Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech Layoffs: ఇక చాలు వెళ్లండి.. ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న మరో దిగ్గజ సంస్థ.. ఏకంగా 18 వేల మంది ఇంటికి..

మీ సేవలు చాలు.. వెళ్లండి..! టెక్ కంపెనీల తీరు ఇప్పుడు ఇలా మారింది. ఒకరితర్వాత ఒకరు తమ స్టాఫ్‌ను తొలిగిస్తున్నాయిజ. అమెజాన్ తన 18 వేల మంది ఉద్యోగులను త్వరలో తొలగించబోతోంది. ఇంతకుముందు అంచనా వేసిన రిట్రెంచ్‌మెంట్ సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. ఈ పరిణామం సాంకేతిక రంగంలో తీవ్ర మాంద్యాన్ని చూపుతోంది. అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ సిబ్బందికి పంపిన మెమోలో ఈ విషయాన్ని ప్రకటించారు.

Tech Layoffs: ఇక చాలు వెళ్లండి.. ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న మరో దిగ్గజ సంస్థ.. ఏకంగా 18 వేల మంది ఇంటికి..
Amazon To Lay Off More Than 18000 EmployeesImage Credit source: TV9 Telugu
Follow us
Sanjay Kasula

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 05, 2023 | 12:54 PM

కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉండాల్సిన కంపెనీలు వారిని అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. కానీ ఇది భారత నైజం కాదు.. పాశ్చాత్య దేశాలు అనుకరించే కార్పొరేట్ కల్చర్. ఈ ప్రభావం ఆ కుటుంబంలో అందరిపై ఉంటోంది. ఇలాంటి సందర్భంలో ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఒక అణుబాంబు లాంటి వార్తను విడుదల చేసింది. అమెజాన్ తన ఉద్యోగులలో 18,000 మందిని తొలగిస్తోంది. ఇంతకుముందు అంచనా వేసిన రిట్రెంచ్‌మెంట్ సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ కావడం ఆందోళన కలిగించే విషయం. ఈ పరిణామం సాంకేతిక రంగంలో తీవ్ర మాంద్యాన్ని చూపుతోంది. అమెజాన్ సీఈవో ఆండీ జాస్సీ బుధవారం సిబ్బందికి పంపిన మెమోలో ఈ విషయాన్ని వెల్లడించారు. సంస్థ వార్షిక ప్రణాళికలో భాగంగా ఈ చర్య తీసుకుంటున్నట్లు తెలిపారు. దాదాపు 10 వేల మందిని తొలగించనునట్లు అంచనా వేశారు ఉద్యోగులు. ఈ ప్రక్రియ ముఖ్యంగా Amazon రిటైల్ విభాగంలో, మానవ వనరులను రిక్రూట్ చేయడం వంటి విభాగాలలో కంపెనీ కార్పొరేట్ ర్యాంక్‌లపై దృష్టి పెడుతుంది.

ఈ వార్తలు వాస్తమేనన్న ఈ-కామర్స్ దిగ్గజం సీఈవో ఆండీ జాస్సీ అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తొలగింపులపై గత ఏడాది నవంబర్‌లోనే తెలిపారు. అనిశ్చితి, కష్టతరమైన ఆర్థిక వ్యవస్థను కంపెనీ కొనసాగిస్తుందని తెలిపారు. 2023లో ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని జాస్సీ హెచ్చరించారు.

దీర్ఘకాలంలో ఇలా..

బ్లూమ్‌బెర్గ్ వెళ్లడించిన సమాచారం ప్రకారం ఆండీ జాస్సీ మాట్లాడుతూ, “అమెజాన్ గతంలో అనిశ్చిత సమయాలను ఎదుర్కొంది. అనేక కష్ట సమయాలను అధిగమించింది. భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగిస్తాం. ఈ సవాళ్లు బలమైన వ్యయ నిర్మాణంతో దీర్ఘకాలిక అవకాశాలను ఉపయోగించుకోవడంలో మాకు సహాయపడతాయి.

చాలా టెక్ కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను..

కొన్ని నెలలుగా అమెజాన్‌లో ఉద్యోగుల తొలగింపు భయాలు ఉన్నప్పటికీ. మహమ్మారి సమయంలో చాలా మందిని తొలగించినట్లు కంపెనీ అంగీకరించింది. దీంతో కంపెనీ ఔట్ లుక్ బలహీనంగా మారింది. అమెజాన్ కంటే ముందు అనేక ఇతర టెక్ కంపెనీలు తొలగింపులను ప్రకటించాయి. అంతకుముందు బుధవారం, సేల్స్‌ఫోర్స్ ఇంక్ తన 10 శాతం మంది ఉద్యోగులను తొలగించి.. దాని రియల్ ఎస్టేట్ హోల్డింగ్‌లను తగ్గించే ప్రణాళికలను ప్రకటించింది.

అమెజాన్ షేర్లు 2 శాతం పెరిగాయి

అమెజాన్ ఈ ప్రకటనపై దాని పెట్టుబడిదారులు సానుకూలంగా స్పందించారు. ఈ వార్తను వాల్ స్ట్రీట్ జర్నల్ మొదటిసారి తన నివేదించిన తర్వాత అమెజాన్ షేర్లు దాదాపు 2 శాతం లాభపడ్డాయి. ప్రస్తుత మాంద్యం సమయంలో 18 వేల మంది ఉద్యోగులను తొలగించడం టెక్ కంపెనీలకు అతిపెద్ద కోత అని చెప్పవచ్చు. అయితే, ఇతర సిలికాన్ వ్యాలీ పోటీదారులతో పోలిస్తే Amazon గణనీయమైన సంఖ్యలో ఉద్యోగులను కలిగి ఉంది. గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి దాని ఉద్యోగుల సంఖ్య 1.5 మిలియన్లకు పైగా ఉంది. అందువల్ల, ప్రస్తుత తొలగింపు దాని మొత్తం శ్రామిక శక్తిలో 1 శాతం అని చెప్పచవచ్చు.

మరిన్ని టెక్నికల్ న్యూస్ కోసం..