Poco C65: రూ. 8వేలలో 50 మెగాపిక్సెల్ కెమెరా.. పోకో నుంచి సూపర్ స్మార్ట్ ఫోన్..
పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌ను పాస్టెల్ బ్లూ, మాట్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 18వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు...

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. పోకో సీ65 పేరుతో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో సీ65 స్మార్ట్ ఫోన్‌ను పాస్టెల్ బ్లూ, మాట్ బ్లాక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ డిసెంబర్ 18వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.74 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ ఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 180 హెచ్‌జెడ్ టచ్ సాంప్లింగ్ రేట్‌తో తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌ను అందించారు.
ఈ స్మార్ట్ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ను అందించారు. ఇక స్టోరేజ్ విషయానికొస్తే ఈ ఫోన్‌ను 128 జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్స్‌లో తీసుకొచ్చారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఇంటర్నల్ మెమోరీని పెంచుకోవచ్చు. 720×1600 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఇచ్చారు. స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ను అందించారు. డ్యూయల్ సిమ్‌కు సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో బ్లూటూత్ 5.3, జీపీఎస్, 3.5 ఎమ్‌ఎమ్ ఆడియా జాక్, యూఎస్‌బీ టైప్ సి పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.
ఇక ధర విషయానికొస్తే పోకో సీ65 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,499కాగా, 6 జీబీ స్టోరేజ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,999గా నిర్ణయించారు. పోకో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఐసీఐసీఐ డెబిట్/క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి రూ. 1000 డిస్కౌంట్ పొందొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..




