Samsung Galaxy F34 5G: రూ. 20 వేలలో సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. కొత్త కలర్‌ లాంచ్‌ చేసిన..

ఇదిలా ఉంటే ఇప్పటికే లాంచ్‌ చేసిన ఫోన్‌లు సైతం కొత్త వేరియంట్స్‌ను తీసుకొస్తున్నాయి. వేరియంట్స్‌లో మార్పు చేయడం లేదా, కొంగొత్త కలర్స్‌లో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ సైతం కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34 పేరుతో ఇప్పటికే ఓ 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌ను...

Samsung Galaxy F34 5G: రూ. 20 వేలలో సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. కొత్త కలర్‌ లాంచ్‌ చేసిన..
Samsung Galaxy F34 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 02, 2023 | 9:37 AM

పండుగల సీజన్‌ను క్యాష్‌ చేసుకునే నేపథ్యంలో స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ కంపెనీలు మార్కెట్లోకి వరుసగా ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఇక ఈ కామర్స్‌ సైట్స్‌ సైతం రకరకాల ఆఫర్లను ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఇప్పటికే అటు ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఇటు అమెజాన్‌ కూడా సేల్స్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. అక్టోబర్‌ 8వ తేదీ నుంచి సేల్స్‌ షురూ కానున్నాయి. ఇందులో భాగంగా అన్ని రకాల వస్తువులపై కళ్లు చెదిరే ఆఫర్లను అందించనున్నట్లు ప్రకటించాయి.

ఇదిలా ఉంటే ఇప్పటికే లాంచ్‌ చేసిన ఫోన్‌లు సైతం కొత్త వేరియంట్స్‌ను తీసుకొస్తున్నాయి. వేరియంట్స్‌లో మార్పు చేయడం లేదా, కొంగొత్త కలర్స్‌లో కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం సామ్‌సంగ్‌ సైతం కస్టమర్లకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34 పేరుతో ఇప్పటికే ఓ 5జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌ను మరో కొత్త కలర్‌తో తీసుకొచ్చింది సామ్‌సంగ్‌. ‘ఆర్చిడ్ వయొలెట్’ కలర్‌తో ఫోన్‌ను కొత్తగా తీసుకొచ్చింది. వీటితో పాటు ఎలక్ట్రిక్‌ బ్లాక్‌, మిస్టిక్‌ గ్రీన్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు.

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ 2023 సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకురానున్నారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎఫ్‌34లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్‌ రీఫ్రెష్‌ రేట్‌ ఈ డిస్‌ప్లే సొంతం. ఇక ఈ ఫోన్‌ 5ఎన్‌ఎం ఎక్సినోస్‌ 1280 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 6000 ఎంఏహెచ్‌ వంటి భారీ బ్యాటరీ ఈ ఫోన్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. నో షేక్ ఎమెరా స్పోర్ట్‌ ఫన్‌ మోడ్‌ ఈ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సెల్ఫీల విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ స్మార్ట్ ఫోన్‌ పని చేస్తుంది. అక్టోబర్ 8వ తేదీ నుంచి ఈ ఫోన్‌ సేల్‌ ప్రారంభంకానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ బేస్‌ వేరియంట్ 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 19,999గా ఉంది. అయితే సేల్‌ ప్రారంభం తర్వాత ప్రత్యేకంగా ఏమైనా డిస్కౌంట్స్‌ ఇస్తారో చూడాలి. ఇక 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 25,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..