UPI: అందుబాటులోకి యూపీఐ సర్కిల్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంక్‌ అకౌంట్ లేని వారికి కూడా స్మార్ట్‌ ఫోన్స్‌ ఉన్నాయి. మరి బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే ఎలా.? ఇలాంటి వారికి ఉపయోగపడేలా యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా...

UPI: అందుబాటులోకి యూపీఐ సర్కిల్ ఫీచర్‌.. ఉపయోగం ఏంటి? ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..
Upi Circle
Follow us

|

Updated on: Sep 06, 2024 | 4:22 PM

దేశంలో ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు ఓ రేంజ్‌లో పెరిగిపోతున్నాయి. ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేస్తున్న వారి సంఖ్య ఎక్కువైంది. ప్రతీ ఒక్కరికీ స్మార్ట్ ఫోన్‌ అందుబాటులోకి రావడం, ఇంటర్నెట్ ఛార్జీలు తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే యూపీఐ సేవలను మరింత విస్తరించే క్రమంలో నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ) కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా యూపీఐ సర్కిల్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఇంతకీ ఏంటీ యూపీఐ సర్కిల్ ఫీచర్‌.? దీనిని ఎలా యాక్టివ్‌ చేసుకోవాలి.? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ప్రతీ ఒక్కరికీ స్మార్ట్‌ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. బ్యాంక్‌ అకౌంట్ లేని వారికి కూడా స్మార్ట్‌ ఫోన్స్‌ ఉన్నాయి. మరి బ్యాంక్‌ అకౌంట్‌ లేని వారు యూపీఐ పేమెంట్స్‌ చేయాలంటే ఎలా.? ఇలాంటి వారికి ఉపయోగపడేలా యూపీఐ సర్కిల్ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కుటుంబసభ్యులు, స్నేహితులను సెకండరీ యూజర్లుగా యాడ్ చేసుకోవచ్చు. దీంతో ప్రైమరీ యూజర్​ బ్యాంక్​ అకౌంట్​ నుంచి వారు ట్రాన్సాక్షన్​ చేసుకోవచ్చు. ప్రైమరీ అకౌంట్‌ నుంచి డబ్బులు కట్ అవుతాయి. ఇందుకోసం లిమిట్ కూడా సెట్ చేసుకోవచ్చు.

ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు పాకెట్​ మనీ ఇచ్చేందుకు, సీనియర్​ సిటీజెన్​లకు సాయం చేసేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. సెకండరీ యూజర్‌ గరిష్టంగా ఎంత వరకు ఖర్చు చేయొచ్చనేది ప్రైమరీ యూజర్‌ సెట్ చేసుకోవచ్చు. ఇక సెకండరీ యూజర్స్​ ఏయే ట్రాన్సాక్షన్స్‌ చేస్తున్నారన్న విషయాన్ని కూడా ప్రైమరీ యూజర్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షించవచ్చు. ప్రస్తుతం యూపీఐ సర్కిల్​ నెలవారీ ట్రాన్సాక్షన్​ లిమిట్​ రూ. 15వేలుగా ఉంది. ఒక్క ట్రాన్సాక్షన్​ గరిష్ఠ లిమిట్​ రూ. 5వేలు. అంతేకాదు ప్రైమరీ యూజర్​ యాడ్​ చేసిన 24 గంటల వరకు సెకండరీ యూజర్​ కేవలం రూ. 5వేలు మాత్రమే బదిలీ చేయగలరు.

ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

* ఇందుకోసం ముందుగా యూపీఐ యాప్స్‌లో కనిపించే ‘యూపీఐ సర్కిల్‌’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

* అనంతరం సెకండరీ యూపీఐ ఐడీని ఎంటర్‌ చేయాలి. లేదా వారి యూపీఐ యాప్‌ను ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. ఫోన్‌ నెంబర్‌ ద్వారా కూడా యాడ్‌ చేసుకోవచ్చు.

* ఆ తర్వాత ‘స్పెండ్ విత్ లిమిట్స్‌’, ‘అప్రూవ్‌ ఎవ్రీ పేమెంట్‌’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకొని అనుమతులు ఇవ్వాలి.

* వెంటనే సెకండీ యూజర్‌కి రిక్వెస్ట్ ఆమోదించాలని నోటిఫికేషన్‌ వెళ్తుంది.

* అనుమతులు ఇచ్చిన వెంటనే ప్రైమరీ యూజర్​ అకౌంట్​ నుంచి సెకండరీ యూజర్​ ట్రాన్సాక్షన్స్​ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..