Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BoAt Smartwatch: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది.. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు..

బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 1,299 మాత్రమే. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి బోట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది సిలికాన్ తో పాటు మెటాలిక్ స్ట్రాప్ లో అందుబాటులో ఉంటుంది. మెటల్ గ్రే కలర్లో మెటాలిక్ స్ట్రాప్, రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్‌లో సిలికాన్ ఆప్షన్లలో లభిస్తోంది.

BoAt Smartwatch: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇది.. బ్లూటూత్ కాలింగ్‌తో పాటు అత్యాధునిక ఫీచర్లు..
Boat Lunar Comet
Follow us
Madhu

| Edited By: Ravi Kiran

Updated on: Oct 02, 2023 | 9:07 PM

బోట్ కంపెనీ నుంచి స్మార్ట్ వాచ్ ల పరంపర కొనసాగుతోంది. వారానికి ఒకటి చొప్పున కొత్త కొత్త స్మార్ట్ వాచ్ లను మార్కెట్లోకి విడుదల చేస్తోంది. మార్కెట్లో స్మార్ట్ వాచ్ లకు ఉన్న డిమాండ్ ను అందిపుచ్చుకుంటూ బోట్ సరికొత్త ఫీచర్లు, విభిన్న డిజైన్ తో స్మార్ట్ వాచ్ లను వినియోగదారులకు అందిస్తోంది. ఇటీవల అల్టిమా వోగ్ లాంచ్ చేసిన బోట్ ఇప్పుడు మరో కొత్త స్మార్ట వాచ్ లను లాంచ్ చేసింది. దీని పేరు లూనార్ కామెట్. దీనిలో హెచ్ డీ డిస్ ప్లే, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, పలు రకాల స్పోర్ట్స్ మోడ్స్, వేక్ గెస్చర్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాక అతి తక్కువ ధరలోనే ఈ ఫీచర్లన్నింటినీ అందిస్తోంది. ఇప్పుడు ఈ బోట్ లూనార్ కామెట్ కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర, లభ్యత గురించి తెలుసుకుందాం..

బోట్ లూనార్ కామెట్ ధర, లభ్యత..

బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ ధర కేవలం రూ. 1,299 మాత్రమే. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి బోట్ అధికారిక వెబ్ సైట్ తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఇది సిలికాన్ తో పాటు మెటాలిక్ స్ట్రాప్ లో అందుబాటులో ఉంటుంది. మెటల్ గ్రే కలర్లో మెటాలిక్ స్ట్రాప్, రాయల్ ఆరెంజ్, డీప్ పర్పుల్, ఆలివ్ గ్రీన్, యాక్టివ్ బ్లాక్ కలర్స్‌లో సిలికాన్ ఆప్షన్లలో లభిస్తోంది.

బోట్ లూనార్ కామెట్ స్పెసిఫికేషన్లు..

బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్ రౌండ్ డయల్ ఉంటుంది. కుడి వైపు అంచున ఫంక్షనల్ క్రౌన్ ని కలిగి ఉంటుంది. ఇది మెటాలిక్, సిలికాన్ వేరియంట్‌లతో వస్తుంది.500 నిట్స్ బ్రైట్‌నెస్, 240 x 240 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.39-అంగుళాల హెచ్ డీ డిస్‌ప్లేను అందిస్తుంది. వేక్ గెస్చర్స్ ద్వారా, స్మార్ట్‌వాచ్ వినియోగదారులు బటన్‌ను నొక్కడానికి బదులుగా వారి చేతులను పైకి లేపడం ద్వారా మీరు వాచ్ ను ఆపరేట్ చేయొచ్చు. దీనిలో 100కు పైగా వాచ్ ఫేసెస్ ఉంటాయి. యాప్ లను తెరవడానికి, నావిగేట్ చేయడానికి, సెట్టింగ్స్ ను ఓపెన్ చేయడానికి, వివిధ వాచ్ ఫంక్షన్లను వినియోగించడానికి క్రౌన్ ను వినియోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బోట్ లూనార్ కామెట్ ఫీచర్లు..

బోట్ లూనార్ కామెట్ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉంటుంది. ఇది వినియోగదారులు ఫోన్ కాల్‌లను స్వీకరించడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ లో అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్‌లతో వస్తుంది. వినియోగదారులు 10 కాంటాక్ట్ లను నిల్వ చేయడానికి అనుమతిస్తుంది. బోట్ లూనార్ కామెట్ డయల్ ప్యాడ్‌ను కూడా అందిస్తుంది. కాబట్టి మీరు మీ స్మార్ట్‌ఫోన్ అవసరం లేకుండా కాల్స్ చేయవచ్చు. వర్కౌట్‌లు, రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్ వంటి మీ శారీరక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్మార్ట్‌వాచ్ 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లను కలిగి ఉంది. ఈ స్మార్ట్ వాచ్ సాయంతో నిద్ర, హృదయ స్పందన రేటు, రక్తంలో ఆక్సిజన్ స్థాయి, ఋతు చక్రాలు, రోజువారీ కార్యకలాపాలను కూడా పర్యవేక్షించగలదు. సెడెంటరీ అలెర్ట్స్ కూడా అందిస్తుంది. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే లేచి నడవమని మిమ్మల్ని హెచ్చరిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ నుంచి మీరు కెమెరా నియంత్రించవచ్చు. మ్యూజిక్ కూడా ఆస్వాదించవచ్చు. స్టాప్ వాచ్, వెదర్, లాలరం, ఫైండ్ మై ఫోన్, డునాట్ డిస్టర్బ్(డీఎన్డీ)వంటి అదనపు ఫీచర్లు కూడా ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..