Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొదలైన లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురి సినిమా.. హీరోగా నటిస్తున్న కిరణ్ అబ్బవరం..

లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి ఇన్స్పిరేషన్‌తో సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కోడి రామకృష్ణ ప్రెజెంట్స్‌లో

మొదలైన లెజెండరీ డైరెక్టర్ కోడి రామకృష్ణ కూతురి సినిమా.. హీరోగా నటిస్తున్న కిరణ్ అబ్బవరం..
Kiran Abbavaram
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 09, 2021 | 9:22 AM

లెజెండరీ డైరెక్టర్ కోడిరామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి తన తండ్రి ఇన్స్పిరేషన్‌తో సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కోడి రామకృష్ణ ప్రెజెంట్స్‌లో కోడి దివ్య ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ జంటగా కార్తీక్ శంకర్ దర్శకత్వంలో కోడి దివ్య దీప్తి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ అతిథుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, దర్శకేంద్రుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాతలు అల్లు అరవింద్, మురళి మోహన్, దర్శక, నిర్మాతలు యస్.వి.కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ కోటి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొని చిత్ర యూనిట్‌ను బ్లెస్స్ చేశారు. ఈ చిత్రం తొలి ముహూర్తపు సన్నివేశానికి  లెజెండరీ దర్శకుడు కె.రాఘవేంద్ర రావు గౌరవ దర్శకత్వం వహించారు .

ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ ..కోడి రామకృష్ణ గారి దీవెనలతో చాలా మంది పెద్దల ఆశీస్సులతో మా మూవీ స్టార్ట్ ఆయినందుకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది అన్నారు. నాకు ఈ ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్ లాంటిది దీప్తి గారు మొదటినుంచి నన్ను ఇంట్లో మనిషిలా చూసుకుంటారు. తన మొదటి ప్రొడక్షన్ లో నన్ను హీరోగా పెడుతూ చేస్తున్నా దివ్య గారికి ధన్యవాదాలు. మణిశర్మగారి మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం నరసింహ నాయుడు, ఇంద్ర పాటలు విని థియేటర్‌లో గోల చేసే వాడిని ఇప్పుడు ఆయన నా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇది చక్కటి కుటుంబ కథా చిత్రం ఈ సినిమా ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది. స్క్రిప్ట్ వర్క్ చాలా బాగా వచ్చింది. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఈ సినిమా కు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరాడు కిరణ్.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Anand Deverakonda: దూసుకుపోతున్న దేవరకొండ బ్రదర్.. ‘హైవే’ షూటింగ్ కంప్లీట్ చేసిన ఆనంద్ దేవరకొండ..

MAA Elections 2021: సిని’మా’ వార్.. క్లైమాక్స్ మరింత ఇంట్రస్టింగ్‌గా మారిందిగా..

MAA Elections 2021: ఆ టాప్ దర్శకుడి విషయంలో మంచు విష్ణు ఫ్రాడ్ చేశారు .. సంచలన కామెంట్ చేసిన మెగా బ్రదర్

MAA Elections 2021: పాపం ఆ ఫ్యామిలీని చూస్తుంటే జాలేస్తుంది.. జీవిత రాజశేఖర్ సంచలన వ్యాఖ్యలు..