- Telugu News Photo Gallery Nothing phone (1) launched in india have a look on features and price details
Nothing Phone (1): భారత మార్కెట్లోకి వచ్చేసిన నథింగ్ ఫోన్… ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Nothing Phone (1): ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తోన్న నథింగ్ (1) స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇప్పటికే అధికారికంగా లాంచ్ అయిన ఈ ఫోన్ తొలి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21న ప్రారంభం కానుంది..
Updated on: Jul 13, 2022 | 12:38 PM

యూకేకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ నథింగ్ భారత మార్కెట్లో తన మొదటి స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. నథింగ్ (1) పేరుతో లాంచ్ చేసిన ఈ ఫోన్ సేల్స్ ఫ్లిప్‌కార్ట్‌లో జూలై 21 నుంచి ప్రారంభం కానుంది.

ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.55 ఇంచెస్ ఫ్లెక్సిబుల్ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్10+, ఫోన్‌కు వెనకా ముందు కోర్‌నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్ట్ అందించడం విశేషం.

క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778+ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో నడిచే ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో విడుదల చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ ధర వేరియంట్‌ను బట్టి రూ. 32,999 నుంచి రూ. 38,999కి అందుబాటులో ఉండనుంది.





























