Cars: పండుగ వేళ కారు కొందామని చూస్తున్నారా? ప్రజలు ఎక్కువ ఇష్టపడే ఐదు కార్లు ఇవే..

దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. అనేక ఆటో కంపెనీలు పండుగ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. మీరు కూడా ఈ నెలలో ఒక కారు కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం ఇదే

Cars: పండుగ వేళ కారు కొందామని చూస్తున్నారా? ప్రజలు ఎక్కువ ఇష్టపడే ఐదు కార్లు ఇవే..
Top Selling Cars
Follow us
KVD Varma

|

Updated on: Oct 09, 2021 | 8:25 AM

Cars: దేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది. అనేక ఆటో కంపెనీలు పండుగ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తున్నాయి. మీరు కూడా ఈ నెలలో ఒక కారు కొనాలని ఆలోచిస్తుంటే, గత 6 నెలల్లో ప్రజలు ఎక్కువగా ఇష్టపడే సెగ్మెంట్ వారీగా 5 కార్ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కార్లలో లభించే డిస్కౌంట్ ఆఫర్లు, కారు మైలేజ్, ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర, నిర్వహణ ఖర్చు గురించి పూర్తిగా తెలుసుకుంటే.. ఏ కారు కొనాలనే క్లారిటీ వస్తుంది.

మారుతి ఆల్టో:

ఆల్టో ఒక బడ్జెట్ కారు. దీని ధర రూ. 3.15 లక్షలు. సెమీకండక్టర్ల కొరత కారణంగా, ఈ పండుగ సీజన్‌లో ఆల్టో వెయిటింగ్ లిస్ట్ పెరిగింది. అంటే ఈ కారు బుక్ చేసుకున్న తరువాత డెలివరీ కోసం కనీసం 126-140 రోజులు ఆగాలి. ఆల్టో 800 మోడల్‌పై నగదు తగ్గింపు రూ.20,000, ఎక్స్‌ఛేంజ్ బోనస్ రూ.15,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3,000. లభిస్తుంది.

మారుతి బాలెనో:

బాలెనో మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో వస్తుంది. దీని ధర 5.99 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, కంపెనీ రూ .10,000 క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 2,500 కార్పొరేట్ డిస్కౌంట్‌ను బాలెనోపై అందిస్తోంది. మరోవైపు, బాలెనో భద్రత పరంగా 4-స్టార్ రేటింగ్ పొందింది. 5 సంవత్సరాలలో కారు నిర్వహణ ఖర్చు దాదాపు రూ .18,280.

హోండా అమేజ్‌:

అమెజ్ ఎక్స్ షోరూం ధర 6.32 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. హోండా అమేజ్‌పై కంపెనీ నగదు తగ్గింపును అందించడం లేదు. కానీ ఇది 9 వేల ఎక్స్ఛేంజ్ బోనస్, 4 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తోంది. మరోవైపు, వెయిటింగ్ టైం 21-26 రోజులు ఉంటుంది. కారు నిర్వహణ ఖర్చు 5 సంవత్సరాలలో రూ.27,290. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్ 4-స్టార్ రేటింగ్ పొందింది. అదే సమయంలో, ఇది వయోజన భద్రతలో 4 నక్షత్రాలు, పిల్లల భద్రతలో 1 నక్షత్రాల రేటింగ్‌ను పొందింది.

టాటా నెక్సాన్‌

టాటా నెక్సాన్‌ ధర 7.29 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దీనిపై కంపెనీ క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడం లేదు. కానీ ఈ ఎస్‌యూవీని కొనుగోలు చేస్తే 15 వేల ఎక్స్ఛేంజ్, 3 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. అదే సమయంలో, ఈ కారుపై 80-100 రోజుల నిరీక్షణ కాలం ఉంది. భద్రత విషయంలో నెక్సాన్ 5 స్టార్ రేటింగ్ పొందింది. ఈ కారణంగా, ఇది సురక్షితమైన కారుగా చెప్పవచ్చు. కారు నిర్వహణ ఖర్చు ఐదు సంవత్సరాలకు రూ. 22,230.

ట్రైబర్

ట్రైబర్ కారు 5.5 లక్షల వద్ద ప్రారంభం అవుతుంది. దీనిలో కంపెనీ రూ.10,000 నగదు తగ్గింపు, రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్, ట్రైబర్ Rxl లో రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. మరోవైపు, ట్రైబర్ Rxt, Rxz లో కంపెనీ రూ .15,000 నగదు తగ్గింపు, రూ.25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ మరియు రూ.10,000 కార్పొరేట్ డిస్కౌంట్ అందిస్తోంది. కారు కోసం వెయిటింగ్ లిస్ట్ 30 రోజులు. NCAP సేఫ్టీ రేటింగ్‌లో ట్రైబర్ 4-స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో వయోజనులలో 4 మరియు 3-స్టార్ రేటింగ్ పిల్లల భద్రత కోసం ఇవ్వబడింది. కారు నిర్వహణ ఖర్చు ఐదు సంవత్సరాలకు దాదాపు రూ .10,170.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం ఆయా కంపెనీల వెబ్ సైట్ ల నుంచి సేకరించింది. కార్ల ధరలు ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. అదేవిధంగా డిస్కౌంట్ లలో షోరూం..షోరూం కు మధ్యలో తేడాలు ఉండవచ్చు. కారు కొనే ముందు అన్ని అంశాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!