Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panasonic Google Tv: ప్యానసోనిక్ నుంచి ఒకేసారి 23 స్మార్ట్ టీవీలు లాంచ్.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇవి..

ప్యానసోనిక్ కంపెనీ కూడా కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఏకంగా 23 రకాల గూగుల్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ. 19,990 నుంచి రూ. 3,19,990 వరకూ ఉన్నాయి. ఈ టీవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Panasonic Google Tv: ప్యానసోనిక్ నుంచి ఒకేసారి 23 స్మార్ట్ టీవీలు లాంచ్.. ఫీచర్లు, ధర, ఇతర వివరాలు ఇవి..
Pansasonic Smart Tv
Follow us
Madhu

|

Updated on: May 09, 2023 | 3:17 PM

కాలం మారిపోయింది. అంతా స్మార్ట్ అయిపోతున్నాయి. అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికత మనిషిని స్మార్ట్ ప్రపంచంలోకి తీసుకెళ్లిపోతోంది. ఒకప్పుడు ఫోన్ ఎవరో సంపన్నుల దగ్గర మనకు కనిపించేది. కానీ ఆండ్రాయిడ్ ఆవిష్కరణతో దాని స్వరూపమే మారిపోయింది. అలాగే టీవీలు కూడా చాలా వేగంగా మార్పు చెందాయి. ఎల్ఈడీ వేరియంట్ టీవీల రాకతో దాని ముఖ చిత్రమే మారిపోయింది. ఇప్పుడు అత్యాధునిక సదుపాయాలతో కూడిన స్మార్ట్ టీవీలు మార్కెట్లో కొలువుదీరుతున్నాయి. వినియోగదారుల నుంచి కూడా వీటికి అధిక డిమాండ్ వస్తోంది. అన్ని కంపెనీలు వివిధ రకాల స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్యానసోనిక్ కంపెనీ కూడా కొత్త టీవీలను లాంచ్ చేసింది. ఏకంగా 23 రకాల గూగుల్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధర రూ. 19,990 నుంచి రూ. 3,19,990 వరకూ ఉన్నాయి. ఈ టీవీలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

వివిధ పరిమాణాల్లో..

ప్యానసోనిక్ విడుదల చేసిన ఈ గూగుల్ టీవీలు వివిధ సైజ్ లలో ఉన్నాయి. 32 అంగుళాలు, 43 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగళాలు, 75 అంగుళాల పరిమాణాల్లో టీవీలు అందుబాటులో ఉన్నాయి. ప్యానసోనిక్ అధికారిక స్టోర్లతో పటు పలువురు డీలర్లు, ప్రముఖ ఈ ప్లాట్ ఫారమ్ లలో ఇవి అందుబాటులో ఉంటాయని ప్యానసోనిక్ ప్రకటించింది.

వేరియంట్లు ఇలా..

ప్యానసోనిక్ గూగుల్ టీవీలు 4కే హెచ్‌డీఆర్, 4కే కలర్ ఇంజిన్, హై రిజల్యూషన్ అప్ స్కేలింగ్ ఫర్ హెచ్ డీ /ఫుల్ హెచ్ డీ కంటెంట్, అక్యూ వ్యూ డిస్ ప్లే, హెక్సా క్రోమ్ డ్రైవ్ వంటి వేరియంట్లలో లభిస్తోంది. అలాగే ఈ టీవీల్లో డాల్బీ అట్మోస్ ఆడియో సపోర్టు ఉంటుంది. బిల్ట్ ఇన్ హోం థియేటర్ స్పీకర్స్ ఉంటాయి. అలాగే దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. వైర్ లెస్ స్పీకర్లను కనెక్ట్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. అలాగే స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లట్లను కూడా టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డ్ ఫీచర్లైన గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వంటివి సపోర్టు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

యాప్ సపోర్టు..

ఈ కొత్త ప్యానసోనిక్ గూగుల్ టీవలో అనేక ఓటీటీ అప్లికేషన్స్ ఇంటిగ్రేట్ అయ్యి ఉంటాయి. వాటిల్లో నెట్ ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, యాపిల్ టీవీ, సోని లివ్ వంటి యాప్స్ ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..