Knife: ఇదో సూపర్ కత్తి.. స్టీల్‌తో చేసింది కాదు..నాన్ వెజ్ కూడా స్మూత్ గా కట్ చేయొచ్చు..దీనిని దేనితో చేశారో తెలుసా?

త్తిని తయారు చేయడానికి ఏ లోహం వాడుతారు? ఈ ప్రశ్న వేస్తే మీరు అది కూడా తెలీదా? అన్నట్టు చూస్తారు కదూ. తెలుసుకానీ, మీరు అనుకుంటున్న సమాధానం ఇకపై తప్పు కావచ్చు.

Knife: ఇదో సూపర్ కత్తి.. స్టీల్‌తో చేసింది కాదు..నాన్ వెజ్ కూడా స్మూత్ గా కట్ చేయొచ్చు..దీనిని దేనితో చేశారో తెలుసా?
Knife With Non Veg

Knife: కత్తిని తయారు చేయడానికి ఏ లోహం వాడుతారు? ఈ ప్రశ్న వేస్తే మీరు అది కూడా తెలీదా? అన్నట్టు చూస్తారు కదూ. తెలుసుకానీ, మీరు అనుకుంటున్న సమాధానం ఇకపై తప్పు కావచ్చు. ఇన్నాళ్ళూ మనకు తెలిసింది కత్తిని స్టీల్ తో చేస్తారు.. ఇనుముతో చేస్తారు అని మాత్రమే. సరే దీనిని పక్కన పెడితే.. చెక్కతో మీరు ఏమేం పనులు చేయగలరు? మళ్ళీ ఈ ప్రశ్న పిచ్చిదిగానే కనిపిస్తోంది కదూ. కత్తితో కూరగాయలు చెక్క మీద పెట్టి తరుక్కోవచ్చు అనేది ఈ ప్రశ్నకు ఉన్న అనేక సమాధానాలలో ఒకటి. అంతే కదా. అబ్బా.. ఏమిటీ ప్రశ్నలు.. జవాబులూ కార్యక్రమం విషయం చెప్పండి అంటారా? అక్కడికే వస్తున్నాం. చెక్కతో కత్తిని తయారు చేశారు శాస్త్రవేత్తలు. ఎదో కత్తి ఆకారం చేశారేమో దానికి ఇంత హంగామా ఏమిటి అనకండి. నిజం తెలిస్తే మీరు బోలెడు ఆశ్చర్యపోతారు.

మరి అదేమిటో తెలుసుకుందామా?

శాస్త్రవేత్తలు చెక్కతో పదునైన కత్తిని తయారు చేశారు. ఇది స్టీల్ కత్తి కంటే 3 రెట్లు పదునైనది. కలపను ప్రత్యేక మార్గంలో కుదించడం ద్వారా దీనిని తాయారు చేశారు. దీనిని తయారు చేసిన అమెరికాలోని మేరీల్యాండ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు, ఈ కత్తితో నాన్ వెజ్ పదార్ధాలను కూడా వెన్నను కట్ చేసినంత చక్కగా స్మూత్ గా కట్ చేయవచ్చని చెబుతున్నారు.

చెక్క కత్తి తయారైంది ఇలా..

కత్తిని తాయారు చేయడానికి కలపలో కొంత భాగాన్ని తీసుకున్నారు. దానిని ఒక ప్రత్యేక రసాయనంలో ఉంచిన తర్వాత, దానిని కంప్రెస్ చేశారు. అలా చాలాసార్లు చేయడం ద్వారా చెక్క నుండి నీరు, తేమను పూర్తిగా తొలిగించారు. దీంతో ఆ చెక్క గట్టిపడుతుంది. అప్పుడు దాని నుండి ఒక కత్తి తయారు చేశారు. ఈ విధంగా తయారు చేసిన కలప సాధారణ కంటే 23 రెట్లు బలంగా తయారవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఇది పర్యావరణానికి ఏ విధంగానూ హాని కలిగించదు.

శాస్త్రవేత్తలు ప్రస్తుతం అందుబాటులో ఉన్న కత్తులు ఉక్కు లేదా సిరామిక్ నుండి తయారు అవుతున్నాయని చెబుతున్నారు. కత్తి చేయాలంటే దాని మెటీరియల్ కఠినంగా ఉండాలి. అదే సూత్రంపై ఇన్నాళ్ళూ కత్తులు చేస్తూ వస్తున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చెక్క కత్తులు కూడా అంతే కఠినంగా ఉన్నాయని చెప్పారు. ఈ కత్తి మార్కెట్‌లో ఎంతకాలంలో అందుబాటులో ఉంటుంది అనే విషయాన్ని శాస్త్రవేత్తలు అధికారిక ప్రకటన చేయలేదు.

చెక్క ఎందుకు గట్టిగా ఉంటుంది..

చెక్క ఎందుకు గట్టిగా ఉంటుంది..దానితో ఎలా కత్తిని చేయవచ్చు అనేదాని గురించి పరిశోధకుడు టెంగ్ లి వివరించారు. ”చెక్కలో సెల్యులోజ్ అనే మూలకం ఉంటుంది. కలప దట్టంగా.. బలంగా ఉండటానికి ఇదే కారణం. ఈ కారణంగా చెక్కను సెరామిక్స్, లోహాల కంటే బలంగా తయారుచేయవచ్చు. అయితే కలప ఈ నాణ్యత ఇప్పటి వరకు ఎవరూ బయటకు తీయలేదు. ఇప్పుడు మేము కత్తి ద్వారా ఈ విషయాన్ని ముందుకు తెస్తున్నాము.” అని టెంగ్ లి చెప్పారు. దీనిగురించి ఇంకా వివరిస్తూ లీ ఇలా చెప్పారు. ”కలపలో 40 నుండి 50 శాతం సెల్యులోజ్ ఉంటుంది. మిగిలినవి హేమిసెల్యులోజ్..లిగ్నిన్ మూలకాలు. ఇవి బలహీనంగా ఉంటాయి. అందుకే చేక్కలోని ఇటువంటి బలహీన అంశాలను తొలగించి సెల్యులోజ్ ను కత్తి తాయారు చేయడానికి ఉపయోగించాము.”

డస్ట్ రెసిస్టెంట్ నైఫ్

జర్నల్ మ్యాటర్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం, ఈ కత్తికి పదునైన అంచు మాత్రమే కాదు, దుమ్ము నిరోధక శక్తి కూడా ఉంది. అంటే, దీనికి దుమ్ము అంటుకోదు. కాబట్టి మీరు ఆహార పదార్థాలను కట్ చేసినపుడు సంక్రమణ ప్రమాదం తక్కువగా ఉంటుంది. దీని అంచును కూడా సాధారణ కత్తిలాగా పదును పెట్టవచ్చు. అదేవిధంగా ఈ చెక్క కత్తిని ఉపయోగించిన తరువాత చక్కగా కడిగి పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: AP-TS నీటి పంచాయితీ.. మీ మార్గదర్శకాలు బచావత్ ట్రైబ్యునల్‌కు విరుద్ధమంటూ తెలంగాణ మరో లేఖాస్త్రం

Cyber Security: సైబర్ సెక్యూరిటీ ఛాలెంజింగ్‌గా మారిన నేపథ్యంలో తెలంగాణలో యావత్ దేశానికే పయినీర్‌లా ఉండే పాలసీ

Pakistan: మళ్ళీ గ్రే లిస్టులో పాకిస్తాన్‌.. టెర్రరిజానికి కొమ్ము కాస్తున్నందుకు రెట్టింపైన పాక్ కష్టాలు!

Click on your DTH Provider to Add TV9 Telugu