AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JIO Phone Next: అత్యంత చ‌వ‌కైన జియో స్మార్ట్ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? అయితే ఇది మీకోస‌మే..

JIO Phone Next: రిల‌య‌న్స్ సంస్థ అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్‌గా అభివ‌ర్ణించిన జియోఫోన్ నెక్ట్స్ ఎట్ట‌కేల‌కు మార్కెట్లోకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. నిజానికి ఈ ఫోన్ గ‌త వినాయ‌క చవితికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా...

JIO Phone Next: అత్యంత చ‌వ‌కైన జియో స్మార్ట్ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలో తెలియ‌ట్లేదా.? అయితే ఇది మీకోస‌మే..
Jio Phone Next
Narender Vaitla
|

Updated on: Nov 04, 2021 | 7:17 AM

Share

JIO Phone Next: రిల‌య‌న్స్ సంస్థ అత్యంత చ‌వ‌కైన స్మార్ట్ ఫోన్‌గా అభివ‌ర్ణించిన జియోఫోన్ నెక్ట్స్ ఎట్ట‌కేల‌కు మార్కెట్లోకి వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. నిజానికి ఈ ఫోన్ గ‌త వినాయ‌క చవితికే విడుద‌ల కావాల్సి ఉండ‌గా చిప్ కొర‌త కార‌ణంగా త‌యారీ అనుకున్న స్థాయిలో జ‌ర‌గ‌లేదు. దీంతో సంస్థ వీటి విడుద‌ల‌ను దీపావ‌ళికి వాయిదా వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీపావ‌ళి కానుక‌గా ఈరోజు (గురువారం) ఈ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న కంపెనీ చైర్మ‌న్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్ర‌క‌టించారు.

ఇక ఈ ఫోన్‌ను రూ. 6,499కే అందుబాటులోకి తీసుకురానున్నారు. అందులోనూ తొలుత కేవ‌లం రూ. 2500ని ముందుగా చెల్లించి ఫోన్‌ను సొంతం చేసుకోవ‌చ్చ‌ని సంస్థ తెలిపింది. మిగ‌తా మొత్తాన్ని 18/24 నెల‌ల్లో ఈఎమ్ఐ రూపంలో చెల్లించే వెసులుబాటును సంస్థ క‌లిపించింది. ఇదిలా ఉంటే ఈ ఫోన్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇంకా చాలా మందికి తెలియ‌డం లేదు. మ‌రి జియో ఫోన్ నెక్ట్స్ మీ ప్రాంతంలో ఎప్ప‌టి నుంచి అందుబాటులోకి వ‌స్తుంది. వ‌చ్చిన వెంట‌నే మీకు అల‌ర్ట్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇందుకోసం ముందుగా జియో అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంత‌రం స్క్రీన్‌పై క‌నిపించే జియో ఫోన్ నెక్ట్స్ ఫోన్‌పై క్లిక్ చేయాలి.

* త‌ర్వాత ఫోన్ ఫోటో ప‌క్క‌న ఉండే “I am Interested” అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ పేరు, మొబైల్ నెంబర్ వివరాలు నమోదు చేసి జెనెరేట్ ఓటీపీ బ‌ట‌న్‌ను ఎంట‌ర్ చేయాలి.

* మొబైల్‌కి వ‌చ్చిన ఓటీపీని ఎంట‌ర్ చేయ‌గానే వెంట‌నే మ‌రో పేజ్ ఓపెన్ అవుతుంది.

* ఈ కొత్త పేజీలో మీరు ఉంటోన్న ఇంటి వివ‌రాలు, ప్రాంతం, పిన్‌కోడ్ ఎంట‌ర్ చేయాలి.

* దీంతో మీ ప్రాంతంలో జియోఫోన్ నెక్స్ట్ ఫోన్ అమ్మకాలు అందుబాటులోకి వస్తే తెలియజేస్తాము అని మెసేజ్ కనిపిస్తుంది.

* ఇలా మీరు ఉంటున్న చోట ఫోన్‌లు అందుబాటులోకి రాగానే మీకు అల‌ర్ట్ వ‌స్తుంది. అప్పుడు స్థానికంగా ఉన్న జియో స్టోర్‌లోకి వెళ్లి క‌నీస మొత్తాన్ని చెల్లించి ఫోన్‌ను బుక్ చేసుకుంటే స‌రిపోతుంది.

Also Read: Dhanteras Business: ధన్‌తేరాస్‌ రోజు జోరందుకున్న బంగారం కొనుగోళ్లు.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!

IND vs AFG Match Result: టీమిండియా ఘన విజయం.. అర్థ సెంచరీలతో రాణించిన రోహిత్, రాహుల్.. 66 పరుగుల తేడాతో ఆఫ్ఘన్ ఓటమి

T20 World Cup 2021: టీమిండియా సెమీఫైనల్ ఆశలు గల్లంతు..! ఎందుకో తెలుసుకోండి..

Follow Us
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
రెండు వారాలకు కృష్ణుడు పారితోషికం ఎంతో తెలుసా?
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
పాల ప్యాకెట్స్.. గ్రీన్, బ్లూ, ఆరెంజ్ రంగులో ఎందుకు ఉంటాయో తెలుసా
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
గుమ్మడి పువ్వులను తింటే ఎంత మంచిదో తెలుసా? అస్సలే ఊహించరు!
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
వేడి ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెడుతున్నారా? ఏమవుతుందో తెలిస్తే..
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
తల్లి అంత్యక్రియల తేదీపై AI చాట్ బాట్ తప్పుడు సలహా
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
శుభలగ్నంలో మొగుడ్ని అమ్మేసే సీన్ చూసి ఆ పెద్ద హీరో ఏమన్నారంటే..
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
సొంత ఇల్లు లేక.. తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లలేని దుస్థితి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
హార్దిక్ పాండ్యా రీఎంట్రీకి ఓ కండీషన్ పెట్టిన గంభీర్..
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
2030 నాటికి ప్రపంచం అంతం కాబోతుందా? AI చెప్పిన భవిష్యవాణి సంచలనం!
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..
పాతబస్తీలో రూ.10 చిల్లర కోసం దారుణం.. ఆటో డ్రైవర్‌ హత్య..