Ola Krutrim AI Chatbot: చాట్ జీపీటీకి పోటీగా ‘కృత్రిమ్ ఏఐ’.. ఓలా నుంచి పూర్తి దేశీయ సాంకేతికతతో..
ఓలా నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. కృత్రిమ్ ఏఐ పేరుతో ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఇంటర్ ఫేస్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో వేదిక అయిన ఎక్స్ లో పేర్కొన్నారు. వాస్తవానికి 2023 డిసెంబర్లోనే ఈ కృత్రిమ్ ఏఐ మోడల్ గురించి ఆయన వివరించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)గా ఇది రానుందని హింట్ ఇచ్చారు.

ప్రస్తుతం అంతా కృత్రిమ మేధ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) ట్రెండ్ నడుస్తోంది. ఒక పక్క ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, మరోపక్క గూగుల్ జెమినీ పోటా పోటీగా పనిచేస్తున్నాయి. అనేక రకాల ఏఐ టూల్స్ ను తీసుకొస్తూ వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తున్నాయి. అన్ని రంగాల్లో దీని వినియోగం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో ఓలా నుంచి ఓ కీలక అప్ డేట్ వచ్చింది. కృత్రిమ్ ఏఐ పేరుతో ఓ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన ఇంటర్ ఫేస్ తీసుకొచ్చినట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన సోషల్ మీడియాలో వేదిక అయిన ఎక్స్ లో పేర్కొన్నారు. వాస్తవానికి 2023 డిసెంబర్లోనే ఈ కృత్రిమ్ ఏఐ మోడల్ గురించి ఆయన వివరించారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్(ఎల్ఎల్ఎం)గా ఇది రానుందని హింట్ ఇచ్చారు. ఆ విధంగా ఇప్పుడు దీనిని కృత్రిమ్ ఏఐ చాట్ బోట్ గా ఆవిష్కరించారు. ఇది ఇండియన్ ఆరిజన్ ఎల్ఎల్ఎం అని పేర్కొన్నారు. అంతేకాక ఈ చాట్ బాట్ పబ్లిక్ వినియోగానికి అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఇది ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, గూగుల్ జెమీనీలకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
As promised, starting the @Krutrim AI public beta roll out today. Use it here: https://t.co/ZLVMelYEbz
ఇవి కూడా చదవండిThis is a start for us and our first generation product. Lots more to come and this will also improve significantly as we build on this base. Do give us your feedback.
While…
— Bhavish Aggarwal (@bhash) February 26, 2024
ఏయే భాషల్లో అంటే..
కృత్రిమ్ ఏఐ రెండు వెర్షన్లలో వస్తుంది. కృత్రిమ్, కృత్రిమ్ ప్రో. కృత్రిమ్ వెర్షన్ 22 భారతీయ భాషలను అర్థం చేసుకోగలదు. హిందీ, తమిళ్, బెంగాలి, మరాఠీ, కన్నడ, గుజరాతి, హింగ్లిష్, స్టాండర్డ్ ఇంగ్లిష్ వంటివి లిస్ట్ లో ఉన్నాయి.
ఎలా వినియోగించాలి..
ప్రస్తుతం వినియోగదారులు భారతీయ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సైన్ అప్ చేయవలసి ఉంది. ముందుగా chat.olakrutrim.com వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ ఫోన్ నంబర్‌ని ఉపయోగించి సేవ కోసం సైన్ అప్ చేయండి. మీ ఫోన్ నంబర్ నుంచి ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి. ఆ తర్వాత మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నను చాట్ బాట్ ను అడగొచ్చు. దానికి సమాధానాలు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వస్తాయి.
ఈ కృత్రిమ్ వెబ్ సైట్ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ, జెమినీ లను పోలి ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్నకు రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు దానిపై కామెంట్ చేయొచ్చు. లైక్ లేదా డిస్ లైక్ చేయొచ్చు. వినియోగదారుడు సంతృప్తి చెందలేదని కృత్రిమ్ గ్రహించి తన రెస్పాన్స్ ను రిక్రియేట్ చేసుకుంటుందని కంపెనీ ప్రకటించింది. వెబ్ సైట్ ఎడమ చేతి వైపునా చాట్ బాట్ తో మాట్లడినదంతా రికార్డు అయ్యి ఉంటుంది. ఈ హిస్టరీని డిలీట్ చేసే ఆప్షన్ ప్రస్తుతానికి లేదు.
ఉపయోగాలు ఏంటి..
ఈ కృత్రిమ్ ఏఐ ద్వారా కోడ్లు రాయోచ్చు, ఫుడ్ రెసిపీలను పొందొచ్చు, ఆర్టికల్స్ పొందొచ్చు, ట్రావెల్ ప్లానింగ్ వంటివి సులభంగా పొందొచ్చు. గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, కృత్రిమ్ ఇప్పటికీ బీటా వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి సెప్టెంబర్ 2021 తర్వాత సమాచారానికి పరిమితం చేసింది. కాబట్టి మీరు వాస్తవాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




