PhonePe: డిజిటల్ చెల్లింపుల విషయంలో రికార్డు సృష్టించిన ఫోన్ పే..

ఒకప్పుడు ఏదైన వస్తువు కొనాలంటే చేతిలో కచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు డబ్బులు జేబులో లేకున్న కూడా డిజిటల్ చెల్లింపులతో మనకు కావాల్సిన వాటిని కొనుక్కొనే స్థాయికి వచ్చేశాం. ప్రస్తుతం దేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి డిజిటల్ చెల్లింపుల సర్వీసులను అనేక మంది వినియోగిస్తున్నారు. అయితే ఈ సేవల్లో ఫోన్ పే దూసుకెళ్తోంది. తాజాగా నాలుగు మిలియన్లకు పైగా స్మార్ట్‌స్పీకర్‌ల విస్తరణతో కీలక మైలురాయిని సాధించి రికార్డు సృష్టించింది. దేశంలో ఆఫ్‌లైన్ వ్యాపారాల్లో ఇలాంటి పరికరాలను వేగంగా పంపిణీ చేసింది.

PhonePe: డిజిటల్ చెల్లింపుల విషయంలో రికార్డు సృష్టించిన ఫోన్ పే..
Phonepe Speaker
Follow us
Aravind B

|

Updated on: Sep 12, 2023 | 1:13 PM

ఒకప్పుడు ఏదైన వస్తువు కొనాలంటే చేతిలో కచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. కానీ ఇప్పుడు డబ్బులు జేబులో లేకున్న కూడా డిజిటల్ చెల్లింపులతో మనకు కావాల్సిన వాటిని కొనుక్కొనే స్థాయికి వచ్చేశాం. ప్రస్తుతం దేశంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటియం లాంటి డిజిటల్ చెల్లింపుల సర్వీసులను అనేక మంది వినియోగిస్తున్నారు. అయితే ఈ సేవల్లో ఫోన్ పే దూసుకెళ్తోంది. తాజాగా నాలుగు మిలియన్లకు పైగా స్మార్ట్‌స్పీకర్‌ల విస్తరణతో కీలక మైలురాయిని సాధించి రికార్డు సృష్టించింది. దేశంలో ఆఫ్‌లైన్ వ్యాపారాల్లో ఇలాంటి పరికరాలను వేగంగా పంపిణీ చేసింది. అలాగే దేశంలో 19 వేల పోస్టల్ కోడ‌లలో ఫోన్ పే ప్లాట్‌పారమ్‌ను వినియోగిస్తు్న్న 36 మిలియన్ల వ్యాపారుల్లో కస్టమర్ చెల్లింపులను ధృవీకరించడం కోసం, వారిలో విశ్వాసం పెంపొందించేందుకు ఈ స్మార్ట్‌స్పీకర్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చాలా షాపుల్లో మనం డిజిటల్ చెల్లింపులు చేసినప్పుడు ఈ స్మార్ట్‌స్పీకర్ల నుంచి వాయిస్ రావడం చూసే ఉంటాం.

ఇదిలా ఉండగా దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో డిజిటలైజేషన్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ పో ఈ స్మార్ట్ స్పీకర్ ఆఫ్ లైన్ వ్యాపారులకు అనేక సేవలు అందిస్తోంది. అలాగే వ్యాపారులు విభిన్న అవసరాలు తీర్చేందుకు ఫోన్ పే అనేక నిర్ణయాలను తీసుకుంటోంది. స్మార్ట్‌స్పీకర్ల కోసం వ్యాపారులకు నాలుగు మిలయన్లకు పైగా పరికరాలను అందించింది. ప్రస్తుతం ఇండియా అంతటా నెలవారిగా చూసుకుంటే ఒక బిలియన్ వరకు లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ స్మార్ట్‌స్పీకర్ల బ్యాటరీ ఎక్కవ కాలం ఉండడం.. సౌండ్ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో కూడా ఆడియో స్పష్టంగా రావడం, రద్దీగా ఉండే కౌంటర్ స్పేస్‌లకు అనువైన కాంపాక్ట్‌గా ఉండటం లాంటి అద్భుతమైన ఫీచర్స్‌ను అందిస్తోంది. అయితే ఈ స్మార్ట్‌స్పీకర్లు రాకముందు.. వ్యాపారులు తమ డిజిటల్ చెల్లింపుల ధృవీకరణ కోసం ఎస్ఎంఎస్‌లపైనే ఎక్కువగా ఆధారపడేవారు.

ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్ల బ్యాటరీ లైఫ్ నాలుగు రోజుల వరకు ఉంటుంది. డెడికేటెడ్ డేటా కనెక్టివిటీ, LED బ్యాటరీ స్థాయి సూచికలు, తక్కువ బ్యాటరీ స్థాయిల కోసం ఆడియో అలర్ట్‌లు, చివరి లావాదేవీకి అంకితమైన రీప్లే బటన్‌తో పాటు వివిధ భాషల్లో వాయిస్ చెల్లింపు నోటిఫికేషన్లను అందిస్తాయి. అయితే ఈ సౌకర్యం వల్ల వ్యాపారులకు చెల్లింపు ధృవీకరణ అనుభవాన్ని సులభతరం చేసింది. డిజిటల్ చెల్లింపు సేవలు మరింత పెంచేందుకు ఇవి దోహదపడ్డాయి. అలాగే ఈ స్మార్ట్‌స్పీకర్లు వేగవంతమైన విస్తరణతో సహా ఆఫ్‌లైన్ వ్యాపారలకు వినూత్న పరిష్కారాలను అందించేందుకు ఫోన్ పే నిబద్ధత, ఎంఎస్ఎంఈల డిజిటల్ పరివర్తనలో దాని కీలక పాత్రను చూపిస్తోంది. అలాగే రానున్న రోజుల్లో ఈ డిజిటల్ చెల్లింపులు మరింతగా విస్తరించనున్నాయి. దేశం డిజిటలైజేషన్ దిశగా దూసుకెళ్లే విషయంలో ఈ డిజిటల్ చెల్లింపులు కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!