Diwali 2021: ఈ దీపావళికి మీ సన్నిహితులకు వాట్సాప్‌లో ఇలా విషెస్ చెప్పండి.. కచ్చితంగా ఫిదా అవుతారు..
Diwali 2021: చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండుగల్లో దీపావళి ప్రధానమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిచ్చుబుడ్డి వెలుగులు, లక్ష్మీ బాంబులు భారీ శబ్దాలతో ఉత్సాహంగా...

Diwali 2021: చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడే పండుగల్లో దీపావళి ప్రధానమైందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చిచ్చుబుడ్డి వెలుగులు, లక్ష్మీ బాంబులు భారీ శబ్దాలతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటారు. ఇక వ్యాపారులు దుకాణాల్లో లక్ష్మీ దేవీని ఆరాధ్యంగా పూజిస్తూ సిరిసంపదలు పొందాలని కోరుకుంటూ పూజలు నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే సాధారణ రోజుల్లో ఇతరులను పెద్దగా పలకరించకపోయినప్పటికీ పండుగ రోజుల్లో శుభాకాంక్షలు తెలపడం మనం ఒక ఆనవాయితీగా వస్తుంది.
అయితే టెక్నాలజీ మారుతోన్న ఈ రోజుల్లో కూడా సాధారణ మెసేజ్‌ల రూపంలో విషెస్ చెబితే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే వాట్సాప్‌లో స్టిక్కర్ల రూపంలో దీపావళి శుభాకాంక్షలు చెప్పి మీ సన్నిహితులను, స్నేహితులను సర్‌ప్రైజ్ చేయండి.. ఇంతకీ వాట్సాప్‌లో స్టిక్కర్స్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి.? ఇతరులకు ఎలా పంపించాలో ఇప్పుడు చూద్దాం..
* ముందుగా గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి దీవాలి స్టిక్కర్స్ అని టైప్ చేయాలి.
* అనంతరం మీకు నచ్చిన స్టిక్కర్ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోని సేవ్ చేసుకోవాలి.
* ఇక ఇప్పడు మీరు ఎవరికి విషెస్ చెప్పాలనుకుంటున్నారో వారి చాట్‌ను ఓపెన్ చేయాలి.
* కీబోర్డ్‌లో ఎడవైపు కనిపించే స్మైలీ సింబల్‌పై క్లిక్ చేసి, కింద ఉండే స్టిక్కర్ ఐకాన్‌ను సెలక్ట్ చేసుకోవాలి.
* అప్పటికే మీరే డౌన్‌లోడ్ చేసుకున్న దీవాళి స్టిక్కర్‌లు అక్కడ దర్శనమిస్తాయి.
* వాటిలో మీకు నచ్చిన స్టిక్కర్‌ను ఎన్నుకొని సెండ్ చేస్తే సరిపోతుంది.
చూశారుగా ఇలా సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా వాట్సాప్‌తో మీ శ్రేయోభిలాషులకు వినూత్నంగా దీవాళి విషెస్ తెలపండి.
Also Read: Dhanteras Business: ధన్‌తేరాస్ రోజు జోరందుకున్న బంగారం కొనుగోళ్లు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!
India Post: పదో తరగతి అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్.. వేతనం.. ఇతర వివరాలు..!
Lungs Cancer: పెరుగుతున్న కాలుష్యంతో ముప్పు.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అంతే సంగతులు..