Spoofing attack: మిమ్మల్ని నిలువునా ముంచేయడానికి నకిలీ వెబ్‌సైట్‌లు సిద్ధం అయిపోతున్నాయి.. జాగ్రత్త పడండి ఇలా!
టెక్నాలజీ పెరిగిపోతోంది. దానితో పాటు నేరాల తీరూ మారిపోతోంది. అందులోనూ ఇప్పుడు అన్ని వ్యవస్థలూ ఆన్ లైన్ గా మారిపోయాయి. వెలి కొనలతోనే మన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసేసుకుంటున్నాం.
Spoofing attack: టెక్నాలజీ పెరిగిపోతోంది. దానితో పాటు నేరాల తీరూ మారిపోతోంది. అందులోనూ ఇప్పుడు అన్ని వ్యవస్థలూ ఆన్ లైన్ గా మారిపోయాయి. వెలి కొనలతోనే మన బ్యాంకింగ్ పనులు పూర్తి చేసేసుకుంటున్నాం. మనలో బ్యాంకు మొహం చూడని వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. బ్యాంకులకు సమబంధించినవే కాకుండా అనేక రకాలైన ఆర్ధిక లావాదేవీలు అన్నీ స్మార్ట్ ఫోన్ తో కానిచ్చేస్తున్నాము. అటువంటి పరిస్థితిలో, సైబర్ నేరగాళ్లు కూడా దీనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సైబర్ నేరాల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల సైబర్ నేరాల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. సైబర్ నేరాల పద్ధతుల్లో స్పూఫింగ్ (Spoofing) ఒకటి. ఈ స్పూఫింగ్ అంటే ఏమిటి దానిని నివారించడానికి గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏమిటో మనం తెలుసుకుందాం.
స్పూఫింగ్ అంటే ఏమిటి?
వెబ్‌సైట్ స్పూఫింగ్‌లో నేరగాళ్ళు ఒక నకిలీ వెబ్‌సైట్ సృష్టిస్తారు. దాని ఉద్దేశ్యం ఆ నకిలీతో వ్యక్తుల్ని మోసం చేయడం. సైబర్ నేరగాళ్లు సరైన వెబ్‌సైట్ పేరు, లోగో, గ్రాఫిక్స్, కోడ్‌ని ఒరిజినల్‌గా కనిపించేలా నకిలీ వెబ్‌సైట్ సిధం చేస్తారు. వారు మీ బ్రౌజర్ విండో ఎగువన చిరునామా ఫీల్డ్‌లో కనిపించే URL ని కూడా కాపీ చేయవచ్చు. దీనితో పాటు, వారు కుడి వైపున ఇవ్వబడిన ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని కూడా కాపీ చేస్తారు.
సైబర్ నేరగాళ్లు దీన్ని ఎలా చేస్తారు?
నేరస్థులు నకిలీ వెబ్‌సైట్ కోట్ చేస్తూ ఇమెయిల్‌లను పంపుతారు. మీరు ఆ ఈ మెయిల్ సహజంగానే తెరిచి చూస్తారు. ఈ ఈ మెయిల్ ద్వారా సంబంధిత సమాచారాన్ని అప్‌డేట్ చేయమని లేదా నిర్ధారించాలని మిమ్మల్ని కోరుతారు. ఖాతాకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పొందాలనే ఉద్దేశ్యంతో ఇది జరుగుతుంది. మీరు ఇది నిజమైన వెబ్సైట్ అనుకుని దానిలో మీ వివరాలు నింపుతారు. వారు అడిగే వివరాలలో మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి, పాస్‌వర్డ్, పిన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ నంబర్, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ (సివివి) నంబర్ ఉంటాయి.
స్పూఫింగ్ నివారించడానికి భద్రతా చిట్కాలు
ఏదైనా రహస్య సమాచారం కోసం బ్యాంక్ ఎప్పటికీ ఇమెయిల్ పంపదని గుర్తుంచుకోండి. పిన్, పాస్‌వర్డ్ లేదా అకౌంట్ నంబర్ వంటి మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ భద్రతా వివరాలను కోరుతూ మీకు ఇమెయిల్ వస్తే, మీరు దానికి ప్రతిస్పందించకూడదు.
పెడ్‌లాక్ చిహ్నాన్ని తనిఖీ చేయండి. వారు బ్రౌజర్ విండోలో ఎక్కడైనా ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని చూపుతారు. ఉదాహరణకు, మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో, బ్రౌజర్ విండో దిగువ కుడి వైపున లాక్ ఐకాన్ కనిపిస్తుంది. భద్రతకు సంబంధించిన వివరాలను తనిఖీ చేయడానికి సైట్‌పై డబుల్ క్లిక్ చేయండి.
వెబ్‌పేజీ URL ని తనిఖీ చేయండి. వెబ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, URL లు “http” తో మొదలవుతాయి. అయితే, సురక్షితమైన కనెక్షన్‌లో, చిరునామాలు https తో ప్రారంభమవుతాయి. https అంటే పేజీ సురక్షితంగా ఉంది. ఇక్కడ సర్వర్‌కు పంపే ముందు యూజర్ పేరు.. పాస్‌వర్డ్ ఎన్‌క్రిప్ట్ చేయడం జరుగుతుంది.
ఇవి కూడా చదవండి: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం