Starlink India: ఇండియాలోకి ఎలాన్ మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్.. లాంచ్ డేట్ ఫిక్స్.. ధర ఎంతంటే..?
ఇండియాలోకి త్వరలో ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఇంటర్నెట్ అడుగుపెట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి అన్నీ అనుములు పూర్తి అయ్యే అవకాశం ఉండగా.. కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే లాంచ్ ఉంటుందని అంటున్నారు. కానీ ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎక్కువగా ఉండనున్నాయి.

Starlink satellite internet Lunch: ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్ ఆధ్వర్యంలోని స్టార్ లింక్ తమ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను త్వరలో భారత్‌లో లాంచ్ చేయనుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి అన్నీ అనుమతులు వచ్చాయి. దీంతో 2026 ప్రారంభంలో ఇండియాలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇంటర్నెట్ సర్వీసులు లేని మారుమాల గ్రామాల్లో తొలుత ఈ సర్వీసులను ప్రవేశపెట్టనున్నారు. కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నెట్ సర్వీస్ ప్రైవేడర్ల కంటే స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఛార్జీలు ఎక్కువగా ఉంటాయని సమాచారం.
ధర ఎంత..?
స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ బేస్ ప్లాన్ దాదాపు 25 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇక హై స్పీడ్ ప్లాన్ అయితే 225ఎంబీపీఎస్ వరకు ఉండొచ్చని చెబుతున్నారు. ప్రారంభ ధర రూ.3,300 ఉంటుంది. స్పీడ్‌ను బట్టి రూ.6 వరకు ఉండే అవకాశముందని తెలుస్తోంది. ఇక సెటప్ ఖర్చుగా రూ.30 వేల వరకు చెల్లించాల్సి ఉంటుందట.
లభ్యత
స్టార్ లింక్ ఇంటర్నెట్ సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం గరిష్ట పరిమితి విధించింది. దేశంలో 20 లక్షల కంటే ఎక్కువ కనెక్షన్లు ఉండకూదనే పరిమితి పెట్టింది. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి స్టార్ లింక్ ఇప్పటికే భాగస్వామ్య ఒప్పందాన్ని పొందింది. మిగతా రాష్ట్రాల నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వస్తోంది. ప్రస్తుతానికి కొన్ని స్పెక్ట్రమ్ కేటాయింపులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి అన్నీ ఆమోదాలు పూర్తైతే కొత్త ఏడాది ప్రారంభంలోనే స్టార్ లింక్ ఇంటర్నెట్ కనెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీసులు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ ఇంటర్నెట్‌ను ప్రజలను ఉపయోగించుకోవచ్చు.




