మీ దగ్గర ఈ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయా.? అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్స్ మీ సొంతం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఆఫర్లను పండుగను ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి సేల్ ప్రారంభంకానున్నట్లు ఈ కామర్స్ సైట్స్ అధికారికంగా ప్రకటించాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందు నుంచే ఆఫర్లు మొదలుకానున్నాయి. సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మొదలు, టీవీల వరకు..

Amazon flipkart sale: పండుగల సీజన్ ఇలా మొదలైందో లేదో అలా మార్కెట్లో కూడా పండగ వాతావరణం మొదలైంది. దసరా, దీపావళికి కొత్త వస్తువులు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల ఆసక్తిని క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి ఈ కామర్స్ సైట్స్. ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్ తమ సేల్స్ తేదీలను ప్రకటించిన విషయం తెలిసిందే.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ పేరుతో ఆఫర్లను పండుగను ప్రకటించింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి సేల్ ప్రారంభంకానున్నట్లు ఈ కామర్స్ సైట్స్ అధికారికంగా ప్రకటించాయి. అమెజాన్ ప్రైమ్, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు ఒక రోజు ముందు నుంచే ఆఫర్లు మొదలుకానున్నాయి. సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్స్ మొదలు, టీవీల వరకు.. వాషింగ్ మిషిన్స్ మొదలు, గృహోపకరణాల వరకు అన్నింటిపై ఊహకందని ఆఫర్స్‌ను అందించనున్నాయి.
ఇప్పటికే కొన్ని ప్రొడక్ట్స్‌పై ఆఫర్లను ప్రకటించాయి సంస్థలు. సేల్‌ను టార్గెట్ చేసుకునే కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. సామ్‌సంగ్ మొదలు పలు బడా కంపెనీలు మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నాయి. సేల్‌లో భాగంగా లాంచింగ్ ఆఫర్స్‌ను సైతం అందించనున్నాయి. ఇంతలా ఉంటే వీటికి అదనంగా కొన్ని బ్యాంకులు సైతం ప్రత్యేకంగా డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో ఏయే బ్యాంకు కార్డులపై ఎలాంటి ఆఫర్స్ అందుబాటులో ఉండనున్నాయి.? ఎంత డిస్కౌంట్ లభించనుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ భాగంగా పలు బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి పలు ఆఫర్లను అందిస్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసే యూజర్లకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కైంట్‌ను అందించనున్నారు. అమెజాన్ ఇచ్చే ఆఫర్స్‌కి అదనంగా ఈ 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు స్మార్ట్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్ లభించనుంది.
ఇక ఫ్లిప్ కార్ట్‌లో ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, ఐసీఐసీ వంటి ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేసే వారికి అదనంగా 10 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్లకు ఇది అదనం. ఇక వీటితోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ కాయిన్స్ ఉపయోగించుకోవడం ద్వారా కూడా ధరను తగ్గించుకునే వెసులుబాటు కల్పించారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..