OLA Driver Scam: క్యాబ్ డ్రైవర్లతో తస్మాత్ జాగ్రత్త! నకిలీ యాప్‌తో మోసాలు.. ఏమరపాటుగా ఉంటే అంతే..
బెంగళూర్ కు చెందిన ఓ మహిళ ప్రయాణం కోసం ఓలా కారును బుక్ చేసుకుంది. కారు రాగానే అందులో ఎక్కి గమ్యస్థానానికి చేరుకుంది. డబ్బులు ఎంత అని అడగ్గా డ్రైవర్ రూ.749 అని చెప్పాడు. కానీ ఆమె యాప్ లో కేవలం రూ.254 మాత్రమే చూపించింది. ఆ విషయంపై ప్రశ్నించగా డ్రైవర్ తప్పించుకోబోయాడు. వెంటనే అతడి ఫోన్ ను పరిశీలించగా అది నకలీ యాప్ అని తేలింది.

ఆన్ లైన్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కొత్త రూపాలలో మన ముందు జరుగుతున్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొత్త విధానంలో మోసగాళ్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకూ మనం బ్యాంకుల పేరుతో జరిగే మోసాలు చూశాం. స్టాక్ మార్కెట్ పేరుతో తయారు చేస్తున్న నకిలీ వెబ్ సైట్ల గురించి విన్నాం. ఈజీ మనీ పేరుతో అధిక వడ్డీలకు ఆశపడి డబ్బులను పొగొట్టుకున్న వారి గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు కొత్తగా ఓలా డ్రైవర్ తన ప్రయాణికురాలిని నకిలీ యాప్ ద్వారా మోసం చేయబోయాడు. అధికంగా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడు, ఆ మహిళ అప్రమత్తంగా ఉండడంతో ఆ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్ అయ్యింది.
ఓలా డ్రైవర్ మోసం..
బెంగళూర్ కు చెందిన ఓ మహిళ ప్రయాణం కోసం ఓలా కారును బుక్ చేసుకుంది. కారు రాగానే అందులో ఎక్కి గమ్యస్థానానికి చేరుకుంది. డబ్బులు ఎంత అని అడగ్గా డ్రైవర్ రూ.749 అని చెప్పాడు. కానీ ఆమె యాప్ లో కేవలం రూ.254 మాత్రమే చూపించింది. ఆ విషయంపై ప్రశ్నించగా డ్రైవర్ తప్పించుకోబోయాడు. వెంటనే అతడి ఫోన్ ను పరిశీలించగా అది నకలీ యాప్ అని తేలింది. అంటే దాదాపు రూ.500 ఎక్కువ తీసుకోవడానికి డ్రైవర్ ప్రయత్నించాడు. ఓలా కారులలో ప్రయాణించే వారందరూ ఇలాంటి మోసాలపై జాగ్రత్తగా వ్యవహరించాలి.
అనుమానంతో..
బెంగళూర్ మహిళ ఓలా కారులో 5.1 కిలోమీటర్లు ప్రయాణించి తన గమ్యస్థానానికి చేరుకుంది. డ్రైవర్ ఆమెను రూ.749 చెల్లించాలని అడిగాడు. కానీ జేపీ నగర్ ఫేజ్ 3 నుంచి విల్సన్ గార్డెన్ వరకు రూ. 254 ధరతో క్యాబ్ బుక్ అయ్యింది. ట్రిప్ ముగిసిన తర్వాత ఛార్జీ పెరిగిపోవడంతో ఆమెకు ఏమి చేయాలో తెలియలేదు. కానీ పెరిగిన చార్జీ పదో, ఇరవయ్యో కాదు. ఏకంగా రూ.500 ఎక్కువ కావడంతో ఆమెకు అనుమానం వచ్చింది.
నకిలీ స్క్రీన్ షాట్ తీసి..
యాప్ లో కేవలం రూ.254 చూపిస్తోందని ఆమె డ్రైవర్ తో చెప్పింది. కానీ అతడు ఆశ్చర్యపోయినట్టు నటించాడు. తన ఫోన్ లో వేరేలా ఉందని, ఆ ప్రకారమే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశాడు. అనంతరం తన ఫోన్ ను ఆమెకు ఇచ్చి, అందులో ఎంత చార్జి చూపిస్తుందో చూడమన్నాడు. ఓలా డ్రైవర్ ఫోన్ ను ఆ మహిళ తీసుకుని పరిశీలించింది. అతడు చూపించిన యాప్ వెనుక అసలు ఓలా యాప్ రన్ అవుతున్నట్టు గుర్తించింది. అంటే ఆ డ్రైవర్ నకిలీ స్క్రీన్ షాట్ చూపించి, మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించింది. వెంటనే అసలు యాప్ లోగోను నొక్కగానే, అసలు చార్జి బయటపడింది. దీంతో మోసం విషయం కూడా బయటకు వచ్చింది.
నెటిజన్ల ఆగ్రహం..
ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగానే నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించారు. చాలా మంది ఆ మహిళ సమయ స్ఫూర్తిని మెచ్చుకున్నారు. ఇటీవల ఇలాంటి స్కామ్ లు పెరిగిపోయాయి, మీరు తెలివిగా బయటపట్టారు అంటూ ఆమెను అభినందించారు. ఇంకొందరు ఓలాపై విరుచుకుపడ్డారు. అందుకనే ఓలా కంటే ఉబెర్ ను ప్రిఫర్ చేయాలని సూచించారు. అటువంటి పరిస్థితులను నివారించడానికి యాప్ బిల్ట్ వాలెట్‌ని ఉపయోగించడం ఉత్తమ మార్గం అని కొంతమంది సలహా ఇచ్చారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
