Best Phones Under 25K: మార్కెట్లో బెస్ట్ ఫోన్లు ఇవే.. అనువైన ధర.. అద్భుత ఫీచర్లు
మనం వాడుతున్న ప్రతి వస్తువు స్మార్ట్ ఫోన్ కి లింక్ అయ్యి ఉంటోంది. ఈ క్రమంలో మార్కెట్లో అనువైన ధరలోనే బెస్ట్ ఫోన్లు ఉంటున్నాయి. పైగా ఇప్పుడు 5జీ ట్రెండ్ షురూ అవడంతో అందరూ ఆ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి పనితీరు, అధిక రిజల్యూషన్ కలిగిన కెమెరాలు, స్మార్ట్ ఫీచర్లు, సూపర్ స్పెసిఫికేషన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్లను మీ కోసం జాబితా చేశాం.

స్మార్ట్ ఫోన్ అనేది లగ్జరీ అనుకునే రోజులు పోయాయి. అది కూడా ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ యుగంలో ఫోన్ లేకుండా బతకడం కష్టతరమవుతోంది. ఎందుకంటే మనం టెక్ జనరేషన్ లో ఉన్నాం. మనం వాడుతున్న ప్రతి వస్తువు స్మార్ట్ ఫోన్ కి లింక్ అయ్యి ఉంటోంది. ఈ క్రమంలో మార్కెట్లో అనువైన ధరలోనే బెస్ట్ ఫోన్లు ఉంటున్నాయి. పైగా ఇప్పుడు 5జీ ట్రెండ్ షురూ అవడంతో అందరూ ఆ ఫోన్లనే కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంచి పనితీరు, అధిక రిజల్యూషన్ కలిగిన కెమెరాలు, స్మార్ట్ ఫీచర్లు, సూపర్ స్పెసిఫికేషన్లలో మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ ఫోన్లను మీ కోసం జాబితా చేశాం. రూ. 20,000లోపు బడ్జెట్లో కావాలనుకునేవారికి ఇవి బెస్ట్ చాయిస్ గా ఉంటాయి.
శామ్సంగ్ గెలాక్సీ ఎం34 5జీ..
రూ. 25,000లోపు బడ్జెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఫోన్లలో ఇది కూడా ఒకటి. ఫుల్ హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంటుంది. శక్తివంతమైన స్ఫుటమైన విజువల్స్‌ను అందిస్తోంది. దీనిలో 50ఎంపీ ట్రిపుల్ నో షేక్ క్యామ్ హైలైట్ గా నిలుస్తుంది. 6000ఎంఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది. 4 జనరేషన్స్ ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, 5 సంవత్సరాల భద్రతా అప్‌డేట్‌లు వస్తాయి. 12జీబీ ర్యామ్, 128జీబీ ఎక్స్ టర్నల్ మెమరీ ఉంటుంది. ఎక్సినోస్ 1280 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో 16,499గా ఉంది.
వన్ ప్లస్ నోర్డ్ సీఈ2 లైట్ 5జీ..
ఈ ఫోన్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వెనుక వైపు 64ఎంపీ ప్రధాన కెమెరాతో పటు డెప్త్ లెన్స్, మాక్రో లెన్స్ ఉంటుంది. ముందు వైపు 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్‌కు అనుకూలంగా ఉంటుంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్ తో పనిచేస్తుంది. మల్టీ టాస్కింగ్, గేమింగ్‌కు సరిగ్గా సరిపోతోంది. 33వాట్ల సూపర్ వీఓఓసీ సపోర్టుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ తో పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం రూ. 17,999గా ఉంది.
నోకియా జీ42 5జీ..
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 480+ 5జీ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఇది వేగవంతమైన, సమర్థవంతమైన పనితీరును అందిస్తుంది. 6జీబీ ర్యామ్, 5జీబీ వర్చువల్ ర్యామ్ ఉంటుంది. ఫోన్ వెనుకవైపు 50ఎంపీ ట్రిపుల్ ఏఐ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా పనిచేస్తుంది. దీని ధర అమెజాన్లో రూ. 12,599గా ఉంది.
రెడ్ మీ నోట్ 12 5జీ..
ఈ ఫోన్ 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది మృదువైన, శక్తివంతమైన విజువల్స్‌ను అందిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 4 జెన్1 ప్రాసెసర్, అడ్రెనో 619 జీపీయూతో కలిసి, సమర్థవంతమైన, వేగంగా ప్రతిస్పందించే పనితీరును నిర్ధారిస్తుంది. 48ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా సెటప్ నాణ్యమైన ఫోటోగ్రఫీని అందిస్తుంది. 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర అమెజాన్లో రూ. 15,499గా ఉంది.
వన్ ప్లస్ నోర్డ్ సీసీ3 5జీ..
ఈఫోన్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో పెద్ద 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను అందిస్తుంది. సోనీ ఐఎంఎక్స్ 890తో కూడిన 50ఎంపీ ప్రధాన సెన్సార్, 8ఎంపీ అల్ట్రావైడ్, 2ఎంపీ మాక్రో లెన్స్‌లు మీ ఫోటోగ్రఫీ అనుభవానికి బహుముఖ ప్రజ్ఞను జోడిస్తాయి. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 782జీ ఆధారంగా పనిచేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 80వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్ 13 ఆధారంగా పనిచేస్తుంది. 8జీబీ ర్యామ్ 128జీబీ మెమరీతో ఉండే ఈ ఫోన్ ధర అమెజాన్లో రూ. 24,999గా ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..