Speed Camera: టెక్నాలజీతో స్పీడ్ కెమెరాల కళ్ళు కప్పి దూసుకెళ్లిన ఘనుడు..ఎలా చిక్కాడంటే?
కారు స్పీడు లిమిట్ దాటిందంటే ఫైన్ పడినట్టే. మనదేశంలో ఈ మధ్య అటువంటి పద్ధతిని కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఇది ఉంది.
కారు స్పీడు లిమిట్ దాటిందంటే ఫైన్ పడినట్టే. మనదేశంలో ఈ మధ్య అటువంటి పద్ధతిని కఠినంగా అమలు చేస్తున్నారు. కానీ, విదేశాల్లో ఎప్పటినుంచో ఇది ఉంది. అయితే, దీనిని తప్పించుకునే మార్గాలూ అక్కడ కొంతమంది వెతుకుతున్నారు. ఓ ప్రబుద్ధుడు తన కారుకు లేజర్ జామర్ అమర్చి స్పీడ్ గన్ లకు దొరకకుండా తప్పించుకుని తిరిగేశాడు. పోలీసులు ఈ విషయాన్ని కనిపెట్టి ఆ డ్రైవర్ ను కటకటాల వెనక్కి పంపించారు. ఈ సంఘటన స్వాన్సీ దేశంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్వాన్సీలోని యనిస్‌ఫోర్గన్‌కు చెందిన కీత్ జాన్, 64, స్పీడ్ కెమెరాలకు దొరక్కుండా తిరగడం కోసం తన కారు ముందు రెండు లేజర్ జామర్‌లను అమర్చుకున్నాడు. అయితే, అతను న్యాయస్థానంలో వాటిని పార్కింగ్ సెన్సార్లుగా ఉపయోగిస్తున్నానని చెప్పాడు. అంతేకాకుండా జామర్ల ఉపయోగం వెలుగులోకి వచ్చినప్పుడు వేగ పరిమితిని ఉల్లంఘించలేదని అతను పేర్కొన్నాడు. అయినా కోర్టు అతని వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.
గో సేఫ్ సైమ్రు వద్ద ఈ డ్రైవర్ పోలీసు అధికారి బ్రెకాన్ కు దొరికిపోయాడు. అతని కారు వేగంగా వెళ్లడం గమనించాడు. కానీ స్పీడ్ కెమెరాలో ఆ కారు వేగం గుర్తింపు జరగలేదు. దాంతో అనుమానం వచ్చిన బ్రెకాన్ కారును వెంబడించి ఆపాడు. అప్పుడు ఆ సిల్వర్ మెర్సిడస్ కారు కారు ముందు భాగంలో నంబర్ ప్లేట్ కు రెండువైపులా నల్ల దీర్ఘచతురస్రాకార వస్తువులను అమర్చినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ పరికరాలు లేజర్ జామర్స్ అని నిర్ధారించారు. అదేవిధంగా డైఫెడ్-పోవిస్ పోలీసులకు చెందిన పిసి వైట్, పిసి జోన్స్ జాన్ ఇంటికి వెళ్లి అదే పరికరాలతో అమర్చిన మరో రెండు వాహనాలను కనుగొన్నారు. రోడ్ సేఫ్టీ సపోర్ట్ వద్ద ఫోరెన్సిక్ ఇంజనీర్ స్టీవ్ కల్లఘన్ ఈ రెండు వాహనాలు, మెర్సిడెస్ వాహనాల్లో జామర్ లు అమర్చినట్టు నిర్ధారించారు.
ఈ లేజర్ జామర్లు పరారుణ కాంతి ప్రకాశవంతమైన వెలుగులను స్పీడ్ కెమెరా పరికరం వైపుకు పంపుతాయి,. దీంతో ఈ కెమెరా తగినంతగా పనిచేయదు. అదేవిధంగా కారు నడుపుతున్న వేగాన్ని ఖచ్చితమైన రీడింగ్ తీసుకోలేదు. లేదా అసలు రీడింగ్ కొలవలేదు.
మొత్తమీద స్పీడ్ కెమెరాలను బోల్తాకొట్టించిన సదరు డ్రైవర్ పోలీసులకు చిక్కి జైలుపాలు అయ్యాడు.
Semi Conductor: చిన్న చిప్ కోసం ఆపిల్ కంపెనీ అదిరిపడుతోంది.. ఎందుకో తెలుసా?