AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skate Electric Car : మినీ బార్‌, జిమ్‌.. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

Skate Electric Car : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది. దీనికి ‘స్కేట్’ అని పేరు పెట్టింది. ‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా

Skate Electric Car : మినీ బార్‌, జిమ్‌.. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!
Electrical Car
Shiva Prajapati
|

Updated on: Oct 09, 2021 | 9:39 AM

Share

Skate Electric Car : ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ సిట్రోన్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ కారును రూపొందించింది. దీనికి ‘స్కేట్’ అని పేరు పెట్టింది. ‘స్కేట్‌’ కారు.. పేరుకు తగినట్టుగా స్కేటింగ్‌ బోర్డులా ఫ్లాట్‌గా ఉంటుంది. దానికి బిగించుకోవడానికి మూడు బాడీలు వస్తాయి. ఫైవ్‌స్టార్‌ హోటల్‌ తరహాలో మెత్తని సోఫా, మినీ బార్‌తో ఉన్న ఒక పాడ్, వ్యాయామం చేయడానికి జిమ్‌ ఇక్విప్‌మెంట్‌ ఉన్న ‘పవర్‌ ఫిట్‌నెస్‌’ పాడ్, ఇక మూడోది సగం క్యాబిన్, మిగతా సగం ఓపెన్‌ స్పేస్‌ ఉండే ‘సిటిజన్‌ ప్రొవైడర్‌’ పాడ్‌ తో వస్తోంది. ఈ కార్‌లో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఈ పాడ్‌లలో ఒకదాన్ని వదిలేసి.. మరోదానిని కేవలం పది సెకన్లలోనే అమర్చేసుకునే వీలుంది.

అంతేకాదండోయ్‌.. అర్జెంట్‌గా బయటికెళ్లాలంటే మన ముందుకే వచ్చి నిలబడుతుంది. లోపల కూర్చుని అద్దాల్లోంచి చూస్తూ వెళ్లడానికి, ఓపెన్‌ టాప్‌ తరహాలో గాలి తగులుతూ ప్రయాణించడానికి వీలుంది. స్నేహితులతో కబుర్లు చెప్తూ, కావాలంటే వైన్‌ తాగుతూ వెళ్లాలనుకుంటే అదే కారు చిన్నపాటి ఫైవ్‌స్టార్‌ లాంజ్‌గా మారిపోతుంది. వ్యాయామం చేయడానికి టైం లేదనుకుంటే.. కారే చిన్నపాటి జిమ్‌లా రెడీ అవుతుంది. అంతేకాదు.. ఈ కారు టెస్లా కార్‌లాగా డ్రైవర్‌లెస్‌ కార్‌ అన్నమాట. అంటే డ్రైవర్‌ అవసరం లేకుండా.. మనం కోరుకున్న చోటికి అదే తీసుకెళ్తుంది.

ఈ కారు ఇంటర్నెట్‌ సాయంతో మన ఫోన్‌లోని యాప్‌కు లింక్‌ అయి ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నా.. కావాలనుకున్నప్పుడు యాప్‌ నుంచి ఆదేశాలు ఇవ్వగానే మన దగ్గరికి బయలుదేరి వచ్చేస్తుంది. దగ్గరిలో ఉన్న చార్జింగ్‌ స్టేషన్‌కు వెళ్లి అదే చార్జింగ్‌ కూడా చేసుకుంటుందని సిట్రోన్‌ కంపెనీ చెప్తోంది. ఈ కారును ముందుకు, వెనక్కే కాదు.. పక్కకు ఇలా ఎలాగంటే అలా నడిపే వీలుంటుంది. ఇందుకోసం బంతి ఆకారంలో ఉండే ప్రత్యేకమైన టైర్లను అమర్చారు. అంతేకాదు.. దీనిలో హైడ్రాలిక్‌ సస్పెన్షన్‌ ఏర్పాటు చేశారు. అంటే పెద్దగా కుదుపులు లేకుండా హాయిగా ప్రయాణిస్తుంది. దీనిలో ఉండే రాడార్, లైడార్‌ సెన్సర్ల సాయంతో రోడ్డును, ముందున్న వాహనాలు, మనుషులు, ఇతర అడ్డంకులను గుర్తిస్తూ.. వాటి నుంచి పక్కకు తప్పుకుంటూ దూసుకెళ్తుంది.

Also read:

MAA Elections 2021: ‘మా’యా లేదు మంత్రం లేదు….నెట్టింట విష్ణు, ప్రకాశ్ ఫన్నీ వార్.. లైవ్ వీడియో

Oldest Tree in the World: ప్రమాదంలో ప్రపంచంలోనే అతి పురాతన చెట్టు.. కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న సిబ్బంది..

మొదలైన లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురి సినిమా.. హీరోగా నటిస్తున్న కిరణ్ అబ్బవరం..