Spam Calls: స్పామ్ కాల్స్‌పై ప్రభుత్వం సీరియస్.. కీలక ఉత్తర్వులు..

స్పామ్ కాల్స్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు భారతదేశ టెలికాం వాచ్‌డాగ్ చర్యలు తీసుకుంది. రిజిస్టర్ చేయని కాలర్ల నుంచి వచ్చే అన్ని ప్రమోషనల్ కాల్స్ ను ఆపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించింది. పెరుగుతున్న స్పామ్, ఫిషింగ్ కాల్స్ ను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కాబట్టి అలాంటి వారిని కట్టడి చేయాలని కోరింది.

Spam Calls: స్పామ్ కాల్స్‌పై ప్రభుత్వం సీరియస్.. కీలక ఉత్తర్వులు..
Spam Calls
Follow us

|

Updated on: Aug 14, 2024 | 4:54 PM

నేడు ప్రతి పనికీ ఫోన్ అవసరం. ఉదయం లేచినప్పటి నుంచి బంధువులు, స్నేహితులు, సహచరులు, వ్యాపార భాగస్వాములు ఇలా అనేక మందితో మాట్లాడుతూ ఉంటాం. అనేక ఆర్థిక లావాదేవీలు, పనులను ఫోన్లను ఉపయోగించి నిర్వర్తిస్తాం. ఇదే సమయంలో స్పామ్ కాల్స్ (మార్కెటింగ్ కాల్స్) చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మన అత్యవసర పనికి ఆటంకం కలిగిస్తాయి. అన్ నౌన్ నంబర్ల నుంచి వచ్చే అలాంటి కాల్స్ ను స్వీకరించకుండా ఉండలేం. మన బంధువులో, స్నేహితులో వేరే నంబర్ నుంచి చేస్తున్నారని భావిస్తాం. అయితే ఇలాంటి బాధల నుంచి అందరికీ విముక్తి లభిస్తోంది. స్పామ్ కాల్స్ కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

స్పామ్ కాల్స్ కు చెక్..

స్పామ్ కాల్స్ ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు భారతదేశ టెలికాం వాచ్‌డాగ్ చర్యలు తీసుకుంది. రిజిస్టర్ చేయని కాలర్ల నుంచి వచ్చే అన్ని ప్రమోషనల్ కాల్స్ ను ఆపివేయాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించింది. పెరుగుతున్న స్పామ్, ఫిషింగ్ కాల్స్ ను నిరోధించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కాబట్టి అలాంటి వారిని కట్టడి చేయాలని కోరింది.

అనేక ఇబ్బందులు..

స్పామ్ కాల్స్ వల్ల అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. మార్కెటింగ్ ప్రతినిధుల ఫోన్ల వల్ల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, స్కామర్ల వల్ల తీవ్ర ప్రమాదం కూడా పొంచి ఉంది. కొందరు స్కామర్లు తాము ప్రముఖ సంస్థల ప్రతినిధులమని నమ్మించి, మన కీలక ఆర్థిక సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. పోగొట్టుకున్న ప్యాకేజీలను తిరిగి పొందే నెపంతో ఫిషింగ్ లింక్‌లను పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయడం వల్ల యూజర్ల అనేక నష్టాలకు గురవుతున్నారు.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి..

సాధారణంగా టెలి మార్కెటింగ్ సేవలు అందిస్తున్న సంస్థలు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుంటాయి. ప్రభుత్వం జారీ చేసిన కొత్త ఆదేశాల ప్రకారం.. రిజిస్టర్ కానీ సంస్థల నుంచి వచ్చే కాల్స్ ను టెలికాం సంస్థలు నిలిపేవేయాలి. ప్రమోషనల్, ప్రీ రికార్డెడ్, కంప్యూటర్ జనరేటెడ్ కాల్స్.. ఇలా అన్ని రకాల కాల్స్ ను నిలిపివేయాలి. వీటి డేటాను ప్రతినెలా 1, 16వ తేదీలలో తప్పనిసరిగా సమర్పించాలి. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దానిలో భాగంగా రెండేళ్ల పాటు యాక్సెస్ నిలిపివేస్తారు. అవసరమైతే బ్లాక్ లిస్ట్ లో పెడతారు.

ఊరట లభించేనా..

స్పామ్ కాల్స్ వల్ల కలుగుతున్న ఇబ్బందులపై అనేక మంది వినియోగదారులు చేస్తున్న ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. దీని వల్ల ఫోన్ వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి ఊరట కలుగుతుంది. దీనివల్ల టెలి మార్కెటింగ్ సంస్థల నుంచి వచ్చే కాల్స్ పై స్పష్టత ఉంటుంది. ముఖ్యంగా స్కామర్ల బారిన పడకుండా రక్షించుకునే వీలు కలుగుతుంది. ఇటీవల ఇలా స్కామర్ల బారిన పడి అనేక మంది ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలతో అలాంటి వాటి నుంచి తప్పించుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మెక్సికోలో కూలిన పిరమిడ్‌.. వినాశనానికి సంకేతమా.? వీడియో వైరల్..
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
మరింత ఈజీగా బ్యాంక్​ లోన్స్.! సిబిల్ స్కోర్ ఉన్నవారికి ఈజీగా లోన్
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఆవుకు గ్రాండ్ బర్త్ డే సెలెబ్రేషన్|చాయ్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
ఇదెక్కడి రచ్చ.. రోడ్డుపై బస్సు డ్రైవర్‌తో గొడవపడ్డ దర్శకుడు..
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
నిహారిక కోసం రంగంలోకి దిగిన చరణ్‌-మహేష్|చిక్కుల్లో సూర్య, విక్రమ్
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్లను అడ్డుకున్న బీఎస్‌ఎఫ్‌.!
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మేం తగ్గం... సింహాలపైకి దూసుకెళ్లిన కుక్కలు
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
మనుషులను తీసుకెళ్లే చైనా డ్రోన్ వచ్చేసింది.! 2 వేల కేజీల లోడ్‌..
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
డ్రోన్‌ మంటల్లో 'జపోరిజియా' అణు విద్యుత్‌ ప్లాంట్.. ఆరోపణలు.
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..
ఆ ఊళ్లో కాకులు మగవాళ్లనే ఎందుకు తంతున్నాయి.? వీడియో వైరల్..