Boult Smart Watch: మరో నయా స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసిన బౌల్ట్.. దీని ఫీచర్లు తెలిస్తే షాకవుతారంతే..
పెరిగిన వినియోగానికి అనుగుణంగా కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ స్ట్రైకర్ పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. రూ.5999కే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి.
యువత ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఆరోగ్య సంబంధిత హెచ్చరికలు వస్తుండడంతో పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్‌ల వాడుతున్నారు. గతంలో పురుషులు లేదా స్త్రీలు సమయం చూసుకోవడానికి కచ్చితంగా వాచ్‌ను ధరించే వారు. అయితే క్రమేపి ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాడకం పెరగడంతో టైమ్ కూడా అందులో చూసుకునే వెసులుబాటు ఉండడంతో వాచ్‌లు ధరించడం మానేశారు. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌ల రాకతో వాచ్‌ల వినియోగం పెరిగింది. పెరిగిన వినియోగానికి అనుగుణంగా కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ స్ట్రైకర్ పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. రూ.5999కే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ప్రస్తుతం బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ కచ్చితంగా వినియోగదారులకు ఆకట్టుకుంటుందని బౌల్ట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. స్ట్రైకర్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
బౌల్ట్ స్ట్రైకర్ ఫీచర్లు ఇవే
- 1.43 అంగుళాల రౌండ్ హెచ్‌డీ ఎమోఎల్‌ఈడీ డిస్‌ప్లే
- 466×466 రిజుల్యూషన్‌తో 750 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది.
- ఈ వాచ్ ఎల్లప్పుడూ ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే మోడ్‌కు సపోర్ట్ చేస్తుంది
- బ్లూటూత్ కాలింగ్ కోసం ఇంటిగ్రేటెడ్ స్పీకర్‌తో మైక్రోఫోన్ ఫెసిలిటీ
- ఎస్‌పీఓ 2, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్, హార్ట్ రేట్ మానిటరింగ్ వంటి ఆరోగ్య పర్యవేక్షణ సామర్థ్యాలు
- మహిళల కోసం రుతుచక్ర ట్రాకింగ్‌తో పాటు స్లీప్ ట్రాకింగ్, హైడ్రేషన్, యాక్టివిటీ రిమైండర్‌లు
- 150 ప్లస్ క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు
- ఐపీ 67 సపోర్ట్‌తో వాటర్, దుమ్ము నిరోధకత
- స్మార్ట్ నోటిఫికేషన్లు, కాలిక్యులేటర్‌తో పాటు వాతవరణ వివరాలు తెలుసుకునే సదుపాయం
- సిరి, గూగుల్ అసిస్టెంట్‌తో 120కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..