AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech News: పెట్రోల్‌ ఇంజిన్‌ కారులో డీజిల్‌ నింపితే ఏమవుతుందో తెలుసా..? ఇలా జరిగితే వెంటనే ఏం చేయాలి?

మీ వాహనంలో డీజిల్‌కి బదులు పెట్రోల్.. పెట్రోల్‌కి బదులు డీజిల్ పడితే అది వాహనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. అలా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆటోమొబైల్స్‌ సంస్థలు అందించిన వివరాల ప్రకారం.. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ భిన్నంగా ఉంటుందని, డీజిల్ ఇంజిన్‌లో అలాంటి స్పార్క్ ఉండదని తెలుస్తోంది.

Tech News: పెట్రోల్‌ ఇంజిన్‌ కారులో డీజిల్‌ నింపితే ఏమవుతుందో తెలుసా..? ఇలా జరిగితే వెంటనే ఏం చేయాలి?
Subhash Goud
|

Updated on: Jun 15, 2025 | 5:10 PM

Share

వాహనంలో పెట్రోల్‌,డీజిల్‌ చాలా కీలకం. కొన్ని వాహనాలు పెట్రోల్‌తో నడిస్తే మరి కొన్ని వాహనాలు డీజిల్‌తో మాత్రమే నడుస్తాయి. కానీ వాహనంలో ఏది పడితే అది పోసి నడిపితే వాహనానికి ఏమవుతుందో తెలుసా..? అయితే కారులో డీజిల్ కొట్టించుకోవడానికి వెళ్లినప్పుడు.. పొరపాటున కారులో పెట్రోల్ పోస్తే ఏమవుతుంది? ఇది చాలా చిన్నతప్పుగా కనిపించినప్పటికీ దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని గుర్తించుకోండి. ఎప్పుడైనా పొరపాటును మీ కారు విషయంలో ఇలా జరిగితే తేలికగా తీసుకోకండి. మీ వాహనంలో డీజిల్‌కి బదులు పెట్రోల్.. పెట్రోల్‌కి బదులు డీజిల్ పడితే అది వాహనంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో.. అలా జరిగితే వెంటనే ఏం చేయాలో తెలుసుకుందాం. ఆటోమొబైల్స్‌ సంస్థలు అందించిన వివరాల ప్రకారం.. పెట్రోల్ ఇంజిన్‌లో స్పార్క్ భిన్నంగా ఉంటుందని, డీజిల్ ఇంజిన్‌లో అలాంటి స్పార్క్ ఉండదని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Health Tips: పొరపాటున కూడా ఈ 10 ఆహారాలను పచ్చిగా తినకండి.. ప్రమాదమే..!

ఇది డీజిల్ ఇంజిన్‌లో ఉండదు:

పెట్రోల్ ఇంజిన్ కారులో కార్బ్యురేటర్ ఉంటుంది. అయితే అది డీజిల్ ఇంజిన్‌లో ఉండదు. పెట్రోల్ ఇంజన్లు గాలికి భిన్నంగా పనిచేస్తాయి. డీజిల్ కారులోని డీజిల్.. లూబ్రికేషన్ ఆయిల్‌గా కూడా పనిచేస్తుంది. ఫలితంగా ఇంజిన్ భాగాలు సాఫీగా నడుస్తాయి. అదే సమయంలో దానిలో పెట్రోల్ పోసినప్పుడు అది డీజిల్‌తో కలిసిపోయి ఒక ద్రావణిగా పనిచేయడం ప్రారంభిస్తుంది. ఇది వాహనంలోని ఇంజిన్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. డీజిల్ ఇంజిన్ కారులో పెట్రోల్‌ పోయడం వల్ల కారులోని యంత్ర భాగాల మధ్య ఘర్షణ పెరుగుతుంది. ఫలితంగా ఇంజిన్‌పై దుష్ప్రభావం పడుతుంది.

ఇది కూడా చదవండి: Snake Plants: ఈ 5 మొక్కలు మీ ఇంట్లో ఉంటే పాములు దరిదాపుల్లోకి రావు!

ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం

మీరు పొరపాటున మీ కారులో పెట్రోల్ పోసిన తర్వాత కూడా ఇంజిన్‌ను రన్నింగ్‌లో ఉంచినా లేదా వాహనాన్ని డ్రైవ్ చేసినా.. ఇంజిన్ దెబ్బతినే ప్రమాదం పెరుగుతుందని, లేదా ఇంజిన్ జామ్‌ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు ఆటో మొబైల్‌ టెక్నీషియన్లు.

మరి పెట్రోల్‌ ఇంజిన్‌లో డీజిల్‌ పోస్తే ఏమవుతుంది?

పెట్రోల్ ఇంజిన్‌లో డీజిల్ పోసినప్పుడు ఇంజిన్ భిన్నంగా పనిచేస్తుంది. ఇది కారుపై అంత ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపదు. ఇది డీజిల్ ఇంజిన్ కంటే తక్కువగా స్పందిస్తుంది. ఇంజిన్‌ను స్టార్ట్ చేయలేరు. మీ విషయంలో ఎప్పుడైనా ఇలా జరిగితే.. వెంటనే ఇంజిన్ స్టార్ట్ చేయకండి. వాహనాన్ని ఒక పక్కన నిలిపి.. మెకానిక్ సహాయంతో ఇంధన ట్యాంక్ మార్చండి. మిశ్రమ ఇంధనాన్ని తొలగించండి. ఆ తరువాత తిరిగి పెట్రోల్ లేదా డీజిల్.. మీ కారుకు ఏది సూటవుతుందో దానిని నింపిన తర్వాతే కారును స్టార్ట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: AC Cooling Tips: మీ కారు ఏసీ కూలింగ్‌ తగ్గుతోందా? ఈ పొరపాట్లు కావచ్చు.. ఇలా చేయండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి