Smartphone: బీపీకి, స్మార్ట్‌ఫోన్‌కి మధ్య సంబంధం.. పరిశోధనల్లో సంచలన విషయాలు
ఫోన్ వాడకం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు..

ఉదయం లేవగానే మొదటి చూసే వస్తువు, రాత్రి పడుకునే ముందు చివరిగా చూసే వస్తువు ఏదైనా ఉందా అంటే ఠక్కున చెప్పే సమాధానం స్మార్ట్‌ఫోన్. అంతలా ఫోన్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. చేతిలో ఫోన్ లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. ఒకప్పుడు కేవలం కాల్స్ మాట్లాడుకోవడానికి ఉపయోగించే గ్యాడ్జెట్ ఇప్పుడు అన్నింటికీ ఆధారమైంది. అయితే మన జీవితాల్ని ఎంతో సింపుల్‌గా మార్చిన ఫోన్, ఆరోగ్యాలను మాత్రం ప్రమాదంలోకి నెట్టేస్తోంది.
ఫోన్ వాడకం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఇప్పటికే పలు పరిశోధనలు తెలిపాయి. అయితే తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. మొబైల్ ఫోన్‌లో ఎక్కువసేపు మాట్లాడితే అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు ఫోన్‌లో మాట్లాడే వారికి రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుందని ఇటీవల నిర్వహించిన అధ్యాయనంలో వెల్లడైంది.
ఈ వివరాలను ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురించారు. మొబైల్ ఫోన్‌ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలకు కారణంగా మారుతుందని చైనాలోని గ్వాంగ్‌జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ఈ కారణంగా ఏటా ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోందని పరిశోధకులు చెబుతున్నారు. భారత్‌లో 120 కోట్లకిపైగా మంది మొబైల్ ఫోన్‌లను ఉపయోగిస్తుంటే.. వారిలో 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని తేలింది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది బీపీ బారిన పడితో వీరిలో ఏకంగా 82 శాతం తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే కావడం గమనార్హం.
హైబీపీ వల్ల గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వారంలో 30 నిమిషాల కంటే ఎక్కువగా మొబైల్‌లో మాట్లాడే వారిలో ఇతరులతో పోల్చితే రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఇక వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్‌లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది. అందుకే వీలైనంత వరకు ఫోన్‌లలో మాట్లాడాలని సూచిస్తున్నారు. లేదంటే ఫోన్ దూరంగా ఉంచి స్పీకర్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలని చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..
