Playfit Flaunt2: మార్కెట్‌లోకి మరో రెండు నయా స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేసిన ప్లే.. కిరాక్‌ లుక్‌తో స్టన్నింగ్‌ ఫీచర్స్‌ ఇవే..!

తాజాగా మైక్రోమ్యాక్స్-ఇంక్యుబేటెడ్ వేరబుల్స్ బ్రాండ్ వరల్డ్ ఆఫ్ ప్లే (ప్లే) కంపెనీ రెండు స్మార్ట్‌ వాచ్‌లను రిలీజ్‌ చేసింది. ప్లే ఫిట్‌ ప్లౌంట్‌ 2, ప్లే ఫిట్‌ డయల్‌ 3 ప్రో స్మార్ట్‌ వాచ్‌లను భారత మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. ప్రారంభ ఆఫర్‌ కింద ప్లే ఫిట్‌ ప్లౌంట్‌-2 వాచ్‌ రూ.1999, ప్లే ఫిట్‌ డయల్‌ 3 ప్రో వాచ్‌ రూ.1499 ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

Playfit Flaunt2: మార్కెట్‌లోకి మరో రెండు నయా స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేసిన ప్లే.. కిరాక్‌ లుక్‌తో స్టన్నింగ్‌ ఫీచర్స్‌ ఇవే..!
Play Smart Watches
Follow us
Srinu

|

Updated on: Aug 16, 2023 | 3:45 PM

ప్రస్తుతం యువత ఎక్కువగా స్మార్ట్‌వాచ్‌లను వాడడానికి ఇష్టపడుతున్నారు. గతంలో వాచ్‌లు కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించే వారు. అయితే స్మార్ట్‌ ఫోన్ల వాడకం విపరీతంగా పెరగడంతో వాచ్‌ల వినియోగం తగ్గిపోయింది. అయితే ఇప్పుడు వాచ్‌లన్నీ స్మార్ట్‌గా మారడంతో పాటు మన ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకునే వెసులుబాటు ఉండడంతో యువత వీటి వాడకంపై ఆకర్షితులవుతున్నారు. అలాగే ఈ వాచ్‌ల ద్వారా ఆరోగ్య సంబంధిత అప్‌డేట్‌లు కూడా పొందే అవకాశం ఉండడంతో మధ్య వయస్కులు కూడా వీటిని వాడడానికి ఇష్టపడుతున్నారు. పెరిగిన అనూహ్య డిమాండ్‌కు అనుగుణంగా అన్ని కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో స్మార్ట్‌ వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. తాజాగా మైక్రోమ్యాక్స్-ఇంక్యుబేటెడ్ వేరబుల్స్ బ్రాండ్ వరల్డ్ ఆఫ్ ప్లే (ప్లే) కంపెనీ రెండు స్మార్ట్‌ వాచ్‌లను రిలీజ్‌ చేసింది. ప్లే ఫిట్‌ ప్లౌంట్‌ 2, ప్లే ఫిట్‌ డయల్‌ 3 ప్రో స్మార్ట్‌ వాచ్‌లను భారత మార్కెట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంచింది. ప్రారంభ ఆఫర్‌ కింద ప్లే ఫిట్‌ ప్లౌంట్‌-2 వాచ్‌ రూ.1999, ప్లే ఫిట్‌ డయల్‌ 3 ప్రో వాచ్‌ రూ.1499 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు వాచ్‌లు ఆగస్టు 14 నుంచి కొనుగోలుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ రెండు స్మార్ట్‌ వాచ్‌ల గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ప్లే వాచ్‌ల తాజా ఫీచర్లు ఇవే

ప్లే ఫిట్‌ ప్లౌంట్‌-2 ఒక సూపర్ ఎమోఎల్‌ఈడీ రౌండ్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ప్లే ఫిట్‌ డయల్‌-3 ప్రో రెండు అంగుళాల ఐపీఎస్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ రెండువాచ్‌లు ఇంటిగ్రేటెడ్ చిప్‌సెట్ స్పోర్టింగ్ కాలింగ్ ఫీచర్, వన్-గ్లాస్ సొల్యూషన్, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది.  ప్లే ఫిట్‌ ఫ్లౌంట్‌ స్మార్ట్‌ వాచ్‌ ఆల్వేస్-ఆన్-డిస్ప్లే ఫీచర్‌కు మద్దతు ఇస్తుంది. సహజమైన స్క్రోలింగ్‌తో పాటుగా అనుకూలీకరించదగిన స్క్రీన్‌సేవర్‌లు, నావిగేషన్ సామర్థ్యాల కోసం రోటరీ క్రౌన్ బటన్‌తో కూడా వస్తుంది. ఈవాచ్‌లో ఎన్‌హాన్స్‌డ్ బాస్, ఎక్స్‌ట్రా లౌడ్ డ్రైవర్ల ద్వారా నడిచే వాచ్ నుండి నేరుగా కాల్‌లు మరియు మ్యూజిక్ ప్లేబ్యాక్‌ను ప్రారంభిస్తుంది. 

ఈ వాచ్‌లు హృదయ స్పందన రేటు పర్యవేక్షణ, ఆక్సిజన్ స్థాయి ట్రాకింగ్, రక్తపోటు కొలత, నిద్ర పర్యవేక్షణ వంటి అధునాతన ఫీచర్లతో వస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ వ్యాయామ మోడ్‌లు, శ్వాస వ్యాయామాలు, హైడ్రేషన్ రిమైండర్‌లు, మహిళా ఆరోగ్య ట్రాకర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. అలాగే ఈ వాచ్‌లు ఎస్‌ఓఎస్‌ అత్యవసర కాల్ ఫీచర్, గోప్యతా నియంత్రణలను కూడా అందిస్తుంది.ఘీ స్మార్ట్‌వాచ్ వాయిస్ అసిస్టెంట్‌లతో ఏకీకరణకు మద్దతు ఇస్తుంది. రియల్‌ టైమ్‌ నోటిఫికేషన్‌లతో పాటు దుమ్ము, నీటి నిరోధకత కోసం ఐపీ 68 రేటింగ్‌తో వస్తుంది. అలాగే ప్లే ఫిట్‌ డయల్‌-3 కాలింగ్‌, డేటా ప్రాసెసింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది ఇంటిగ్రేటెడ్ వాయిస్ అసిస్టెంట్ , బ్లూటూత్ కాలింగ్, ఫోన్-ఫ్రీ మ్యూజిక్ స్ట్రీమింగ్ సపోర్ట్‌ని కలిగి ఉంది. ఈ వాచ్‌ కూడా ఎస్పీఓ2 స్థాయిలు, రక్తపోటు, పల్స్  రేటు వంటి ఆరోగ్య విషయాలను ట్రాక్‌ చేసుకునే సదుపాయం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..