- Telugu News Photo Gallery Technology photos Elon musk launches new X TV app click here for app details
X tv App: మస్క్ మామ మరో సంచలనం.. యూట్యూబ్‌కు చెక్ పెట్టేందుకేనా
ఎలాన్ మస్క్.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ ప్రపంచ కుబేరుడు ఏ వ్యాపారంలోకి దిగిన తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. ఇప్పటికే స్పేస్ ఎక్స్‌తో అంతరిక్ష రంగంలో, టెస్లాతో ఆటోమొబైల్ రంగంలో దూసుకుపోతున్న మస్క్.. తాజాగా సోషల్ మీడియాలోకి కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత తనదైన మార్క్ ఉండేలా చూసుకుంటున్నాడు..
Updated on: Sep 06, 2024 | 8:43 PM

ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎన్నో మార్పులు చేశాడు. ఎక్స్‌గా పేరు మార్చడం మొదలు ప్రీమియం సేవలను అందిస్తూ ఆదాయ మార్గాలను పెంచడమే లక్ష్యంగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నాడు.

ఈ క్రమంలోనే తాజాగా ఎక్స్ టీవీ యాప్ పేరుతో మరో సంచలనానికి తెరతీశాడు మస్క్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ యూట్యూబ్‌కు పోటీనిచ్చే దిశగా మస్క్ ఈ కొత్త యాప్‌ను తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

స్మార్ట్ టీవీలకు సపోర్ట్ చేసే విధంగా ఈ యాప్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ యాప్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఈ యాప్‌లో సినిమాలతో పాటు, లైవ్ టీవీ వంటివి చూసే అవకాశం లభించనున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ యాప్ మొదట ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఎల్‌జీ, అమెజాన్ ఫైర్ టీవీ, గూగుల్ టీవీ వంటి వాటిలో మాత్రమే అందుబాటులోకి రానున్టన్లు తెలుస్తోంది. గూగుల్ ప్లేస్టోర్, ఎల్‌జీ స్టోర్ లేదా అమెజాన్ స్టోర్స్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈ యాప్‌లో ట్రెండింగ్ వీడియో అల్గారిథమ్, వీడియో సెర్చింగ్ వంటి వాటితో పాటు.. రీప్లే టీవీ, స్టార్ట్‌ఓవర్ టీవీ, ఫ్రీ క్లౌడ్ డీవీఆర్ (100 గంటలు కంటెంట్‌ను రికార్డ్ చేయవచ్చు) వంటి ఫీచర్లను అందించనున్నట్లు తెలుస్తోంది.




