Samsung Galaxy Fit3: మిమ్మల్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచే స్మార్ట్ వాచ్.. శామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 ప్రత్యేకతలివే..
సామ్సంగ్ తన కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ గెలాక్సీ ఫిట్ 3ని దేశంలో విడుదల చేసింది. ఈ కంపెనీ 2020లో విడుదల చేసిన గెలాక్సీ ఫిట్ 2 కంటే దీనిలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త గెలాక్సీ ఫిట్ 3 ట్రాకర్ రూ.4,999 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో శామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, అందులోని హెల్త్ ట్రాకర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆధునిక కాలంలో ఆరోగ్యంపై ప్రతి ఒక్కరికీ శ్రద్ధ పెరిగింది. వ్యాయామం, యోగా, సూర్యనమస్కారాలు వంటివి వాటిపై ఆసక్తి పెరిగింది. నేటి ఉరుకులు, పరుగుల జీవితంలో శరీరానికి శ్రమ కల్పించే అవసరం లేకుండా పోయింది. ప్రతి పనీ సులభంగా పూర్తి చేయడానికి అనేక మెషీన్లు వచ్చాయి. మనకు చెమట పట్టే అవకాశం లేకపోయింది. తద్వారా అనేక అనారోగ్యాలు కలుగుతున్నాయి. దీంతో వ్యాయామం చేయడం, నడవడం, ఆసనాలు వేయడం సర్వసాధారణమైంది. వ్యాయామం చేయడం మాత్రమే కాదు దాని ప్రయోజనాలను ట్రాక్ చేసుకోవడం కూడా ఇటీవల బాగా అలవాటైంది. అందుకోసం స్మార్ట్ వాచ్ లు బాగా ఉపయోగపడుతున్నాయి. వీటిల్లో అనేక హెల్త్, ఫిట్ నెస్ ట్రాకర్లు ఉంటుండటంతో అందరూ వీటిని వినియోగిస్తున్నారు. ఎన్ని క్యాలరీలు కరుగుతున్నాయి? హార్ట్ బీట్, పల్స రేట్, శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు వంటివి తెలుసుకునే వీలు వీటి ద్వారా తెలుస్తోంది. దీంతో వీటిని వయోభేదం లేకుండా అందరూ వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో మార్కెట్లో అనేక కంపెనీలు స్మార్ట్ వాచ్ లను లాంచ్ చేస్తున్నాయి. ఇటీవల టాప్ బ్రాండ్ అయిన శామ్సంగ్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్ ఒకటి లాంచ్ అయ్యింది. శామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3 పేరుతో ఇది మన దేశంలో లాంచ్ అయ్యింది. దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సామ్సంగ్ గెలాక్సీ ఫిట్ 3..
సామ్సంగ్ తన కొత్త ఫిట్‌నెస్ ట్రాకర్ గెలాక్సీ ఫిట్ 3ని దేశంలో విడుదల చేసింది. ఈ కంపెనీ 2020లో విడుదల చేసిన గెలాక్సీ ఫిట్ 2 కంటే దీనిలో ఎక్కువ ప్రత్యేకతలు ఉన్నాయి. కొత్త గెలాక్సీ ఫిట్ 3 ట్రాకర్ రూ.4,999 ధరకు వినియోగదారులకు అందుబాటులో ఉంది.
ఆకర్షణీయ రంగులు..
గెలాక్సీ ఫిట్ 3 ట్రాకర్‌ను మూడు ఆకర్షణీయమైన రంగుల్లో రూపొందించారు. గ్రే, పింక్ గోల్డ్, సిల్వర్ రంగుల్లో మార్కెట్‌లో లభిస్తుంది. సామ్సంగ్ అధికార వెబ్‌సెట్‌తో పాటు ఇతర ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫాంలోనూ దీనిని కొనుగోలు చేయవచ్చు. పెద్ద స్క్రీన్, ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, సరికొత్త ఫీచర్లు దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
ప్రత్యేకతలు..
- గెలాక్సీ ఫిట్ 3 ట్రాకర్ స్క్రీన్ 1.6 అంగుళాలు ఉంటుంది. దీని కారణంగా వినియోగదారులకు డిస్‌ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే చాలు. దాదాపు 13 రోజుల వరకూ బ్యాటరీ పనిచేస్తుంది. దీంతో తరచూ చార్జింగ్ చేసే పని ఉండదు. నెలకు సుమారు రెండుసార్లు చార్జింగ్ చేస్తే చాలు.
- 5ఏటీఎం, ఐపీ68 వంటి ఐపీ రేటింగ్ కలిగిన వాటితో ప్రత్యేకంగా రూపొందించారు. ఇవి నీరు, దుమ్మును లోపలకు రానివ్వవు. తద్వారా ఎక్కువ కాలం పనిచేస్తుంది. మనకు నమ్మకం పెరుగుతుంది.
- ఫాల్ డిటెక‌్షన్, ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్ వంటి రక్షణ వ్యవస్థతో తయారు చేయడం ద్వారా ఎలాంటి పరిస్థితిలోనా పాడైపోదు. మనకు ఉపయోగంగా ఉంటుంది.
- వ్యాయామం చేసే వారికి ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూర్చుతుంది. సుమారు వందకు పైగా వర్కౌట్లను ఇది సపోర్టు చేస్తుంది.
- దీనిలో మరో ముఖ్యమైన అంశం వాచ్ ఫేసెస్. వందకు పైగా ప్రిసెట్ డిజైన్లు, ఆప్షన్ల ద్వారా టచ్ కోసం సొంత ఫొటోలను ఉపయోగించవచ్చు.
- గెలాక్సీ ఫిట్ 3 మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. దీన్ని బహుళ ప్రయోజనకారి అని చెప్పవచ్చు. దీనిలోని కెమెరా, టైమర్, మీడియా ప్లేబ్యాక్ వంటి స్మార్ట్ ఫోన్ ఆప్షన్లను సులభంగా చేయవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




