Gmail Storage Space: మీరు గూగుల్‌ ఫోటోస్‌లో 15జీబీల కంటే ఎక్కవ స్టోరేజీ చేసుకున్నారా..? ఇలా చేసుకోండి

Gmail Storage Space: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఫోటోల స్టోరేజీ కోసం గూగుల్‌ ఫోటోస్‌యాప్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ జూన్‌ నుంచి అన్‌లిమిటెడ్‌ స్టోరేజీని తొలగిస్తున్నట్లు.

Gmail Storage Space: మీరు గూగుల్‌ ఫోటోస్‌లో 15జీబీల కంటే ఎక్కవ స్టోరేజీ చేసుకున్నారా..? ఇలా చేసుకోండి
Google Photos
Follow us

|

Updated on: May 29, 2021 | 9:57 AM

Gmail Storage Space: స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు ఫోటోల స్టోరేజీ కోసం గూగుల్‌ ఫోటోస్‌యాప్‌ను అధికంగా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ జూన్‌ నుంచి అన్‌లిమిటెడ్‌ స్టోరేజీని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం 15 జీబీల వరకు మాత్రమే స్టోరేజీ ఉంటుంది. అంతకన్నా ఎక్కువ స్టోరేజీ కావాలంటే అందుకు డబ్బులు పెట్టుకోవాల్సిందే. దీంతో ల్యాప్‌ట్యాప్‌లు, హార్డ్ డిస్క్‌లలో ఫోటోలు, వీడియోలను సేవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది.  గూగుల్‌ స్టోరేజీలో ఎక్కువగా ఫోటోలు ఉంటే తొలగించడమో లేక సేవ్‌ చేసుకోవడమో చేయాలి. లేకపోతే జూన్‌ తర్వాత పరిమితికి మించి స్టోరేజీ ఉంటే డిలీట్‌ అయిపోతాయి. అయితే జూన్‌ 1లోపు నాణ్యతతో ఉన్న ఫోటోలను బ్యాకప్‌ చేయండి. మీ బ్యాకప్‌ నాణ్యతను తనిఖీ చేయడానికి ముందుగా గూగుల్‌ ఫోటోస్‌లోకి వెళ్లి ఫ్రోఫైల్‌పై క్లిక్‌ చేయాలి. తర్వాత ఫోటో సెట్టింగ్‌లోకి వెళ్లి బ్యాకప్‌కు వెళ్లి అప్‌లోడ్‌ స్టోరేజీ చూసుకోవాలి. అందులో 15GB కన్నా ఎక్కువ స్టోరేజీ ఉంటే క్వాలిటీ ఫోటోలను సేవ్‌ చేసుకోవడం బెటర్‌.

అయితే అధికంగా స్టోరేజీ కావాలనుకునే వారికి మరో ఆప్షన్లు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఆన్‌లైన్ స్టోరేజీని పరిమితంగానే అందిస్తున్నాయి. అందువల్ల మనకు అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్టోరేజీని జాగ్రత్తగా వాడుకోవాలి. డూప్లికేట్ ఫోటోలు, బ్లర్ అయినవి, క్వాలిటీ సరిగా లేని వాటిని డిలీట్ చేసుకోవడం ద్వారా స్టోరేజీని సమర్థంగా వాడుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. లేక పోతే మీ ఫోన్ స్లో కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇలాంటి అనవసర ఫోటోలను గుర్తించడానికి కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.

డూప్లికేట్స్ క్లీనర్ – Duplicates Cleaner

ఈ ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డూప్లికేట్ ఫైల్స్‌ను సులభంగా గుర్తించి డిలీట్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌ స్టోరేజ్‌లోని ఇమేజెస్, ఆడియో ఫైల్స్, డాక్యుమెంట్లు, వీడియోలు వంటి మీడియా ఫైల్స్‌ను ఈ యాప్ గుర్తించి కస్టమర్లకు చూపిస్తుంది. వీటిని పోల్చి చూస్తూ, ఒకదాని తరువాత మరొక ఫైల్‌ను డిలీట్ చేసుకోవచ్చు. అన్నింటినీ ఒకేసారి సెలక్ట్ చేసి డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంది.

ఫైల్స్ బై గూగుల్ – Files by Google

ఈ యాప్‌ ద్వారా మంచి స్టోరేజీ ఫీచర్స్‌ ఉన్నాయి. డూప్లికేట్ ఫైల్స్‌ను గుర్తించి డిలీట్ చేయడం, కస్టమర్లు వాడని యాప్స్‌ను గుర్తించడం, కాపీలను బ్యాకప్ చేయడం వంటి ఆప్షన్లకు కస్టమర్లు ఎంచుకోవచ్చు. డూప్లికేట్ ఫోటోలు, ఫైల్స్‌ను స్కాన్ చేయడంతో పాటు ఫోటోలు, వీడియోలను ఫోల్డర్ల వారీగా విభజిస్తుంది. ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తరువాత కొన్ని పర్మిషన్లకు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుంది.

సీ క్లీనర్ -C Cleaner

ఈ సీ క్లీనర్ యాప్ సిస్టమ్ ఆప్టిమైజర్‌గా ఉపయోగపడుతుంది. ఇది జంక్‌, రీ క్లెయిమ్ స్పేస్, ర్యామ్‌ను క్లీన్ చేస్తుంది. సిస్టమ్ మానిటర్‌గా సమర్థంగా పనిచేస్తూ సేఫ్ బ్రౌజింగ్‌కు భరోసా ఇస్తుంది. ఈ యాప్‌లో స్టోరేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఉండే నాణ్యత సరిగా లేని ఫోటోలను గుర్తించికస్టమర్లకు సూచిస్తుంది. వెంటనే డిలీట్‌ చేసుకోవడం బెటర్‌.

రెమో డూప్లికేట్ ఫోటో రిమూవర్ -Remo Duplicate Photo Remover

ఈ యాప్‌లో మంచి ఇమేజ్ మేనేజ్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి. వీటి సహాయంతో డూప్లికేట్ ఫైల్స్‌ను డిలీట్ చేసుకోవచ్చు. డూప్లికేట్, సిమిలర్ ఫోటోలను ఇది గుర్తిస్తుంది. వీటి నుంచి అవసరం లేని ఫోటోలను సులభంగా డిలీట్ చేసుకోవచ్చు.

ఇవీ కూడా చదవండి:

Honda Bike: హోండా నుంచి విడుదల కానున్న మరో సరికొత్త బైక్‌.. అత్యాధునిక ఫీచర్లతో బైక్‌ తయారీ

SBI KYC: కేవైసీ చేయకపోతే మీ బ్యాంకు ఖాతా బ్లాక్‌ చేస్తామని మెసేజ్‌లు వస్తున్నాయా? ఎస్‌బీఐ ఏం చెబుతోంది