- Telugu News Photo Gallery Technology photos Oneplus launching new smartphone in october Oneplus 13 features and price details
Oneplus 13: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో..
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. వన్‌ప్లస్ 13 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ఎప్పుడు లాంచ్ కానుంది.? ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Sep 06, 2024 | 9:46 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ అక్టోబర్ నెలలో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఆ తర్వాత భారత్‌లో లాంచ్ కానుంది.

ఈ ఫోన్‌కు సంబంధించిన కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్ ఫీచర్లకు సంబంధించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 4 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.

ఇక వన్‌ప్లస్ 13 ఫోన్‌లో 6.8 ఇంచెస్‌తో కూడి స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన అత్యంత శక్తివంతమైన బ్యాటరీని అందించనున్నారు.

ఈ ఫోన్‌ను 100 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. స్క్వేర్ కెమెరా సెటప్‌తో ఇందులో కెమెరాను ఇవ్వనున్నారు. 50 ఎంపీతో కూడిన కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 6 ఎక్స్ ఆప్టికల్ జూమ్ ఈ కెమెరా సొంతం.

ఈ ఫోన్‌లో ఐపీ68 రేటింగ్‌తో కూడిన వాటర్ రెసిస్టెంట్‌ను ఇవ్వనున్నారు. సెక్యూరిటీ కోసం అల్ట్రా సోనిక్ సెన్సర్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 16 జీబీ ర్యామ్, 1 టీబీ స్టోరేజ్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.




