AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Super Buck Moon 2022: ఆకాశంలో మరో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్‌ మూన్‌.. ఎప్పుడంటే..

సూపర్‌ మూన్‌.. అవును సూపర్‌ మూన్‌.. ఆకాశంలో ఏర్పడే ఓ అద్భుతం. ఓవైపు భారీ వర్షాల కారణంగా.. వరదలు అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. ఇప్పుడిదే అంశం కొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు, ఆకాశంలో కనిపించే ఈ అద్భుతానికి..

Super Buck Moon 2022: ఆకాశంలో మరో అద్భుతం.. కనువిందు చేయనున్న సూపర్‌ మూన్‌.. ఎప్పుడంటే..
Super Moon 2022
Basha Shek
|

Updated on: Jul 13, 2022 | 5:39 PM

Share

సూపర్‌ మూన్‌.. అవును సూపర్‌ మూన్‌.. ఆకాశంలో ఏర్పడే ఓ అద్భుతం. ఓవైపు భారీ వర్షాల కారణంగా.. వరదలు అల్లకల్లోలం సృష్టిస్తుంటే.. ఇప్పుడిదే అంశం కొత్త చర్చకు దారి తీసింది. అంతేకాదు, ఆకాశంలో కనిపించే ఈ అద్భుతానికి.. వరదలకు ఏదో సైంటిఫిక్‌ కనెక్షన్‌ ఉందన్న ముచ్చట్లూ వినిపిస్తున్నాయి. ఈ సూపర్‌ మూన్‌.. రేపు.. అంటే గురువారం రాత్రి ఆకాశంలో కనువిందు చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే అతిపెద్ద చందమామ.. ఆకాశంలో అద్భుతంలా ఆవిష్కృతం కానుంది. ప్రతీ పౌర్ణమికీ చంద్రుడు నిండుగానే కనిపిస్తాడు. కానీ, ఈ సారి మాత్రం కాస్త అద్భుతం జరగనుంది. అంతేకాదు, ఈ పౌర్ణమి ఎఫెక్ట్‌ సముద్రంపై భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. గురుత్వాకర్షణ శక్తి కారణంగా.. వర్షాలతో పోటెత్తుతున్న వరదను కూడా తనలో కలవనివ్వడం లేదట సాగరం. దీంతో, పోట్లు ఎక్కువై.. వరదనీరు రివర్సు వచ్చేస్తోంది. ఈ కారణంగా, ముంపు గ్రామాలకు మరింత వరద ముంచుకొస్తోంది.

అద్భుత దృశ్యానికి భూగోళం సాక్షిగా నిలుస్తుందన్న ఆనందం ఓ వైపు ఉన్నా.. ఈ ఎఫెక్ట్‌ తో వరదనీరు సముద్రంలో కలవకుండా తిరుగుబాట పట్టడం కలవరపెడుతోంది. ఈ ఎఫెక్ట్‌ ఎంతవరకు ఉంటుందో తెలియని పరిస్థితి. సముద్రంలో ఈ పోట్లు ఎన్నాళ్లనే విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. గురుత్వాకర్షణ కారణంగా.. సముద్రం నీటిని తనలోకి తీసుకోకపోగా.. రివర్సులో నీటిని వెనక్కి నెట్టడం ముంపు గ్రామాలను భయపెడుతోంది. సముద్రం దాకా వెళ్తున్న వరద.. ఈ గురుత్వాకర్షణ శక్తి కారణంగా.. వెనక్కి మళ్లుతోంది.

అసలేంటీ ఈ సూపర్‌ మూన్‌? ఆకాశంలో ఆవిష్కృతమయ్యే ఈ వింతకు కారణమేంటి? అనే చర్చ జరుగుతోందిప్పుడు. బక్‌మూన్‌ అని కూడా పిలుచుకునే.. ఈ సూపర్‌మూన్‌ కు కారణం భూమికి చంద్రుడు అతిసమీపంగా రావడమే. చంద్రుడు తన కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తూ భూమికి అతి సమీపంలోకి వస్తాడు. దీంతో, చంద్రుడు మామూలు పౌర్ణమి రోజుల్లో కనిపించే కంటే.. పెద్దగా కన్పిస్తాడు. పౌర్ణమి రోజుల్లో కన్పించే పరిమాణం కంటే 17శాతం పెద్దగా కన్పిస్తాడు చంద్రుడు.

ఇవి కూడా చదవండి

మళ్లీ ఎప్పుడంటే..

సాధారణంగా అయితే, సూపర్ మూన్ లు పౌర్ణమి రోజునే ఏర్పడతాయి. అయితే అన్ని పౌర్ణమి రోజుల్లో సూపర్ మూన్ ఏర్పడదు. భూమికి అత్యంత సమీపంలోకి చంద్రుడు వచ్చినప్పుడే ఈ సూపర్ మూన్ ఏర్పడుతుంది. ఇటీవల జూన్ 14న కూడా సూపర్ మూన్ ఏర్పడింది. అయితే, అప్పుడు స్ట్రాబెర్రీ రంగులో కన్పించాడు చందమామ. ఒక ఏడాదిలో మూడు, నాలుగు సార్లు ఇలా సూపర్‌మూన్‌ లు ఏర్పడతాయి. 1979లో ఈ సూపర్‌ మూన్ అనే పదాన్ని మొదటి సారి ఉపయోగించారు ఖగోళ శాస్త్రవేత్తలు. మళ్లీ 2023లో జులై 3న ఈ తరహా సూపర్ మూన్ కనువిందు చేయనుందని అంచనా వేస్తున్నారు. ఇవాళ జరిగే మరో అద్భుతం ఏంటంటే… సూపర్‌ మూన్‌ ఏర్పడ్డప్పుడు భూమికి, సూర్యుడికి దూరం బాగా పెరుగుతుంది. సాధారణంగా.. భూమి,ఆకాశం మధ్య దూరం 152.1 మిలియన్ కిలోమీటర్లు కాగా… 1.67 శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా జులై 13న ఈ సూపర్‌ మూన్‌ కనిపించనుంది. మధ్యాహ్నం 2.38 గంటలకు ఆ ‍అద‍్భుతం కనిపించనుందని నాసా తెలిపింది. అంటే.. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి 12.08 గంటలకు అంటే జులై 14న కనిపించనుంది.

మరిన్ని సైన్స్ &  టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి.