Samsung Galaxy A03 Core: తక్కువ ధరలో శాంసంగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, ఫీచర్స్ వివరాలు!
Samsung Galaxy A03 Core: కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ..
Samsung Galaxy A03 Core: కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని మొబైల్ తయారీ కంపెనీలు రోజురోజుకు కొత్త ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ భారత్‌లో తన శాంసంగ్ గెలక్సీ ఏ3 కోర్‌ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్ బ్లూ, బ్లాక్ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో, 2జీబీ+32 ఇంటర్నల్ స్టోరేజీతో రానుంది. ఇక బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.7999. అలాగే ఈ ఫోన్ 6.5 అంగుళాల సైజుతో, ఆక్టాకోర్ యునిసోక్ ఎస్‌సీ9863ఏ ప్రాసెసర్ ఉండనుంది. ఇక కెమెరా విషయానికొస్తే 8ఎంపీ రియల్ కెమెరా, 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉండనుంది.
కాగా, శాంసంగ్ నుంచి అనేక స్మార్ట్‌ఫోన్లు విడుదల అవుతూనే ఉన్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కస్టమర్లను మరింతగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడున్న జనరేషన్‌లో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉండాల్సిందే. శాంసంగ్ తక్కువ బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి: