AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singapore Tour: అవసరాలు తీర్చే యాప్స్ ఇవి.. సింగపూర్ వెళ్లే వారు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోండి..

మీ ట్రిప్ విజయవంతంగా జరగాలంటే వీటితో పాటు మరికొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. విదేశాల్లో తిరిగే టప్పుడు అక్కడి భాష, రవాణా వ్యవస్థ, పర్యటనా స్థలాలు తదితర వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో ఆర్థికంగా నష్టపోకుండా ఆనందంగా పర్యటించడానికి ఈ కింద తెలిపిన విధానాలు పాటించండి.

Singapore Tour: అవసరాలు తీర్చే యాప్స్ ఇవి.. సింగపూర్ వెళ్లే వారు తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకోండి..
Singapore Tour
Madhu
|

Updated on: Apr 05, 2024 | 4:23 PM

Share

విదేశీయానం ఇప్పుడు సర్వసాధారణమైంది. విమానం ఎక్కి నచ్చిన దేశానికి వెళ్లడం, అక్కడి అందాలు, వింతలు, విశేషాలను చూసి రావడం చాలా సులభమైంది. కుటుంబంతో సహా విదేశీ యాత్రలు చేయడానికి ప్రతి ఒక్కరూ సన్నాహాలు చేసుకుంటున్నారు. మనం దేశం నుంచి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లే వీలు ఉండడం, కొన్ని దేశాలు హానరబుల్ వీసాలు మంజూరు చేస్తుండడంతో విదేశీ ప్రయాణాలు పెరిగాయి.

జాగ్రత్తలు తీసుకుంటే మేలు..

విదేశీ ప్రయాణం చేయాలంటే ముందుగా బడ్జెట్ వేసుకుంటాం. దానికి అనుగుణంగా కొంత సొమ్మును దగ్గర పెట్టుకుంటాం. ఇక వీసా, పాస్ పోర్టు తదితర విషయాలను జాగ్రత్తగా చూసుకుంటాం. మీ ట్రిప్ విజయవంతంగా జరగాలంటే వీటితో పాటు మరికొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి. విదేశాల్లో తిరిగే టప్పుడు అక్కడి భాష, రవాణా వ్యవస్థ, పర్యటనా స్థలాలు తదితర వాటి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో ఆర్థికంగా నష్టపోకుండా ఆనందంగా పర్యటించడానికి ఈ కింద తెలిపిన విధానాలు పాటించండి.

సింగపూర్ వెళితే..

ఉదాహరణకు మీరు సింగ పూర్ వెళ్లాలనుకుంటున్నారు. అక్కడ భాష వేరు. మీరు ప్రయాణ సమయంలో క్యాబ్ లు, ఇతర రవాణా సాధనాలను ఎలా బుక్ చేసుకుంటారు, అలాగే అక్కడి స్థానికులతో మాట్లాడడానికి వీలుంటుందా.. ఇలాంటి సమస్యల పరిష్కారానికి చాలా సులభమైన మార్గాలు ఉన్నాయి. ఆ దేశంలోని ఐదు యాప్ లను ఉపయోగించి, విహార యాత్రను సంతోషంగా ముగించవచ్చు.

ఇవి కూడా చదవండి

గ్రాబ్ యాప్..

గ్రాబ్ అనేది సింగపూర్‌లో ఓలాకు ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. ఆ దేశంలో ప్రముఖ రవాణా సాధనంగా ఉంది. దీని ద్వారా క్యాబ్ బుక్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ఆహారం, కిరాణా సరుకులు తదితర వాటికి కూడా దీని ఉపయోగించవచ్చు.

గోథేర్.ఎస్జీ(Gothere.sg)..

ఈ మొబైల్ యాప్ రాకపోకలకు మనకు ఎంతో సహాయ పడుతుంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడానికి అవసరమైన సమాచారం అందిస్తుంది. అంటే సింగపూర్ లో మనకు గైడ్ లా ఉపయోగపడుతుంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లొకేషన్లు, మ్యాప్‌లను అందజేస్తుంది. మీ సమీపంలోని రెస్టారెంట్లు, సందర్శించాల్సిన ప్రదేశాలు, షాపింగ్ మాల్స్, ఆకర్షణీయ ప్రాంతాల వివరాలను తెలియజేస్తుంది.

ఎస్జీ బస్లెహ్(SG BusLeh)..

సింగపూర్ లో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ చాలా చౌకగా ఉంటుంది. క్యాబ్ లతో పోల్చితే తక్కువ ఖర్చవుతుంది. అయితే సరైన రూటు, బస్సు, రైళ్లు, గమ్యస్థానాలను తెలుసుకోవడం కష్టం. దాని కోసం ఎస్జీ బస్లెహ్(SG BusLeh) యాప్‌ ను ఉపయోగించవచ్చు. దీనిద్వారా బస్సు, రైళ్ల సమయాలు, రూట్ తదితర వాటిని గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు.

యువర్ సింగపూర్ గైడ్(Your Singapore guide)..

ఇది సింగపూర్ టూరిజం బోర్డ్ అధికారిక యాప్. పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన అన్ని వివరాలూ దీనిలో ఉంటాయి. ఆయా ప్రాంతాలకు సులువుగా వెళ్లడానికి ఈ యాప్ ఉపయోగపడుతుంది. అవసరమైన ఫోన్ నంబర్లు, చిరునామాలు కూడా తెలుసుకోవచ్చు.

గూగుల్ ట్రాన్స్ లేట్(Google Translate)..

సింగపూర్‌లో ప్రజలు మాండరిన్ భాషను మాట్లాడతారు. కాబట్టి వారితో కమ్యునికేట్ అవ్వడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఆ సమయంలో గూగుల్ ట్రాన్స్ లేట్ యాప్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మనకు ఈ యాప్ సహాయం చేస్తుంది. సింగపూర్ వెళ్లేవారు మాండరిన్ భాష యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

గూగుల్ లెన్స్(Google lens)..

గూగుల్ లెన్స్ కూడా మీకు చాలా సహాయకారిగా ఉంటుంది. గుర్తులు, చిహ్నాలు, రెస్టారెంట్ మెనూ తదితర వాటిని ట్రాన్స్ లేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆందోళన లేకుండా ప్రయాణ సాగించడానికి తోడ్పడుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..