- Telugu News Photo Gallery Technology photos Amazon offering 80 percentage discount on smart watches, Check here for full details
Smartwatch: స్మార్ట్ వాచ్‌లపై ఊహకందని ఆఫర్స్.. అమెజాన్ సేల్‌లో ఏకంగా 80 శాతం డిస్కౌంట్
ప్రస్తుతం స్మార్ట్ వాచ్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం సమయం తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగించే వాచ్ ఇప్పుడు స్మార్ట్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఈ కామర్స్ సంస్థలు స్మార్ట్ వాచ్‌లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెజాన్ మెగా స్మార్ట్ వాచ్ డేస్ సేల్ పేరుతో ఏకంగా 80 శాతం డిస్కౌంట్ అందిస్తోంది..
Updated on: May 20, 2024 | 10:50 AM

Beatxp Flare Pro BoAt Flash Edition: ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ. 6,990గా ఉండగా అమెజాన్‌లో ఏకంగా 87 శాతం డిస్కౌంట్‌తో రూ. 899కే సొంతం చేసుకోవచ్చు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 1.3 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. అలాగే ఇందులో స్లీప్ మానిటరింగ్, కెమెరా, మ్యూజిక్ కంట్రోల్, ఐపీ68 డస్ట్, స్వెట్, స్ల్పాష్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు. వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజులు నాన్‌స్టాప్‌గా పనిచేస్తుంది.

boAt Xtend Smart Watch: బోట్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 7,990కాగా అమెజాన్ సేల్‌లో ఏకంగా 87 శాతం డిస్కౌంట్‌తో రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.69 ఇంకచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. అలాగే మల్టీపుల్ వాచ్ ఫేస్, స్ట్రెస్ మానిటర్, హార్ట్, ఎస్‌పీఓ2 మానిటరింగ్, 14 స్పోర్ట్స్ మోడ్స్, స్లీప్ మానిటరింగ్ వంటి ఫీచర్లను అందించారు.

BeatXP Vega Neo: ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 11,999కాగా అమెజాన్ సేల్‌లో ఏకంగా 92 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.43 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆల్‌వేస్ ఆన్ డిస్‌ప్లే, హెల్త్ ట్రాకింగ్‌తో పాటు 100కిపైగా స్పోర్ట్స్ మోడ్స్‌ను అందించారు.

itel ICON-3 Smartwatch: ఐటెల్ కంపెనీకి చెందిన ఈ స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5,999కాగా ప్రస్తుతం సేల్‌లో భాగంగా ఏకంగా 73 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1599కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ కాలింగ్, 2.01 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 500 నిట్స్ బ్రైట్‌నెస్, ఫంక్షనల్ క్రౌన్, ఐపీ67 వాటర్ ప్రూఫ్ రెసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు.

beatXP Flare Pro: బీట్‌ఎక్స్‌పీ ఫ్లేర్ ప్రో స్మార్ట్ వాచ్ అసలు ధర రూ. 5,499కాగా 76 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 1299కి సొంతం చేసుకోవచ్చు. ఈ వాచ్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 1.39 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్, 100కిపై స్పోర్ట్స్ మోడ్స్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‌పీఓ2, ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లను అందించారు.




