Music App: మూడ్‌కు తగ్గట్లు పాటలు ప్లే అయితే..? కొత్త టెక్నాలజీ పేటెంట్ హక్కులు పొందిన మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ..
Spotify Coming With New Technology: ఒకప్పుడు పాటలు వినాలనుకుంటే రేడియోలు ఉండేవి ఆ తర్వాత క్యాసెట్లు, సీడీలు, మెమోరీ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం రోజులు మారాయి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక...

Spotify Coming With New Technology: ఒకప్పుడు పాటలు వినాలనుకుంటే రేడియోలు ఉండేవి ఆ తర్వాత క్యాసెట్లు, సీడీలు, మెమోరీ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం రోజులు మారాయి స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్నెట్ ఆధారంగానే పాటలు వింటున్న రోజులివీ. అయితే టెక్నాలజీ ఎంతలా మారినా మనకు నచ్చిన పాటలు లేదా సదరు యాప్‌లో పొందుపరిచిన పాటలనే వింటుంటాం. అలా కాకుండా మీ మూడ్, మీరున్న పరిస్థితులను బట్టి, మీ ఎమోషన్ ఆధారంగా పాటుల ప్లే అయితే ఎలా ఉంటుంది.. ఆలోచించడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ మరికొన్ని రోజుల్లో ఇది నిజం కానుంది. ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ సంస్థ స్పాటిఫై సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానుంది. యూజర్ మాట్లాడే టోన్ ఆధారంగా పాటలను యూజర్‌కు సూచిస్తుంటాయి. స్పాటిఫై ఇప్పటికే ఈ కొత్త సాంకేతికతకు సంబంధించిన పేటెంట్ హక్కులను సైతం పొందింది. ఇందులో భాగంగా ఈ టెక్నాలజీకోసం స్పాటిఫై 2018 ఫిబ్రవరిలోనే దరఖాస్తు చేసుకుంది. తాజాగా యునైటెడ్ స్టేట్స్ పేటెంట్ అండ్ ట్రేడ్ మార్క్ ఆఫీస్(యుఎస్పిటిఓ) ఆ పేటెంట్‌కు ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Also Read: Phone Battery and Charger: ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ మరొక ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తే… Artificial Intelligence: కృత్రిమ మేధ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాలంటే సమయం పడుతుంది… గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్…




