Phone Battery and Charger: ఒక కంపెనీ ఫోన్ ఛార్జర్ మరొక ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ కోసం ఉపయోగిస్తే…
గత ఆరేళ్ళ నుంచి సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ ల వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరి చేతిలోచూసినా స్మార్ట్ ఫోనే. ఫోన్ వాడాలంటే ముఖ్యంగా..
Phone Battery and Charger: గత ఆరేళ్ళ నుంచి సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ ల వాడకం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఇంటర్నెట్ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎవరి చేతిలోచూసినా స్మార్ట్ ఫోనే. ఫోన్ వాడాలంటే ముఖ్యంగా ఉండాల్సింది ఛార్జింగ్. అయితే రాను రాను ఫోనే ఛార్జింగ్ సరిగా లేకపోవడం, బాటరీ పని చేయకుండా పోవడం జరుగుతుంది. అయితే దీనికి బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోవడానికి ఎక్కువ కారణం ఒకటే అంటున్నారు నిపుణులు. అదే బాటరీ చార్జర్. బ్యాటరీ దెబ్బతినడాకిని, ఛార్జింగ్ సరిగా లేకపోవడానికి కారణం ఈ చార్జర్ వల్లే అంటున్నారు. ప్రతి కంపెనీ ఫోన్ కు తగిన చార్జర్ ఉంటుంది. అది కేవలం ఆ కంపెనీ ఫొన్ లకు మాత్రమే ఛార్జింగ్ చేసుకోవడానికి వినియోగించాలి. ఆలా కాకుండా ఇతర ఫొన్ లకు వాడినట్టయితే కొంతకాలానికి ఛార్జింగ్ సరిగా లేక బ్యాటరీ లైఫ్ కూడా తగ్గిపోతుంది. ప్రతి కంపెనీ ఫొన్ కు దాని రెసిస్టెన్స్ ప్రకారం చార్జర్ ను తయారు చేస్తాయి.
ఫోన్ నుంచి వచ్చే హీట్ ను తగ్గించుకోవడానికి వాడే ‘హీట్ సింక్’ సామర్ధ్యం ఎంత ఉంటుందో. అందుకు తగ్గట్టే ఫోన్ చార్జర్ కూడా తయారు చేస్తారు. దీనివల్ల వాడే ఫొన్ కు తగ్గట్టే హీట్ ను తట్టుకునేందుకు చార్జర్ లో ఉండే హీట్ సింక్ ఉపయోగపడుతుంది. అది ఒక్కో కంపెనీ ఫోన్ కు ఒక్కో విధంగా తయారు చేయబడుతుంది. పైగా ఇతర చార్జర్ వాడకం వల్ల వచ్చే హీట్ ఆ ఫోన్ కు సరిపడకపోవచ్చు. దీంతో బ్యాటరీ ఉబ్బి నిరుపయోగంగా మారుతుంది. ఇలా ఒకే చార్జర్ ను వివిధ కంపెనీల మొబైల్స్ కు వాడినట్టయితే ఫోన్లో ఉండే రేడియేషన్ ఒకదాని ద్వారా మరొక ఫోన్ కు వ్యాపిస్తుంది. దాని కారణంగా ఫోన్ హ్యాంగ్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక్కోసారి ఫోన్ సాఫ్ట్ వేర్ పనిచేయకుండా పోయే ప్రమాదం కూడా ఉందని నిపుణులు అంటున్నారు.కనుక స్మార్ట్ ఫోన్ వాడే వినియోగదారులు ఛార్జింగ్ అవుతుంది కదా అని ఏ ఛార్జర్ కంటికి కనిపిస్తే ఆ ఛార్జర్ ఫోన్ కి ఉపయోగిస్తే.. బ్యాటరీ లైఫ్ పాడైపోతుందని అంటున్నారు.
Also Read: మీడియా సిబ్బందికి త్వరలో కరోనా వ్యాక్సిన్.. పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి ఈటెల వెల్లడి