Redmi Note 13R: రూ. 15 వేల బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్స్.. రెడ్‌మీ నుంచి కొత్త ఫోన్
బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కంపెనీలు పెద్ద ఎత్తున స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా రూ. 15వేల బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ నోట్13 ఆర్ పేరుతో చైనాలో లాంచ్ చేసిన ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..