PTron Force X11: రూ.3వేలలోపే బ్లూటూత్ కాలింగ్ వాచ్‌.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!

PTron మొదటి స్మార్ట్‌వాచ్ అయిన PTron Force X11ని నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది. PTron Force X11 1.7-అంగుళాల HD డిస్‌ప్లేతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌వాచ్‌గా విడుదలైంది.

PTron Force X11: రూ.3వేలలోపే బ్లూటూత్ కాలింగ్ వాచ్‌.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..!
Ptron Force X11
Follow us
Venkata Chari

|

Updated on: Jan 17, 2022 | 7:33 PM

PTron Force X11 Smartwatch: PTron స్మార్ట్‌వాచ్ భారత మార్కెట్‌లోకి విడుదలైంది. PTron మొదటి స్మార్ట్‌వాచ్ అయిన PTron Force X11ని నేడు అందుబాటులోకి తీసుకొచ్చింది. PTron Force X11 1.7-అంగుళాల HD డిస్‌ప్లేతో కూడిన ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌వాచ్‌గా విడుదలైంది. PTron ఫోర్స్ X11 లోహంతో డిజైన్ చేశారు. PTron Force X11 బ్లడ్ ఆక్సిజన్ ట్రాకింగ్ నుంచి హార్ట్ రేట్ మానిటరింగ్ వరకు ఎన్నో ఫీచర్లతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ వాచ్‌లో కాలింగ్ ఫీచర్‌కు కూడా మద్దతు ఇస్తుండడం విశేషం. ఈ వాచ్ 7 రోజుల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

PTron Force X11 స్పెసిఫికేషన్‌లు: స్మార్ట్ వాచ్ టచ్ సపోర్ట్‌తో 1.7-అంగుళాల కలర్‌ఫుల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ V5.0 అందించారు.

PTron Force X11 బ్లడ్ ఆక్సిజన్‌తో పాటు బ్లడ్ ప్రెజర్ మానిటర్‌ను యూజర్లకు అందిస్తుంది.

దీని బ్యాటరీ 7 రోజుల బ్యాకప్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది.

బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి 3 గంటలు పడుతుంది.

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఈ వాచ్‌లో అందించారు. ఇందుకోసం ప్రత్యేకంగా మైక్, స్పీకర్ కూడా ఏర్పాటు చేశారు.

PTron Force X11లో 7 యాక్టివ్ ఫిట్‌నెస్ మోడ్‌లు ఉన్నాయి.

ఈ వాచ్ వాటర్ రెసిస్టెంట్ కోసం IP68 రేటింగ్ పొందింది.

వాచ్‌తో, మీరు ఫోన్ కెమెరాను, మ్యూజిక్‌ను కంట్రోల్ చేయవచ్చు.

ఈ స్మార్ట్‌వాచ్ రూ.2,799లకు అందుబాటు ఉంది.

Also Read: Apple iPhone SE 3: చౌకైన 5జీ ఫోన్ విడుదలకు యాపిల్ సిద్ధం.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Flipkart Big Savings Day: ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్ల‌పై అదిరిపోయే ఆఫ‌ర్లు.. రూ.10 వేల లోపు బెస్ట్ ఫోన్స్ ఇవే..