Whatsapp: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై ఆ సమస్యకు చెక్..
వాట్సాప్‌లో ప్రతిరోజూ వందల సంఖ్యలో మెసేజ్‌లు వస్తాయనే విషయం తెలిసిందే. దీంతో వాట్సాప్‌లో వందల సంఖ్యలో వచ్చే మెసేజ్‌లు చదవకుండా వదిలేస్తుంటారు. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టమే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే వాట్సాప్ నుంచి 'పిన్' అనే ఫీచర్‌ను పరిచయం...

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్‌లో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తున్న వాట్సాప్ తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేశారు.
వాట్సాప్‌లో ప్రతిరోజూ వందల సంఖ్యలో మెసేజ్‌లు వస్తాయనే విషయం తెలిసిందే. దీంతో వాట్సాప్‌లో వందల సంఖ్యలో వచ్చే మెసేజ్‌లు చదవకుండా వదిలేస్తుంటారు. అయితే వీటిలో కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు కూడా ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తు పెట్టుకోవడం కష్టమే. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే వాట్సాప్ నుంచి ‘పిన్’ అనే ఫీచర్‌ను పరిచయం చేసింది. ఇంతకీ ఈ ఫీచర్ ఉపయోగం ఏంటి.? ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజ్‌ల కోసం ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ సహాయంతో కేవలం టెక్ట్స్ మాత్రమే కాకుండా వీడియోలు, పోల్స్, ఫొటోలు ఇలా వాట్సాప్‌కు వచ్చే మెసేజ్‌లను పిన్ చేసుకోవచ్చు. ఇలా పిన్ చేసిన మెసేజ్‌లు ఏడు రోజుల పాటు డిఫాల్ట్‌గా ఉంటాయి. ఒకవేళ అవసరం అనుకుంటే 24 గంటలు, 30 రోజులు ఉండేలా సెట్ చేసుకోవచ్చు. టైం అయిపోయిన తర్వాత పిన్ చేసిన మెసేజ్ అన్ పిన్ అవుతుంది. గ్రూప్ సభ్యులకు మెసేజ్‌లు పిన్ చేసి పంపడం అడ్మిన్ల చేతిలోనే ఉంటుంది.
ఎలా పిన్ చేసుకోవాలంటే..
* ఆండ్రాయిడ్ యూజర్లు మెసేజ్‌లను పిన్ చేసుకోవాలంటే. ముందుగా పిన్ చేయాలనుకుంటున్న మెసేజ్‌ను హోల్డ్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్‌పై క్లిక్ చేసి ‘పిన్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అనంతరం పిన్ డ్యురేషన్‌ను ఎంచుకోవాలి.
* ఐఫోన్ యూజర్ల విషయానికొస్తే.. మెసేజ్‌ను హోల్డ్ చేయాలి. అనంతరం మోర్ ఆప్షన్స్‌ను సెలక్ట్ చేసుకొని పిన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఇక వాట్సాప్ వెబ్ యూజర్ల విషయానికొస్తే.. మొదటగా మీరు పిన్ చేయాలనుకుంటున్న మెసేజ్‌కు వెళ్లి పిన్ మేసేజ్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం పిన్ డ్యూరేషన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఎలా అన్‌పిన్ చేసుకోవాలంటే..
* ఆండ్రాయిడ్ యూజర్లు మెసేజ్‌పై హోల్డ్ చేసి అన్‌పిన్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* ఐఫోన్ యూజర్ల విషయానికొస్తే.. మెసేజ్ ఆప్షన్‌ను హొల్డ్ చేసి మోర్ ఆప్షన్‌లోకి వెళ్లి, అన్‌పిన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..