Tech News: ఐఫోన్‌కు గట్టి పోటీ.. చాట్ GTP నుంచి సరికొత్త ‘ఏఐ స్మార్ట్‌ఫోన్.. యాప్స్‌తో పనిలేని విప్లవాత్మక టెక్నాలజీ
Tech News: మొత్తానికి చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన సామ్ ఆల్ట్‌మాన్ బృందం, ఇప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భాగస్వామ్య కంపెనీల పేర్లు బయటకు రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి..

Tech News: టెక్ ప్రపంచంలో మరో భారీ సంచలనానికి తెరలేవబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్ ఏఐ (OpenAI), ఇప్పుడు నేరుగా హార్డ్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు సాఫ్ట్‌వేర్, చాట్ బాట్‌లతో అదరగొట్టిన ఈ సంస్థ, త్వరలోనే సొంతంగా ‘ఏఐ ఫస్ట్’ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని నిర్ణయించింది.
ప్రముఖ టెక్ విశ్లేషకుడు మింగ్-చి కువో అందించిన తాజా సమాచారం ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ తయారీ కోసం ఓపెన్ ఏఐ దిగ్గజ కంపెనీలతో చేతులు కలిపింది. క్వాల్‌కామ్ (Qualcomm), మీడియాటెక్ (MediaTek), లక్స్‌షేర్ (Luxshare) వంటి సంస్థలతో కలిసి ఓపెన్ ఏఐ ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తోంది. ఈ ఫోన్ల భారీ ఉత్పత్తిని (Mass Production) 2028 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో మనం సాధారణంగా వాడే మొబైల్ యాప్స్ ఉండకపోవచ్చు. దీనికి బదులుగా పూర్తిస్థాయిలో ఏఐ ఏజెంట్ల (AI Agents) ఆధారంగా ఈ ఫోన్ పనిచేస్తుంది. వినియోగదారుడి అవసరాలను గుర్తించి, తనే స్వయంగా పనులను పూర్తి చేసే సామర్థ్యం ఈ ఫోన్ సొంతం. ఇది టెక్నాలజీ వాడకంలో సరికొత్త అనుభూతిని ఇస్తుందని నిపుణులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..!
ఈ డివైస్ కేవలం ఒక ఫోన్‌లా కాకుండా, యూజర్ ప్రస్తుత స్థితిని అర్థం చేసుకునే పరికరంలా ఉంటుంది. యూజర్ ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు వంటి రియల్ టైమ్ డేటాను ఏఐ ఏజెంట్లు విశ్లేషిస్తాయి. ఈ సమాచారం ఆధారంగా యూజర్ అడగకముందే పనులను చక్కబెట్టడం ఈ ఫోన్ ప్రధాన ఉద్దేశం.
హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రెండింటిపై పూర్తి నియంత్రణను ఓపెన్ ఏఐ తన వద్దే ఉంచుకోనుంది. దీనివల్ల వినియోగదారులకు మరింత నాణ్యమైన, సురక్షితమైన సేవలు అందించవచ్చని కంపెనీ యోచిస్తోంది. ఐఫోన్ తరహాలోనే ఒక విభిన్నమైన ఎకోసిస్టమ్‌ను నిర్మించాలని ఓపెన్ ఏఐ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల విషయంలో కూడా సరికొత్త పద్ధతిని అనుసరించే అవకాశం ఉంది. కేవలం ఫోన్ విక్రయించడమే కాకుండా, నెలవారీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌ను (Subscription Model) ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. అంటే యూజర్లు ఫోన్ వాడకానికి నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: Chanakya Niti: చాణక్య నీతి.. నిజమైన శత్రువులు ఎవరు? ఈ 5 గురితో పెట్టుకుంటే సర్వనాశనమే.. వీరితో జాగ్రత్తగా ఉండండి.!
ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా జరిగితే టెక్ దిగ్గజం యాపిల్‌కు ఇది నేరుగా సవాల్ విసిరినట్లే అవుతుంది. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రారాజుగా ఉన్న ఐఫోన్‌కు, ఓపెన్ ఏఐ ఫోన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ ప్రియులు ఈ ఏఐ ఫోన్ కోసం ఇప్పటి నుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ మారుతున్న క్రమంలో యాప్స్ లేని స్మార్ట్‌ఫోన్ అనేది ఒక అద్భుతమైన మార్పుగా మారనుంది. మనిషి ప్రమేయం లేకుండానే పనులు చేసే రోబోటిక్ ఫోన్ల కాలం రాబోతోందని ఈ వార్త స్పష్టం చేస్తోంది. 2028లో రాబోయే ఈ మార్పు టెక్నాలజీ దిశను మార్చడమే కాకుండా, వినియోగదారుల జీవనశైలిని కూడా ప్రభావితం చేస్తుంది.
మొత్తానికి చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన సామ్ ఆల్ట్‌మాన్ బృందం, ఇప్పుడు మొబైల్ ఫోన్ మార్కెట్‌లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక దశలోనే ఉన్నప్పటికీ, భాగస్వామ్య కంపెనీల పేర్లు బయటకు రావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
