Nothing Phone 2a Plus: మూడు 50ఎంపీ కెమెరాలతో ‘నథింగ్’ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలోనే..

గత మార్చి నెలలోనే నథింగ్ ఫోన్ 2ఏ ని తీసుకొచ్చింది. కాగా ఇప్పుడు దీనికి అప్ గ్రేడ్ వెర్షన్ ని ప్రకటించింది. నథింగ్ 2ఏ ప్లస్ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీనిలో అప్ గ్రేడ్ అయిన కెమెరా సిస్టమ్, కొత్త డిజైన్, మెరుగైన డిస్ ప్లే, మెరుగైన చార్జింగ్ స్పీడ్ లను కలిగి ఉంటుంది. దీని ప్రారంభ దర రూ. 24,999గా ఉంది. ఈ నేపథ్యంలో నథింగ్ 2ఏ ప్లస్ స్మార్ట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

Nothing Phone 2a Plus: మూడు 50ఎంపీ కెమెరాలతో ‘నథింగ్’ కొత్త స్మార్ట్ ఫోన్.. తక్కువ ధరలోనే..
Nothing Phone 2a Plus
Follow us

|

Updated on: Aug 01, 2024 | 4:46 PM

నథింగ్ ఫోన్.. ప్రపంచంలో స్మార్ట్ ప్రపంచానికి కొత్తదనాన్ని తీసుకొచ్చిన బ్రాండ్. సరికొత్త లుక్లో, అత్యాధునిక సాంకేతికతతో ఇది వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ బ్రాండ్ నుంచి ఇప్పటికే రెండు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. గత మార్చి నెలలోనే నథింగ్ ఫోన్ 2ఏ ని తీసుకొచ్చింది. కాగా ఇప్పుడు దీనికి అప్ గ్రేడ్ వెర్షన్ ని ప్రకటించింది. నథింగ్ 2ఏ ప్లస్ పేరుతో దీనిని లాంచ్ చేసింది. దీనిలో అప్ గ్రేడ్ అయిన కెమెరా సిస్టమ్, కొత్త డిజైన్, మెరుగైన డిస్ ప్లే, మెరుగైన చార్జింగ్ స్పీడ్ లను కలిగి ఉంటుంది. దీని ప్రారంభ దర రూ. 24,999గా ఉంది. ఈ నేపథ్యంలో నథింగ్ 2ఏ ప్లస్ స్మార్ట్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్ల గురించి తెలుసుకుందాం..

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ ధర..

నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ రెండు ర్యామ్ వేరియంట్‌లలో లాంచ్ అయ్యింది. 8జీబీ, 12జీబీ ర్యామ్ సైజ్ లలో ఉంటుంది. రెండూ 256జీబీ స్టోరేజీని కలిగి ఉన్నాయి. మన భారత దేశంలో మాత్రమే రెండు ర్యామ్ సైజ్ లను తీసుకొచ్చింది. యూఎస్, యూకేలలో మాత్రం కేవలం 12జీబీ ర్యామ్ ఫోన్ నే తీసుకొచ్చింది. ఇక ధర విషయానికి వస్తే, 8జీబీ ర్యామ్ వేరియంట్ మొదటి రోజు విక్రయానికి మాత్రం రూ. 24,999, దీని తర్వాత ఫోన్ ధర రూ. 27,999కి పెరుగుతుంది. 12 జీబీ మోడల్ మొదటి రోజు రూ. 26,999కి అందుబాటులో ఉంటుంది. తర్వాత రూ. 29,999కి వస్తుంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ భారతదేశంలో ఆగస్టు 7 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఆసక్తికరంగా, స్మార్ట్‌ఫోన్ మొదట భారతీయ మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది. సెప్టెంబర్‌లో మాత్రమే ఇతర మార్కెట్‌లకు అందుబాటులో ఉంటుంది.

నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ స్పెసిఫికేషన్‌లు

ఈ ఫోన్లో కొత్త మీడియా టెక్ డైమెన్సిటీ 7350 ప్రో చిప్‌సెట్‌ను ఉపయోగించింది. గ్రాఫిక్స్ కోసం ఏఆర్ఎం మాలి-జీ610 జీపీయూతో కలిసి ఉంటుంది. దీనిలో బ్యాటరీ 5000ఎంఏహెచ్ ఉంటుంది. 50వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్‌లోని కెమెరా సిస్టమ్ కూడా అప్‌గ్రేడ్ అయ్యింది. స్మార్ట్‌ఫోన్‌లో మూడు 50-మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి సెల్ఫీల కోసం ముందు ఉంటుంది. వెనుక వైపు రెండు ఉన్నాయి. ఇవి హెచ్డీఆర్ ఫోటో, 4కే వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తాయి. ఫుల్ హెచ్డీ ప్లస్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1300 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తో వస్తుంది. 120 హెర్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. 240 హెర్జ్ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఆండ్రాయిడ్ 14 ఆధారంగా రూపొందింది. నథింగ్ ఓఎస్ 2.6 అవుట్ ఆఫ్ ద బాక్స్ తో నడుస్తుంది. 3 సంవత్సరాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా హామీ ఇస్తుంది. ఈ ఫోన్ చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ తో వస్తుంది. దీనిని నథింగ్ ఎక్స్ యాప్ ద్వారా సెటప్ చేయవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడు 50ఎంపీ కెమెరాలతో ‘నథింగ్’ కొత్త స్మార్ట్ ఫోన్..
మూడు 50ఎంపీ కెమెరాలతో ‘నథింగ్’ కొత్త స్మార్ట్ ఫోన్..
'నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్.. థ్యాంక్యూ'.. మౌనిక ఎమోషనల్
'నా జీవితాన్ని ఎంతో అందంగా మార్చావ్.. థ్యాంక్యూ'.. మౌనిక ఎమోషనల్
బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..
బంగాళదుంప తింటే బోలెడన్ని ప్రయోజనాలు.. మిస్ చేయకండి..
ఇల్లు కొనకుండా హోమ్ లోన్ సాధ్యమా?మార్కెట్ నిపుణులు చెప్పేదేంటంటే?
ఇల్లు కొనకుండా హోమ్ లోన్ సాధ్యమా?మార్కెట్ నిపుణులు చెప్పేదేంటంటే?
విద్యార్థుల భవితకు IIHM భరోసా.. ఇందులో చేరడానికి 10 కారణాలు ఇవే..
విద్యార్థుల భవితకు IIHM భరోసా.. ఇందులో చేరడానికి 10 కారణాలు ఇవే..
Wayanad Tragedy: ఒకరినొకరు పెనవేసుకుని.. ఆ ఇంట హృదయవిదారక దృశ్యం!
Wayanad Tragedy: ఒకరినొకరు పెనవేసుకుని.. ఆ ఇంట హృదయవిదారక దృశ్యం!
బియ్యం కడిగిన నీటిని జుట్టుకు వాడితే ఏమవుతుందో తెలుసా.?
బియ్యం కడిగిన నీటిని జుట్టుకు వాడితే ఏమవుతుందో తెలుసా.?
మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్.. వృద్ధులకు ప్రత్యేకం..
మూడు చక్రాల ఎలక్ట్రిక్ స్కూటర్.. వృద్ధులకు ప్రత్యేకం..
కాంగ్రెస్‌పై మరోసారి మండిపడ్డ బీజేపీ ఎంపీ.. తన వ్యాఖ్యలను.!
కాంగ్రెస్‌పై మరోసారి మండిపడ్డ బీజేపీ ఎంపీ.. తన వ్యాఖ్యలను.!
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను..
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు పెట్టింది పేరు తాప్సీ పన్ను..