Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dengue Mosquito: దోమలతోనే దోమలకు చెక్.. మీరు విన్నది నిజమే.. డెంగ్యూ దోమలపై యుద్ధానికి కొత్త టెక్నిక్!

ముల్లును ముల్లుతోనే తీయాలనేది ఓ సామెత. మరి అదే విధానాన్ని దోమలకు అన్వర్తిస్తే..అవును డెంగ్యూ వ్యాప్తి దోమల వలెనే జరుగుతుంది. ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా ఈ డెంగ్యూ కారక దోమల్ని నివారించలేకపోతున్నారు.

Dengue Mosquito: దోమలతోనే దోమలకు చెక్.. మీరు విన్నది నిజమే.. డెంగ్యూ దోమలపై యుద్ధానికి కొత్త టెక్నిక్!
Good Mosquitos
Follow us
KVD Varma

|

Updated on: Nov 03, 2021 | 9:24 AM

Dengue Mosquito: ముల్లును ముల్లుతోనే తీయాలనేది ఓ సామెత. మరి అదే విధానాన్ని దోమలకు అన్వర్తిస్తే..అవును డెంగ్యూ వ్యాప్తి దోమల వలెనే జరుగుతుంది. ఎన్నిరకాలుగా ప్రయత్నాలు చేసినా ఈ డెంగ్యూ కారక దోమల్ని నివారించలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ ఇప్పుడు ప్రధాన సమస్యగా మారింది. అందుకే ఇప్పుడు పరిశోధకులు డెంగ్యూ దోమల్ని నివారించడానికి తమ ప్రయోగాలను వేగవంతం చేశారు. అందులో దోమలను నిర్మూలించడానికి శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొన్నారు. ఇండోనేషియాలోని శాస్త్రవేత్తలు డెంగ్యూని వ్యాప్తి చేసే దోమలను చంపే దోమల నిరోధకాన్ని ల్యాబ్‌లో అభివృద్ధి చేశారు. ల్యాబ్‌లో తయారు చేసిన దోమలకు శాస్త్రవేత్తలు ‘మంచి దోమలు’ అని పేరు పెట్టారు. ఈ దోమలు మనిషిని కుడితే డెంగ్యూ రాదని చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిని నిర్మూలించేందుకు వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలోని మోనాష్ విశ్వవిద్యాలయం, ఇండోనేషియాలోని గడ్జా విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పరిశోధకులుగా పాల్గొన్నారు.

ఈ కొత్త దోమల ప్రత్యేకత ఏమిటి? వాటి నుండి డెంగ్యూ రాకుండా ఎలా నివారించావచ్చు? వీటిపై ఇప్పటివరకు చేసిన ట్రయల్స్ ఫలితాలు ఏమి చెబుతున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుముందాం..

కొత్త దోమలు ఎందుకు ప్రత్యేకమైనవి?

ఇందుకోసం శాస్త్రవేత్తలు ప్రత్యేక జాతి దోమలను ఎంచుకున్నారు. డెంగ్యూ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఈ జాతిలో వోల్‌బాచియా బ్యాక్టీరియా కనిపిస్తుంది. ల్యాబ్‌లో ఈ దోమలను పెంచడం ద్వారా వందలాది దోమలను తయారు చేశారు. వోల్బాచియా అనే బ్యాక్టీరియా ఉన్న దోమలకు డెంగ్యూ వైరస్ చేరదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

డెంగ్యూను వ్యాప్తి చేసే ఏడెస్ ఈజిప్టి దోమలో ఈ వ్యాధిని నిరోధించే బ్యాక్టీరియా ఉండదు. డెంగ్యూని వ్యాప్తి చేసే ఏడిస్ ఈజిప్టి దోమలు, ఈ బ్యాక్టీరియా కనుగొనబడిన దోమలతో పెంపకం చేశారు. ఇలా పుట్టే కొత్త దోమల ద్వారా డెంగ్యూ రాకుండా నిరోధించవచ్చు. ఇవి సంతానోత్పత్తి ద్వారా క్రమంగా వాటి జనాభాను పెంచుతాయి. దీర్ఘకాలిక వ్యాధులను వ్యాప్తి చేసే దోమల సంఖ్య తగ్గుతుంది. డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ దోమలు విడుదలచేస్తారు. ఈ విధంగా వ్యాధి కారకాలను నియంత్రించవచ్చు. కొత్త దోమల ద్వారా డెంగ్యూ చక్రాన్ని ఛేదించవచ్చని వరల్డ్ మస్కిటో ప్రోగ్రామ్‌తో సంబంధం ఉన్న పరిశోధకురాలు పూర్వంతి చెప్పారు.

విచారణలో డెంగ్యూ కేసులు 77 శాతం తగ్గాయి..

ఇండోనేషియాలోని యోగ్యకార్తాలోని డెంగ్యూ ప్రభావిత ప్రాంతంలో కొత్త రకం దోమలను పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో ఇక్కడ డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో కొత్త దోమలు విడుదలయ్యాయి. వారి సహాయంతో డెంగ్యూ కేసులు 77 శాతం వరకు తగ్గాయి. న్యూ ఇంగ్లాండ్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధన ప్రకారం, అటువంటి దోమల కారణంగా ఆసుపత్రిలో చేరుతున్న డెంగ్యూ రోగులలో 86 శాతం తగ్గుదల కనిపించింది.

దేశంలో.. ప్రపంచంలో డెంగ్యూ కేసులు..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగాయి. ప్రపంచంలో ఏటా 400 మిలియన్ల మంది వరకు డెంగ్యూ బారిన పడుతున్నారు. గత రెండు దశాబ్దాల్లో డెంగ్యూ కేసులు రెట్టింపు అయ్యాయి. దాని కేసుల్లో 70 శాతం మాత్రమే ఆసియాలో కనిపిస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం డెంగ్యూ కేసులు 1530కి చేరుకున్నాయి. అదే సమయంలో, 2020లో ఇక్కడ 1072 డెంగ్యూ కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి: Diwali 2021: దీపావళి పండగకి ఈ రోగులు దూరంగా ఉండాలి.. లేదంటే పరిస్థితి మరీ దారుణంగా మారుతుంది..

Kilo Class Submarine: నేవీలో కలకలం రేపుతోన్న సబ్-మెరైన్ డేటా లీక్.. తాజా ఛార్జిషీట్‌ దాఖలుతో అధికారుల్లో గుబులు

Airtel: టెలికాం రంగంలో ఎయిర్‌టెల్‌కు లాభాల పంట.. రెండో త్రైమాసికంలో రూ.1,134 కోట్లు ఆదాయం