనప్ విషయంలో కూడా కంపెనీ ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోంది.కంపెనీ తక్కువ ధరలో గ్యాడ్జెట్స్ అందుబాటులో ఉంచి రాబడిని పెంచాలనుకుంటోంది.




కంపెనీ హై ఎండ్ తక్కువ ధర హెడ్‌సెట్‌ల మధ్య తేడా ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. ఇటీవలి మార్క్ గుర్మాన్, బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు అల్యూమినియం, గాజు కుషన్‌తో తయారు చేశారు. ఇది Apple M2 ప్రాసెసర్ సాంకేతికతతో వస్తుందని, ఇందులో పెద్ద బ్యాటరీ కూడా ఉంది.
దీనితో పాటు, హెడ్‌సెట్‌లో ఫేస్ రికగ్నిషన్ ఐ ట్రాకింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఆపిల్ తన ఇంటర్‌ఫేస్‌ను దాని ముందు భాగంలో కెమెరా సెన్సార్లు కూడా ఇచ్చే విధంగా తయారు చేస్తుంది. ఈ సెన్సార్లు చేతి కదలికలను కూడా ట్రాక్ చేస్తాయి. 2025లో రానున్న ఈ మిక్స్‌డ్ రియాలిటీ హెడ్‌సెట్‌లు ఉత్తమ అనుభవాన్ని తదుపరి తరం ఫేస్‌టైమ్ అనుభవాన్ని అందిస్తాయి. దీనితో పాటు, ఇది థియేటర్ లాంటి సినిమా స్ట్రీమింగ్ అనుభవాన్ని కూడా ఇస్తుంది. అయితే, Apple XR హెడ్‌సెట్ నేరుగా Meta’s Quest Proతో పోటీ పడుతుందని కూడా భావిస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..