AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Power Bank buying tips: పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేకపోతే డబ్బు వృధా అవుతుంది.

Power Bank buying tips: ప్రస్తుత కాలంలో మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ అత్యవసరమైన గాడ్జెట్‌గా మారింది. ఎందుకంటే మెట్రో నగరంలో చాలా మంది ప్రజలు పని చేస్తున్నారు. వారు దాదాపు 16 గంటల పాటు ఇంటి నుండి బయట ఉంటారు. అలాంటి పరిస్థితిలో.. తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి సమయం లభించదు. ఈ కారణంగా వారు ప్రయాణిస్తున్నప్పుడు పవర్ బ్యాంక్‌ల సహాయంతో తమ ఫోన్‌లను ఛార్జ్ చేస్తారు.

Power Bank buying tips: పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేటప్పుడు ఇవి గుర్తుంచుకోండి.. లేకపోతే డబ్బు వృధా అవుతుంది.
Power Bank
Shiva Prajapati
|

Updated on: Sep 14, 2023 | 12:09 PM

Share

Power Bank buying tips: ప్రస్తుత కాలంలో మొబైల్‌ను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాంక్ అత్యవసరమైన గాడ్జెట్‌గా మారింది. ఎందుకంటే మెట్రో నగరంలో చాలా మంది ప్రజలు పని చేస్తున్నారు. వారు దాదాపు 16 గంటల పాటు ఇంటి నుండి బయట ఉంటారు. అలాంటి పరిస్థితిలో.. తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి సమయం లభించదు. ఈ కారణంగా వారు ప్రయాణిస్తున్నప్పుడు పవర్ బ్యాంక్‌ల సహాయంతో తమ ఫోన్‌లను ఛార్జ్ చేస్తారు.

అయితే, పవర్ బ్యాంక్ నాణ్యత అనేది చాలా ముఖ్యం. మీరు నాణ్యత లేని పవర్ బ్యాంక్‌ని కొనుగోలు చేస్తే.. మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జ్ అవదు. దీంతో పాటు మీరు డబ్బును కూడా కోల్పోతారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, పవర్ బ్యాంక్‌ని కొనుగోలు చేయడానికి మీ కోసం కొన్ని చిట్కాలను తీసుకువచ్చాం.

పవర్ బ్యాంక్ సామర్థ్యం..

పవర్ బ్యాంక్ కొనుగోలు చేసేటప్పుడు, దాని సామర్థ్యాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఫోన్ బ్యాటరీ 5000mAh అయితే, మీరు కనీసం 10000 mAh పవర్ బ్యాంక్‌ని కొనుగోలు చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా మీరు మీ ఫోన్‌ను కనీసం రెండుసార్లు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ప్రస్తుతం 15,000mAh బ్యాటరీలతో పవర్ బ్యాంక్‌లు మార్కెట్‌లో సరసమైన ధరలకు అందుబాటులో ఉన్నాయి.

ఎన్ని పరికరాలకు ఛార్జ్ చేయొచ్చు..

మీరు కొనుగోలు చేసే పవర్ బ్యాంక్ ఒకేసారి ఎన్ని డివైజ్‌లను ఛార్జ్ చేయగలదో తెలుసుకోవాలి. ఒకేసారి రెండు ఫోన్‌లను ఛార్జ్ చేయగల పవర్ బ్యాంక్‌లను కొనుగోలు చేయాలి.

వోల్టేజ్..

పవర్ వోల్టేజ్ ముఖ్యం. మీరు కొనుగోలు చేసిన పవర్ బ్యాంక్ అవుట్‌పుట్ వోల్టేజ్ మీ ఫోన్‌తో సమానంగా లేకుంటే, ఫోన్ ఛార్జ్ చేయబడదు. అలాంటి పరిస్థితిలో.. ఫోన్ వలె అదే అవుట్‌పుట్ వోల్టేజ్‌తో పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మార్కెట్‌లో వివిధ వోల్టేజ్ కెపాసిటీల పవర్ బ్యాంక్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటి నుండి మీకు అవసరమైన పవర్ బ్యాంక్‌ను ఎంచుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..