Social Media Likes: ఇకపై మీ లైక్స్ మీ ఇష్టం.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో లైక్స్‌ను ఎవరికీ కనిపించకుండా చేయొచ్చు..
Social Media Likes Hide: సోషల్ మీడియా ఈ స్థాయిలో పాపులర్ కావడానికి ప్రధాన కారణాల్లో లైక్ బటన్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాము పెట్టిన పోస్ట్‌ను ఎందరు లైక్ చేశారన్నదాన్ని తెలుసుకోవడానికి...
Social Media Likes Hide: సోషల్ మీడియా ఈ స్థాయిలో పాపులర్ కావడానికి ప్రధాన కారణాల్లో లైక్ బటన్ ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాము పెట్టిన పోస్ట్‌ను ఎందరు లైక్ చేశారన్నదాన్ని తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తిచూపిస్తుంటారు. ఎన్ని ఎక్కువ లైక్‌లు వస్తే అంత సంతోషిస్తుంటారు. అయితే ఇదే సమయంలో ఈ లైక్‌ల కారణంగా కొందరిలో ఒత్తిడి పెరుగుతున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఈ క్రమంలోనే దీనిపై పరిశోధన జరిపిన సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ లైక్ కౌంట్స్‌ను ఇతరులకు కనబడకుండా దాచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.
ఇందులో భాగంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫీచర్‌ను గత నెల నుంచి పరీక్షిస్తోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచర్‌తో యూజర్ తాను చేసిన పోస్ట్‌కు సంబంధించిన లైక్స్ కౌంట్ ఇతరులకు కనిపించాలా.? వద్దా అన్న విషయాన్ని నిర్ణయించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ గురించి ఫేస్‌బుక్ ప్రతినిధులు మాట్లాడుతూ.. లైక్ కౌంట్స్ వల్ల ఏ మాత్రం ఉయోగంలేదని లేలింది. అంతేకాకుండా కొందరిలో ఇది బాధను మిగులుస్తుందని తెలిపారు. కొంతమంది ప్రజలు లైక్ కౌంట్స్‌ను ఏది ట్రెండింగ్‌లో ఉందనేది తెలుసుకోవడం కోసం వినియోగిస్తున్నారని తేలింది. అందుకే ఈ మార్పు చేర్పులను జత చేసినట్టు వెల్లడించారు. ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌పై తాము ఏది చూస్తున్నాం, ఏది పంచుకుంటున్నామనే అంశాలపై నియంత్రణకు సాధ్యమవుతుందని వివరించారు.
Also Read: Maruti Alto: కారు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా..? మారుతి ఆల్టోలో తక్కువ ధరల్లో అందుబాటులో..!
HYDERABAD HOTELS: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి