Telangana Pulse Polio : మీడియా సిబ్బందికి త్వరలో కరోనా వ్యాక్సిన్.. పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి ఈటెల వెల్లడి

తెలంగాణాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు .. రాజధాని హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు..

Telangana Pulse Polio : మీడియా సిబ్బందికి త్వరలో కరోనా వ్యాక్సిన్.. పల్స్ పోలియో కార్యక్రమంలో మంత్రి ఈటెల వెల్లడి
Follow us

|

Updated on: Jan 31, 2021 | 1:43 PM

Telangana Pulse Polio : తెలంగాణాలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మూడురోజుల పాటు .. రాజధాని హైదరాబాద్ లో నాలుగు రోజుల పాటు పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. శామీర్ పెట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మంత్రి మల్లారెడ్డి తో కలిసి మంత్రి ఈటెల రాంజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఐదేళ్ల లోపు చిన్నారుకు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పల్స్‌ పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సిన్‌ కూడా వేస్తామని చెప్పారు. మొత్తం 33 జిల్లాల్లో పోలియో చుక్కలను పంపిణీ చేస్తున్నామని.. మొత్తంరాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ 23,331 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరో 877 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు.

మీడియా సిబ్బందికి కూడా కరోనా టీకా అందించాలని శనివారమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. శామీర్‌పేట దవాఖానను త్వరలో ట్రామా కేర్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. మహబూబాబాద్‌లో మంత్రి సత్యవతి, కందుకూరులో మంత్రి సబిత ఇంద్రారెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ ఆరోగ్య కేంద్రంలో ఎమ్మెల్యే జోగు రామన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేసిశారు. వనపర్తి జిల్లాలో పోలియో చుక్కలు పంపిణీ కొనసాగుతున్నది. తన పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే దివాకర్ రావు పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also Read: పరిమాణంలో చిన్నగా ఉన్న ఆవగింజ ఆరోగ్యానికి కొండంత మేలు… !