WhatsApp Video Message: సరికొత్త ఫీచర్‌తో సర్‌ప్రైజ్ చేసిన వాట్సాప్.. ఇకపై వీడియో మెసేజ్‌లు కూడా.. ఎలా పంపాలంటే..

ఇప్పుడు మరో అధునాతన ఫీచర్ ను ప్రవేశపెట్టింది వాట్సాప్. అదే వీడియో మెసేజ్ ఫీచర్. దీని సాయంతో వినియోగదారులు మెసేజ్ లాగే షార్ట్ వీడియోను పంపుకోవచ్చు. 60 సెకండ్ల నిడివితో ఆ షార్ట్ వీడియోను పంపొచ్చు.

WhatsApp Video Message: సరికొత్త ఫీచర్‌తో సర్‌ప్రైజ్ చేసిన వాట్సాప్.. ఇకపై వీడియో మెసేజ్‌లు కూడా.. ఎలా పంపాలంటే..
Whatsapp
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 29, 2023 | 9:34 AM

వాట్సాప్.. మెసేజింగ్ ప్లాట్ ఫారంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించింది. ఈ దేశం, ఆ దేశం అని లేకుండా గ్లోబల్ వైడ్ పాపులారిటీని సంపాదించింది. మన దేశంలో కూడా ప్రస్తుతం వాట్సాప్ లేని ఫోన్లు ఉండవు. సమాచార మార్పిడికి, భావ వ్యక్తీకరణకు ఇది ఓ వేదికగా మారిపోయింది. అంతలా అది ప్రజలకు కనెక్ట్ అవడానికి ప్రధాన కారణం యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లు. ఎప్పటికప్పుపడు వినియోగదారుల అవసరాలను గుర్తించే వాట్సాప్ అందుకనుగుణంగా కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఇదే క్రమంలో ఇప్పుడు మరో అధునాతన ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే వీడియో మెసేజ్ ఫీచర్. దీని సాయంతో వినియోగదారులు మెసేజ్ లాగే షార్ట్ వీడియోను పంపుకోవచ్చు. 60 సెకండ్ల నిడివితో ఆ షార్ట్ వీడియోను పంపొచ్చు. ఈ వాట్సాప్ కొత్త అప్ డేట్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చినట్లు మెటా సీఈఓ మార్క్ జూకర్ బర్గ్ ప్రకటించారు.

వీడియో మెసేజ్ లు ఇలా..

వీడియో మెసేజ్‌లు చాట్‌లకు ప్రతిస్పందించడానికి రియల్ టైం వాయిస్ అని చెప్పొచ్చు. మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో 60 సెకన్లలో దానిని వివరించొచ్చు. ఎవరైనా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినా, జోక్‌లో నవ్వినా లేదా శుభవార్త అందించినా వీడియో నుండి వచ్చే అన్ని భావోద్వేగాలతో క్షణాలను పంచుకోవడానికి ఇవి ఒక ఆహ్లాదకరమైన మార్గం అని వాట్సాప్ పేర్కొంది. ఈ కొత్త ఇన్‌స్టంట్ వీడియో సందేశాలు వాయిస్ మెసేజ్‌ల మాదిరిగానే ఉంటాయి, కానీ వీడియోతో ఉంటాయి. ఇది ఇప్పటికే జూలై 27 నుండి అందుబాటులో ఉంది.

షార్ట్ వీడియో మెసేజ్ ఎలా చేయాలంటే..

ముందుగా వాట్సాప్ ను ప్లే స్టోర్ లో అప్ డేట్ చేసుకోవాలి. అప్పుడు మీరు కొత్త వీడియో మెసేజ్ ఫీచర్ ను పొందుతారు. మీరు వీడియో రికార్డు చేయాలనుకుంటే ముందుగా వీడియో మోడ్ లోకి స్విచ్ అయ్యి.. మీరు మెసేజ్ టైప్ చేసే స్పేస్ పక్కన ఉన్న వీడియో బటన్ ను నొక్కి పట్టుకొని వాయిస్ రికార్డు చేసినట్లుగానే వీడియో రికార్డు చేయాలి. అలాగే మీరు స్క్రీన్ లాక్ చేసి హ్యాండ్ తో పని లేకుండా కూడా వీడియో రికార్డు చేయొచ్చు. వీడియో సెండ్ చేశాక అవతలి వ్యక్తికి ఆటోమేటిక్ అది ప్లే అవుతుంది. కానీ మ్యూట్ మోడ్ లో ఉంటుంది. సౌండ్ ఆన్ చేస్తేనే ఆన్ అవుతుంది. వాట్సాప్ తీసుకొచ్చిన ఈ ఫీచర్ ఇప్పటికే ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. చాలా మంది దీనిని వినియోగిస్తున్నట్లు కూడా చెప్పింది. ఈ ఫీచర్ వాడాలనుకొనే వారు ముందుగా గూగుల్ లేదా యాపిల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!