Samsung Galaxy A16 5G: బడ్జెట్‌ ధరలో ప్రీమియం ఫీచర్స్‌.. సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ16 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్స్‌లో తీసుకురానున్నారు. సామ్‌సంగ్ ఈ ఫోన్‌తో ఆరేళ్లపాటు...

Samsung Galaxy A16 5G: బడ్జెట్‌ ధరలో ప్రీమియం ఫీచర్స్‌.. సామ్‌సంగ్ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌..
Samsung Galaxy A16 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 11, 2024 | 7:25 PM

సౌత్‌ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ మార్కెట్లోకి వరుసగా ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. ఓవైపు ప్రీమియం మార్కెట్‌తో పాటు మరోవైపు బడ్జెట్ మార్కెట్‌ను సైతం టార్గెట్ చేసుకొని కొంగొత్త సినిమాలను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సామ్‌సంగ్‌ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ16 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ గ్యాలక్సీ ఏ16 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లోకి లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను బ్లూ బ్లాక్, గోల్డ్, లైట్ గ్రీన్ కలర్స్‌లో తీసుకురానున్నారు. సామ్‌సంగ్ ఈ ఫోన్‌తో ఆరేళ్లపాటు సెక్యూరిటీ, ఓఎస్ అప్ డేట్స్ అందించనున్నట్లు తెలిపింది. ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేఇరయంట్‌ ధరను ఇండియన్‌ కరెన్సీ ప్రకారం రూ. 23 వేలకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్‌లో 90 హెర్జ్ట్‌ రీఫ్రెష్‌ రేటుతో కూడిన 6.5 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. 1080×2340 పిక్సెల్స్ రిజల్యూషన్‌ ఈ స్క్రీన్‌ సొతం. ఇక ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిన వన్‌ యూఐ 6.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే.. 5-మెగా పిక్సెల్ సెన్సర్ విత్ ఆల్ట్రావైడ్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఈ ఫోన్‌లో 25 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యుయల్ 5జీ, ఎన్ఎఫ్సీ, జీపీఎస్, బ్లూటూత్ 5.3, వై-ఫై, యూఎస్బీ టైప్ సీ వంటి ఫీచర్లను అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
మీరు కారును అమ్ముతున్నారా? ముందు ఇది చేయండి.. లేకుంటే కోర్టుకే..
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఈ ఏడాది సంక్రాంతి ఎప్పుడు ? స్నానం, దానం శుభ సమయం ఎప్పుడంటే
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
ఆ వ్యాన్‌లో ఉన్నది ఫర్నీచర్ కాదు గురూ..!
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
17 ఏళ్లకే ఎంట్రీ ఇచ్చి స్టార్.. కట్ చేస్తే 24ఏళ్లకే కెరీర్ క్లోజ్
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌ అంటున్న రష్మిక.. కన్నప్ప సినిమా అప్డేట్
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
గురు శిష్య గ్రహాల యుతి.. ఆ రాశుల వారికి కనక వర్షం..!
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం
50 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్‌గా, చలాకీగా ఉండాలా.. ఈ టిప్స్ మీ కోసం